మెయన్ ఫీచర్

జనాదేశ పథంలో... రెండేళ్లు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్వజాతీయ సుప్రభాత
కరములు శ్రుతి చేస్తున్నవి,
స్వాభిమాన సంస్కృతి శుభ
స్వరములు వినిపిస్తున్నవి,
తిరిగి తిరిగి ‘జగతి’ కనులు
‘తూర్పు’వైపు చూస్తున్నవి,
భరతమాతృ కిరణమ్ములు
ధరణి చరిత వ్రాస్తున్నవి..
భారత జాతీయతా గరిమ గత రెండు సంవత్సరాలుగా అంతర్జాతీయ సమాజంలో ప్రస్ఫుటిస్తోంది... ఇలా ప్రస్ఫుటిస్తుండడానికి ‘మాధ్యమం’ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని ‘్భరతీయ జనతాపార్టీ’ ప్రభుత్వం! క్రీస్తుశకం 2014వ సంవత్సరంనాటి లోక్‌సభ ఎన్నికలలో భారత ప్రజలు సాధించిన ప్రజాస్వామ్య విప్లవం ‘్భజపా’కు లభించిన ఘన విజయం... ఈ విప్లవ విజయసారథి నరేంద్ర మోదీ! ‘సంకీర్ణ’ ప్రభుత్వాల ‘శకం’ ముగిసింది, సైద్ధాంతిక పాలనా ధ్వజం పైకెగసింది! అస్థిర రాజకీయ ‘అలసత్వం’ అంతరించింది... సుస్థిర నిష్ఠానిబద్ధ ప్రజాస్వామ్య ప్రస్థానం మళ్లీ మొదలైంది. ఈ ప్రగతి ప్రస్థాన రథసారథి నరేంద్ర మోదీ!! 2014 మే 26న పాలనా బాధ్యతలను స్వీకరించిన నరేంద్ర మోదీ ప్రభుత్వం సాధించిన ప్రధాన విజయం ‘‘విశ్వాసాన్ని పునరుద్ధరించడం!’’ ఎప్పటికైనా విజయలక్ష్యాన్ని సాధించగలవారు ఎవరు? సాధించగల మన విశ్వాసం ఉన్నవారు మాత్రమే.... విశ్వాసం నిండిన స్వజాతీయ స్వాభిమాన సమష్టి మనఃప్రవృత్తి భారత జన మానస క్షేత్రంలో నలువైపులా నర్తిస్తోంది.... రెండేళ్ల పాలనలో నరేంద్రమోదీ సాధించిన ‘పరివర్తన’ ఇది.... ఈ ‘పరివర్తన’ అంతర్జాతీయ సమాజంలో మన దేశానికి వినూతన పరిగణనను సాధించి పెట్టింది... ప్రపంచ దేశాలలో భారతదేశం పట్ల ‘్ధ్యస’ పెరుగుతోంది, నిరంతరం విస్తరిస్తోంది! వాస్తవాన్ని గుర్తించడం కొందరికి నచ్చకపోవచ్చుకాక.... రాజకీయ సంకుచిత ప్రయోజన నిబద్ధత నుంచి విముక్తమై జాతీయ హితబద్ధమైన బుద్ధికి మాత్రం వాస్తవం భాసిస్తోంది. ఈ రెండేళ్లలో భారతదేశం గరిమ అంతర్జాతీయ సమాజంలో ద్విగుణీకృతం అయింది....
ఈ సాఫల్యం వెనుకనుంచి వైఫల్యం తొంగిచూస్తోంది. సాఫల్యం సాంస్కృతిక ప్రభావ విస్తరణకు సంబంధించినది. వ్యూహాత్మక దౌత్యనీతికి సంబంధించినది. అంతర్జాతీయ యోగ దినోత్సవం- అంతర్ రాష్ట్రీయ యోగ్ దివస్- దాదాపు అన్ని దేశాలలోను జరుపుకుంటుండడం స్వజాతీయ సాంస్కృతిక ప్రభావవ్యాప్తికి ప్రతీక. చౌబహార్ ఓడరేవును అభివృద్ధి చేయడానికి వీలుగా ఈ మే నెల 23వ తేదీన ఇరాన్‌తో ఒప్పందం కుదుర్చుకోగలడం చైనాపై మన ప్రభుత్వం సాధించగలిగిన వ్యూహాత్మక విజయపతాక. కానీ కృత్రిమ వాణిజ్య ప్రపంచీకరణ శృంఖలాబద్ధమై ఉన్న స్వజాతీయ సమాజాన్ని నరేంద్ర మోదీ ప్రభుత్వం విముక్తం చేయలేకపోవడం రెండేళ్ల చరిత్ర. ఈ శృంఖలాలు సడలిపోయే సూచనలు కనిపించడం లేదు, మరింతగా బిగిసిపోవడానికి ప్రభుత్వ విధానాలు దోహదం చేస్తున్నాయి. నిజం కొందరికి నిష్ఠురమైన అసత్యంగా ధ్వనింపవచ్చుకాక! భారతీయ సమాజం అనాదిగా తత్త్వప్రధానమైన జాతీయ జీవనం! అందువల్ల వైయక్తిక ప్రాధాన్యం, వ్యక్తి ఆరాధన హైందవ జాతీయ జీవనానికి ప్రాతిపదికలు కాలేదు! సకల ఉపనిషత్తుల సారమైన భగవత్ గీతాశాస్త్రాన్ని మరోసారి ఆవిష్కరించినందువల్లనే ద్వాపర యుగంనాటి యదుకుల కృష్ణుడు జగత్తునకు గురువయ్యాడు. యదుకుల కృష్ణుడు ఆవిష్కరించినందువల్ల మాత్రమే ‘గీతాశాస్త్రం’ గొప్పది కాలేదు. ఆ శాస్తన్రిహితమైన తత్త్వం ఆది, అంతములు లేని అజరామరమైన శాశ్వత సత్యం! హరిశ్చంద్రుడు పలికినందువల్ల సత్యం గొప్పదికాలేదు. సత్యాన్ని పలకడంవల్ల త్రేతాయుగంనాటి హరిశ్చంద్రుడు గొప్పవాడయ్యాడు. తత్త్వ ప్రధాన జాతీయ జీవనం అని అంటే ఇదీ. ఇదే జనవాక్యం! ప్రజాస్వామ్య రాజ్యాంగ వ్యవస్థ ఈ అనాది జాతీయ ప్రస్థానంలో భాగం మాత్రమే, ఈ వాస్తవాన్ని గుర్తించడంవల్ల మాత్రమే భారతీయుడు ‘్భరతీయుడు’గా మనుగడ సాగించగలడు. ఈ భారతీయ భూమికపై నిలబడి నిర్ధారించేవారికి సమస్యలు వాటి పరిష్కారాలు ప్రధానం, వ్యక్తులు వారి ప్రాబల్యాలు ప్రధానం కాదు. మన్‌మోహన్‌సింగ్ ప్రభుత్వం పదేళ్లపాటు మన నెత్తికెత్తిన ‘ప్రపంచీకరణ’ ‘్భరతీయత’కు గొడ్డలి పెట్టు! జాతీయ ఆర్థిక వ్యవస్థ క్షతగాత్ర కావడానికి ఈ ‘గొడ్డలి’ కారణం! నరేంద్రమోదీ ప్రభుత్వం ఈ ‘క్షతి’ని - గాయాన్ని - మాన్పాలన్నది 2014నాటి ఎన్నికలలో ‘్భజపా’ను గెలిపించిన వారి ఆకాంక్ష! ఐదేళ్లకో పదేళ్లకో ఒకసారి మారిపోయే రాజకీయ ‘పర్యాయపీఠం’- సబ్‌స్టిట్యూట్-వలెకాక, ‘కాంగ్రెస్’కు సర్వసమగ్ర సైద్ధాంతిక ‘ప్రత్యామ్నాయం’- ఆల్టర్‌నేటివ్-గా ‘్భజపా’ ప్రభుత్వం వికసించాలన్నది జాతీయ మనోభీష్టం. కానీ, మన్‌మోహన్‌సింగ్ ప్రభుత్వం అనుసరించిన ‘ప్రపంచీకరణ’ విధాన వైపరీత్యాన్ని నరేంద్రమోదీ ప్రభుత్వం కొనసాగిస్తోంది! చిల్లర వర్తకంలోకి సైతం విదేశీయ సంస్థలు చొరబడిపోవడం, వ్యవసాయానికి పట్టిన ‘బి.టి.’ తెగులు ముదిరిపోతుండడం కొన్ని ఉదాహరణలు మాత్రమే! విదేశీయుల పెట్టుబడులపై ఆధారపడికాక, స్వదేశీయుల నిధులతో సర్వసమగ్ర ఆర్థిక వికాసాన్ని సాధించగలమని లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ‘్భజపా’ నాయకులు హోరెత్తించిన వాగ్దానాలు ఇప్పటికీ ప్రజల చెవులలో మారుమోగుతున్నాయి. మన్‌మోహన్‌సింగ్ ‘ప్రపంచీకరణ’ విధానం తప్పు, భారతీయతకు ముప్పు! దానే్న నరేంద్రమోదీ పాటించినందువల్ల అది ‘ఒప్పు’ కాజాలదు. వౌలిక పారిశ్రామిక ఉత్పత్తులు పెరగడం లేదు!! వ్యవసాయ భూమి విస్తీర్ణం తగ్గిపోతోంది! ఈ రెండూ మన్‌మోహన్‌సింగ్ ప్రభుత్వ విధానాల ‘వారసత్వం’.
చైనా ప్రభుత్వం బంగ్లాదేశ్‌లోని ‘చిట్టగాంగ్’ నుండి పాకిస్తాన్‌లోని ‘గ్వాడార్’ వరకు గల ఓడరేవులను ‘అభివృద్ధి’ చేస్తోంది. బర్మా, శ్రీలంక, మాల్ దీవులలోని ఓడరేవులలో సైతం చైనా చొరబడిపోయింది. మన దేశాన్ని ఉత్తరం వైపునుండి క్రీస్తుశకం 1962లో దురాక్రమించిన చైనా మిగిలిన మూడువైపులనుంచి కూడా ‘దిగ్బంధం’ చేయడానికి ఈ ‘చొరబాటు’ దోహదం చేస్తోంది.
మాల్ దీవులలో చరిత్రలో మొదటిసారిగా చైనా దౌత్య కార్యాలయాన్ని ఏర్పాటు చేసింది. ఇలా ఏర్పాటు చేసిన వెంటనే మాల్‌దీవుల ప్రభుత్వం మన దేశానికి చెందిన ఒక వాణిజ్య సంస్థను తమ దేశంనుండి వెళ్లగొట్టింది, ఈ సంస్థవారు మాల్‌దీవుల రాజధాని మాలే విమానాశ్రయాన్ని అభివృద్ధి చేయడానికి కుదుర్చుకున్న ఒప్పందాన్ని రద్దు చేసింది, విమానాశ్రయాన్ని ఆధునీకరించే బాధ్యతను చైనావారికి అప్పగించింది! ఓడ దొంగలను అరికట్టే నెపంతో పాకిస్తాన్‌తో కలసి అరేబియా సముద్రంలో చైనా యుద్ధనౌకలు నిరంతరం విహరిస్తున్నాయి. పాకిస్తాన్ ప్రభుత్వ బీభత్స విభాగం ‘ఇంటర్ సర్వీసెస్ ఇంటలిజెన్స్’- ఐఎస్‌ఐ-వారి కృషి ఫలితంగా ఓడ దొంగలకూ ‘తాలిబన్ జిహాదీ’లకు మధ్య అనుసంధానం ఏర్పడిపోయింది. మన లక్షద్వీపాలకు అత్యంత చేరువలోని హిందూ మహాసాగర జలాలలో ‘అపురూప సంపద’ను అనే్వషించేందుకు చైనాకు ఐక్యరాజ్యసమితి అనుమతి కూడ లభించింది. ఈ విపరిణామాల ముందు మన్‌మోహన్‌సింగ్ ప్రభుత్వం పదేళ్లపాటు చతికిలపడి ఉండడం చరిత్ర. నరేంద్రమోదీ ప్రభుత్వం ఈ చతికిలపడి ఉండే పద్ధతికి స్వస్తిచెప్పగలిగింది. ‘చౌబహార్’ ఒప్పందం ఇందుకు సరికొత్త సాక్ష్యం. పాకిస్తాన్‌లోని గ్వాడార్ ఓడరేవుకు అత్యంత సమీపంలోని ఇరాన్ సముద్ర తీరంలో ‘చౌబహార్’ ఓడరేవు ఉంది. నరేంద్రమోదీ 23వ తేదీన ఇరాన్‌లో పర్యటించిన సందర్భం కుదిరిన ఈ ఒప్పందం చైనాపై మన ప్రభుత్వం సాధించిన వ్యూహాత్మక విజయం... విస్తరించిపోతున్న చైనాకు మన ప్రతిఘటన మొదలైంది! లడక్‌లోకి, అరుణాచల్‌లోకి, చైనా సైనికులు పదే పదే చొరబడి పోతుండడం ఏళ్లతరబడి కొనసాగుతున్న ప్రహసనం. కానీ నరేంద్రమోదీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత లడక్‌లో చైనా సైనికులను మన సైనికులు ప్రతిఘటించడం మొదలైంది. 2014 సెప్టెంబర్‌లో లడక్‌లో ‘వాస్తవ ఆధీనరేఖ’ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్- ఎల్‌ఏసి- దాటి వచ్చిన చైనా సైనికుల మెడలను పట్టుకొని మన సైనికులు ‘రేఖ’ అవతలికి నెట్టేశారు. అప్పటినుంచి లడక్‌లో చైనా చొరబాట్లు తగ్గిపోయాయి. ఇది మన ‘్భరత టిబెట్ సరిహద్దు పోలీసుల’ సమర పటిమకు నిదర్శనం. మోదీ ప్రభుత్వం ఈ పటిమకు పదనుపెట్టింది. స్వతంత్ర భారత చరిత్రలో మొదటిసారిగా మన సైనికులు బర్మాలోని చొచ్చుకొని వెళ్లడం చైనాపై నరేంద్రమోదీ ప్రభుత్వం సాధించిన వ్యూహాత్మక విజయం. బర్మాలో నక్కి ఉండిన భారత వ్యతిరేక బీభత్సకారుల స్థావరాలను మన సైనికులు ధ్వంసంచేసి వచ్చారు! ఈ బీభత్సకారులను చైనా ప్రభుత్వమే ఉసిగొల్పిందని మన ప్రభుత్వం గత ఇరవై రెండవ తేదీన ప్రకటించింది! ఇలా మన దేశం భౌతికంగా, వ్యూహాత్మకంగా చైనాను ప్రతిఘటించగలదన్న విశ్వాసం పెరగడం మోదీ ప్రభుత్వ విజయం....
‘స్వచ్ఛ భారతం’ అనేకానేక ప్రగతి పథకాలకు సంక్షేమ ప్రణాళికలకు వౌలికమైన భూమిక! అందువల్ల మోదీ ప్రభుత్వ పథకాల విజయాలకు మాధ్యమం ‘స్వచ్ఛ్భారతం’. ‘స్వచ్ఛ్భారతం’లో మాతృభూమి పట్ల మమకారం ధ్వనిస్తోంది! పంచభూత భాసితమైన ప్రకృతి పరిశుభ్రంగా ఉండడం, పంచభూతమయమైన మానవుని ప్రగతికి సుగతికి సాధనం. ప్రగతి భౌతికమైనది, సుగతి సాంస్కృతికమైనది. ఈ ‘సముత్కర్షము’, ‘నిఃశ్రేయసము’ భారత జాతీయ జీవన రథానికి అనాదిగా రెండు చక్రాలు. ఈ జీవన రథం మాతృభూమిపై పరుగులు తీయడం వేదఋషులు దర్శించిన చరిత్ర, సనాతన హైందవ జాతీయులు నిర్మించిన చరిత్ర.... ఈ చరిత్ర ‘‘పుత్రోహం పృథివ్యాః’’- ‘‘నేను’ భూమికి బిడ్డను’’ అన్న సనాతనుని చరిత్ర... ‘స్వచ్ఛ్భారతం’. ఇలా ఈ భూమితో ముడిపడి ఉంది! నరేంద్ర మోదీ పార్లమెంటు భవనంవద్ద భూమికి వంగి నమస్కరించడం ఈ చరిత్రకు పునరావృత్తి... రెండేళ్ల కథకు ప్రధాన ఇతివృత్తం ఇది!
ఈ ‘స్వచ్ఛత’ భౌతికమైనది, భూమిని నీరు శుభ్రం చేయాలన్నది ఆకాంక్ష! ఈ శుభ్రత ద్వారా భూమి స్వరూపం సతత హరిత శోభలను సంతరించుకుంటుంది... ఈ ‘స్వచ్ఛత’ సాంస్కృతికమైనది. అవినీతి అనైతికత అంటని పాలన వికసించడం ఈ సంస్కృతి... నల్లడబ్బును వెలికితీయడానికై నరేంద్రమోదీ ప్రభుత్వం మొదటిరోజుననే ప్రత్యేక విచారణ బృందాన్ని- సిట్- నియమించడం ఈ సంస్కృతి పునరుజ్జీవన శ్రీకారం.

- హెబ్బార్ నాగేశ్వరరావు 99510 38352