మెయన్ ఫీచర్

రక్షణ వ్యవస్థ పాటవం తగ్గుతోంథా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనం ఒక కుక్కపిల్లను తెచ్చి, దానికి రోజూ తిండి పెట్టి ఇంటికి కాపలాగా పెట్టుకుంటాం. అది దొంగలు వచ్చినప్పుడు మొరగటం లేదు సరికదా, ఇంట్లో వాళ్లనే కరిచిందనుకోండి.. మరి ఇంకేమి కాపలా? 1962లో రక్షణమంత్రి కృష్ణమీనన్ హయాంలో చాలా దుర్మార్గాలు జరిగాయి. ముఖ్యంగా సైన్యం ఉపయోగించే ‘మిలటరీ జీపుల కొనుగోలు’లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు అప్పట్లో గుప్పుమన్నాయి. ఐనా, ప్రధాని నెహ్రూ ప్రత్యేక ప్రేమ ప్రదర్శించి మీనన్‌ను కాపాడటంతోపాటు దేశ రక్షణను గాలికి వదిలివేశాడు. ఇలా.. మన రక్షణ వ్యవస్థ పతనం ఈ జీపుల కొనుగోళ్ల దగ్గరే మొదలైంది. 1965లో లాల్‌బహదూర్ శాస్ర్తీ తిరిగి రక్షణ వ్యవస్థను పటిష్ఠం చేశాడు. కానీ, ప్రయోజనం ఏమిటి? ఆయన విదేశీ పర్యటనలో ఉండగా తాష్కెంట్‌లో అకాల మరణం పొందాడు. మన నేతల పుణ్యమాని డెబ్బది సంవత్సరాల కాలంలో దేశ రక్షణ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. ఇదే సమయంలో మన అంతర్గత వ్యవహారాలు సైతం బయటకు పొక్కడం ప్రారంభమైంది. వేలుపిళ్ళై ప్రభాకరన్ అనే ‘తమిళ పులి’కి తమిళనాడులోని డిఎంకె వంటి రాజకీయ పార్టీల నుండి ప్రత్యక్షంగా సహాయం అందటం ఏమిటి? ‘మాపై చర్య తీసుకుంటే ప్రభుత్వాన్ని కూల్చివేస్తాం’ అని అప్పట్లో కరుణానిధి ప్రధాని మన్మోహన్ సింగ్‌ను బెదిరించటం ఏమిటి? ‘సంకీర్ణ ధర్మం పాటించక తప్పదు’ అని మన్మోహన్ సమాధానం చెప్పటం ఏమిటి? ప్రపంచంలో వేరొక దేశంలో ఎప్పుడైనా ఇలా జరిగిందా? రక్షణశాఖ మాజీ మంత్రి ఎ.కె.ఆంటోనీ అరుణాచలప్రదేశ్‌లో పర్యటించినపుడు- ‘నువ్వు ఈ ప్రాంతం వదిలిపెట్టి వెళ్లిపో..!’ అని చైనా బెదిరించటం ఏమిటి? చైనా వారు ఆక్సాయ్‌చిన్ లఢక్, బ్రహ్మపుత్ర పరీవాహక ప్రాంతాలను ఆక్రమించుకున్నారు. అయినా భారత ప్రభుత్వం చైనాను ఎందుకు బెదిరించలేక పోయింది? అంటే- భారత్ రక్షణ వ్యవస్థను భారతీయులే నిర్వీర్యం చేశారని భావించాలా?
2017, జనవరి 9వ తేదీన బాబర్-3 అనే పేరుతో క్షిపణి ప్రయోగాన్ని విజయవంతంగా భారత్ నిర్వహించింది. దీని సామర్థ్యం 450 కిలోమీటర్ల దూరం. నీటిలో, గాలిలో, నేలపై తన సుదూర లక్ష్యాన్ని ఇది ఛేదించగలదు. దీనిని ఎస్‌ఎల్‌సిఎం అంటారు. ఇంటర్‌కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్ జాబితాలోకి ఈ ప్రయోగం చేరుతుంది. ఇక్కడ గమనింపవలసిన అంశం ఏమంటే ఇందుకు అవసరమైన సమస్త సాంకేతిక పరిజ్ఞానమూ చైనా నుండి మనకు లభించింది.
చైనా మాండలిన్‌లో ఇచ్చిన సంకేతాలను డిసిఫర్ చేసుకోగలిగింది (అంటే ఆ కోడ్ లాంగ్వేజిని విన్పి చెప్పగలిగింది) అని వారి రక్షణ శాఖాధికారి సంతోషంతో ప్రకటించారు. సరిగ్గా అదే రోజు ఉత్తరకొరియా నుండి మరొక వార్త వచ్చింది. ‘ఏ క్షణంలోనైనా మేము హైడ్రోజన్ బాంబును పేలుస్తాం’ అని. ఇది కూడా చైనా సహాయంతోనే నిర్మాణమైంది. ఉత్తరకొరియా వల్ల దక్షిణ కొరియాకు, పాకిస్తాన్ వల్ల ఇండియాకు ప్రత్యక్ష ప్రమాదం ఉన్నప్పటికీ పరోక్షంగా మొత్తం ఆసియా ఖండం మరుభూమిగా మారే ప్రమాదం ఉంది. దీనిని విజ్ఞులు గమనించారా? మరి మన దేశంలో ఏం జరుగుతున్నది? దేశ రక్షణను గాలికి వదిలి ధన సంపాదన వెనుక కొందరు నేతలు, అధికారులు పడ్డారు. కాంగ్రెస్ నేతలు రణదీప్ సుర్జీవాలా, అంబికా సోనీ తమ పార్టీ అధినాయకురాలు సోనియా గాంధీ ఎలాంటి తప్పులు చేయలేదని 2017 జనవరిలో ప్రకటించారు. యుపీఎ హయాంలో ప్రధాని మన్మోహన్ సింగ్‌ను, రక్షణ మంత్రి ఏకే ఆంటోనీలను తోలుబొమ్మలుగా ఆడించింది ఎవరో ప్రజలకు తెలుసు. యుపీఎ దశాబ్ద కాలం పాలనలో రక్షణ రంగం భ్రష్టుపట్టింది. చైనాలో, పాకిస్తాన్‌లో ‘్భరతమాతాకీ జై’ అనేవాడు ఒక్కడూ లేడు కాని ఇండియాలో పెద్ద సంఖ్యలో చైనా చప్రాసీలు, పాక్ గూఢచారులు చట్టబద్ధంగానే పనిచేస్తున్నారు. వారిని అదుపు చేయకుండా భారత ప్రభుత్వాలు దశాబ్దాల పర్యంతం మీనమేషాలు లెక్కబెట్టుకుంటూ కూర్చున్నాయి. ఇది అకర్మణ్యత-ఆత్మవంచన. కనీసం ఇప్పుడు మోదీ ప్రభుత్వమైనా సకాలంలో చర్యలు తీసుకోగలదా?
సామాన్యంగా తనకు అవసరమైన కొనగోళ్లపై రక్షణ శాఖ నిర్ణయాలు తీసుకుంటుంది. కానీ మన దేశంలో అలా జరగడం లేదని గతానుభవాలు చెబుతున్నాయి. పనె్నండు వీవీఐపీ ఛాపర్ల కొనుగోళ్ళ సందర్భంగా అహ్మద్ పటేల్ అనే కాంగ్రెస్ నేత కీలక నిర్ణయాలు తీసుకున్నాడు. ఆ చాపర్లలో రాష్టప్రతి, ప్రధాని వంటి అత్యంత కీలకమైన పదవుల్లో ఉన్నవారు ప్రయాణం చేయవలసి ఉంటంది. ఇవి ఎగిరే ఎత్తును తగ్గించి ఫిన్ మెకానికా అనే కంపెనీకి కాంట్రాక్టును అహ్మద్ పటేల్ ఇప్పించాడు. ఈ విషయం స్వయంగా నాటి వైమానిక దళాధిపతి ఎ.పి.త్యాగితో పాటు దళారి మైఖేల్ క్రిస్టియన్ చెప్పాడు. ప్రధానమంత్రి కార్యాలయం నుంచి నుండి తనకు ఆదేశాలు వచ్చినట్లు త్యాగి 10-12-2016 తేదీన ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నాడు. అహ్మద్ పటేల్ సోనియా గాంధీకి బినామీ అని విపక్షాలు ఆరోపిస్తుంటాయి. దేశంలో ఏం జరుగుతున్నది? రక్షణ రంగం కొనుగోళ్లలో అందిన ముడుపులన్నీ ఎక్కడికి పోయాయో చెప్పవలసిన బాధ్యత ప్రస్తుత ప్రధాని మోదీపై ఉంది.
ప్రజల సహనం ఇప్పటికే నశించింది. ఇక, పెద్దనోట్ల రద్దు తర్వాత దేశంలో అప్రకటిత ఆర్థిక అత్యవసర పరిస్థితి ఏర్పడినా 125 కోట్లమంది భారతీయులు తిరగబడలేదు. కారణం- ‘ఉందిలే మంచి కాలము ముందు ముందునా’ అని పాట పాడుకున్నారు. అయితే, బిజెపి ప్రభుత్వం సాకులు చెప్పే అవకాశం లేదు. గత ప్రభుత్వ హయాంలోనే కాదు, ఇప్పటి పాలకుల్లో సైతం ఎవరి వద్ద అక్రమాస్తులు ఉన్నాయో నిగ్గు తేల్చాల్సి ఉంది. నోట్లరద్దు సమయంలో సామాన్యులు గంటల తరబడి బ్యాంకుల ముందు నిరీక్షించి నీరసించిపోయినా రెండువేల రూపాయలు ఇచ్చి పంపారు. మరి దొడ్డన్న అనే కర్ణాటక సినీనటుడి అల్లుడి ఇంట్లోకి కోట్ల విలువ చేసే రెండు వేల రూపాయల కట్టలు ఎలా వచ్చాయి? బాత్‌రూంలో స్టీల్ బీరువాలో రహస్య నిధులున్నాయి. అండర్ గ్రౌండ్ సెల్లార్లలో, జాడీలలో బంగారు బిస్కెట్లు ఉండటం భారతదేశంలోనే జరుగుతుంది. దేశం నిండా ఎందరో కన్నయ్యలు, దొడ్డన్నలు, ‘చిన్నమ్మ’లు ఉన్నారు. వారిని ఉపేక్షించటం నరేంద్ర మోదీకి ఇక తగదు.
దేశ ప్రజలు ఇప్పుడు అగ్నిపర్వతం అంచు మీద కూర్చున్నారు. కర్నాటకలో వలే ‘గాలి’ దుమారం ఏపీ, యూపీ, తెలంగాణ, బెంగాల్, బిహార్ వంటి అనేక రాష్ట్రాల్లోనూ కనిపిస్తోంది. ఢిల్లీ నుండి ఆ మధ్య మన హైదరాబాద్‌కు వచ్చిన సీనియర్ ఉద్యోగి టి.శ్రీనివాస శర్మగారిని కలిసినపుడు కొన్ని ఆసక్తికరమైన అంశాలు తెలిశాయి. ఆయన దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావుదగ్గర దశాబ్దాల పాటు పనిచేశారు. ప్రస్తుత పాలనా విధానం ఎలా ఉందో వ్యాఖ్యానించమని కోరగా శర్మ ఇలా అన్నారు. ‘ప్రధాని పీఠంపై ఎవరు కూర్చున్నా కఠోర నిర్ణయాలు తీసుకోవలసిందే. కాకుంటే వాజపేయి మిరియాల కషాయంలో తేనె కలిపి అందించారు. పీవీ మాత్రం ‘ఇది తేనె.. తాగండి’ అని కషాయాన్ని భ్రమింపజేశారు. నరేంద్ర మోదీ మాత్రం ‘ఇది కఠోరమైన కషాయం- ఔషధం వలే తాగవలసిందే అని అంటున్నారు. ఇంతే తేడా?’ అన్నారు. రక్షణ శాఖతో పాటు కీలక విభాగాల్లో అక్రమాలు చోటుచేసుకోవడం షరామామూలైంది.
చైనా జనాభా ఎంత ఉందో భారత్ జనాభా కూడా కొంచెం తక్కువగా ఉంది. చైనా అణ్వస్త్ర దేశం. భారత్ వద్ద కూడా వందలాది న్యూక్లియర్ వార్‌హెడ్స్ ఉన్నాయి. చైనా వారి సైన్యంతో భారత సైనికుల పరాక్రమం ఏ విధంగానూ తీసిపోదు. ఐనా చైనా భారత్‌ను ఎందుకు బెదిరిస్తున్నది? భారత్ ఎందుకు వెనుకడుగు వేస్తున్నది? ఈ ప్రశ్నకు సమాధానం లోతుగా ఆలోచింపవలసి ఉంటుంది. భారత్ విధ్వంసానికి కుట్ర పన్నిన మసూద్ అజర్ అనే తీవ్రవాదిని చైనా శాంతిదూతగా వర్ణించింది. ఇండియా మంగోలియాకు బిలియన్ డాలర్ల సహాయం ప్రకటించడాన్ని చైనా తప్పు పడుతున్నది. భారత్ ఎన్‌ఎస్‌జి సభ్యత్వం పొందడాన్ని అడ్డుకున్నది. ఆ మధ్య చైనా విదేశంగ ప్రతినిధి జెంగ్ షూయెంగ్ మాట్లాడుతూ, మసూద్ అజర్ శాంతి దూత అంటూ పునరుద్ఘాటించాడు. బౌద్ధమత ప్రముఖుడు దలైలామా భారత్‌ను సందర్శించడాన్ని చైనా తప్పుపడుతున్నది. ‘మీరు మంగోలియాకు దగ్గర ఆపుతున్నపుడు మేము నేపాల్‌లో రైలు మార్గం నిర్మించుకుంటే తప్పేమిటి? అని చైనా ప్రశ్నించింది. చైనా దూకుడుకు కారణం ఏమిటి? అంటే అదొక నియంతృత్వ సామ్రాజ్యవాద దేశం. నీతి, నియమం, ధర్మం, న్యాయం వంటి పదాలు ఆ దేశపు నిఘంటువులో ఉండవు. ఇక రెండవ కారణం చైనాలో చైనాద్రోహులు ఉండరు. ఉండలేరు! ఉంటే వారిని కచ్చితంగా ఉరితీస్తారు. కానీ, భారత్‌లో కొంతమంది దేశద్రోహులే కాదు చైనా అనుకూల వర్గాలు భారీ సంఖ్యలో ఉన్నాయి. ఇది చైనాకు ప్రధాన బలం. గత అరవై సంత్సరాలుగా కాంగ్రెస్ పాలకులు చేసిన ఉపేక్ష- ఈ జాతి భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మార్చింది.
ఇపుడు ఇండియా ఏం చేయాలి? వెంటనే దేశంలోని చైనా అనుకూల వర్గాలను అణచివేయాలి. చైనాతో సమాన స్థాయిలో వ్యవహరించాలే కాని నంగినంగిగా మాట్లాడకూడదు. చైనా కబంధ హస్తాల నుండి నేపాల్, టిబెట్, పాకిస్తాన్ ప్రజలను విముక్తం చేసేలా భారత్ చొరవ చూపాలి. ఈ పని ఇప్పుడు నరేంద్ర మోదీ చేయకపోతే ఇక ఎప్పడూ ఎవరూ చేయలేరు.
*