మెయిన్ ఫీచర్

అమృతమూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజమే అమ్మ అంటే అమృతమూర్తే. అనురాగం, అప్యాయత లే ఆమెను చూస్తే గుర్తుకువస్తాయి. మహాభారత కాలంలో భృంగాశ్వుడు అను ఒక రాజు ఉండేవాడు. అతనికి సంతానం లేదు. ఎన్నో యజ్ఞాలు యాగాలు చేశాడు. కాని సంతానాన్ని పొందలేకపోయాడు. ఎలాగైనా సంతానం కావాలని ఇంద్రుడికి సమ్మతి లేని యాగం చేశాడు. దాంతో ఆయనకు వంద మంది పుత్రులు కలిగారు.
ఎంతో సంతోషంతో పుత్రులతో కాలం గడుపుతున్నాడాయన.
కాని ఒకరోజు వేటకు వెళ్లాడు. అలసి పోయి దాహం వేసి దగ్గరలో ఉన్న ఒక కొలనులోని నీటిని తాగాడు. అంతే భృంగాశ్వుడు కాస్తా భృంగాశ్విని అయ్యింది. అంటే ఆ రాజు స్ర్తిగా మారిపోయాడు. కాని అన్ని విషయాలు ఆయనకు గుర్తున్నాయి. వెంటనే తన రాజధానికి వెళ్లాడు. తన పుత్రులతో జరిగిన విషయం చెప్పాడు. వారు ఇక నుంచి నాన్న బదులు అమ్మ అని పిలుస్తామని అన్నారు. భృంగాశ్వని ఎంతో సంతోషించింది. వారికి రాజ్యం అప్పగించింది. రాజ్యపాలనలో మెలుకువలు నేర్పింది. తిరిగి అడవికి వచ్చింది. అక్కడ ఒక తాపసిలాగా జీవనం గడుపుతోంది. అప్పుడప్పుడు తన పూర్వపు కొడుకులను గురించి తెలసుకొంటూ ఇక్కడ తాపసి లాగా తన జీవన చర్యలను మార్చుకుంది.
ఈమె దినచర్యలను, సత్యనిష్ఠను చూసి ఒక ముని ఎంతో ముచ్చటపడ్డాడు. ఈమె గురించి తెలసుకొన్నాడు. నీవు ఎలాగూ స్ర్తి వయ్యావుకదా నిన్ను నేను పెళ్లి చేసుకొంటాను అన్నాడు . భృంగాశ్విని నాకు బిడ్డలను ప్రసాదిస్తారా అని అడిగింది. ఆమెకున్న పుత్రవాత్సల్యానికి మరింత ముచ్చట పడ్డ ఆ ముని సరే నన్నాడు.
అలా వాళ్లిద్దరూ భార్యభర్తలు అయ్యారు. భృంగాశ్వినికి నూరుగురు పుత్రులు పుట్టారు. ఆమె వారిని చూసుకొని ఎంతో సంతోషించింది.
వెంటనే తన పూర్వపు కొడుకులను పిలిచి ఇదిగో వీరంతా కూడా మీకు తమ్ముళ్లు అవుతారని పరిచయం చేసింది. ఆ వంద మంది ఈ వందమంది కలసి ఎంతో అన్యోన్యంగా అనురాగంగా మసలుకునేట్లుగా వారిని పెంచింది. అట్లా రెండవందల మంది పుత్రులతో భృంగాశ్విని ఎంతో సంతోషంగా కాలం గడుపుతోంది.
అది ఇంద్రుడు చూశాడు. అమ్మా! ఈ రాజు రాణి గా అయ్యి కూడా ఇంకా పుత్రవాత్సల్యాన్ని పుత్ర మమకారాన్ని పెంచుకున్నాడు కదా. ఇపుడు స్ర్తి కనుక ఏమీ చేయలేదు అనుకొని ఈ పుత్రులందరూ ఒకరినొకరు కొట్టుకొనేట్లుగా వారిలో వారికి ఈర్ష్యాసుయలు పుట్టేలాగా చేశాడు. వారిలో వారికి పోట్లాటలు మొదలయ్యాయి. ఒకసారి వారిమధ్య యుద్ధం జరిగింది. వారంతా చనిపోయారు. ఈ సంగతి తెలసుకొని తన భర్త దగ్గర భృంగాశ్విని రోదించింది. ఎంతో కష్టపడి తాను కొడుకులను పొందాను. కాని వారు ఇలా విగతజీవులు అయ్యారు. ఏమి చేయాలా అని బాధపడింది.
అలా ఏడుస్తున్న భృంగాశ్విని చూసి ఇంద్రుడు నవ్వుకున్నాడు. పైగా అక్కడికి వచ్చి భృంగాశ్విని పరిహసించాడు. నీవు రాజువికదా. మరి ఆడదానిలాగా ఏడుస్తున్నావే అన్నాడు. అవును నిజమే ఆడదానిలాగా అన్నావు ఈ స్ర్తి రూపంలోని ఆనందం నీకు ఏమి తెలుసు అని ఇంద్రుడికి అమ్మతనాన్ని గూర్చి చెప్పి తన కొడుకులను బతికించమని కోరింది.
అప్పుడెప్పుడో నేను నీకిష్టంలేని యాగం చేసానని ఇట్లా చేయడం ఏమి భావ్యం. నన్ను క్షమించి నా పుత్రులందరినీ బతికించు అని పదేపదే వేడుకొంది. ఆమె మాటలకు కరిగిన పోయిన ఇంద్రుడు ఎవరైనా ఒక్కనూరుమందిని బతికిస్తానని అన్నాడు. వెంటనే ఇపుడు ఈ ముని తాపసి గా ఉన్నప్పటి కొడుకులను బతికించమని అడిగింది. వారిని ఇంద్రుడు బతికించాడు.
వెంటనే నేనేదో సమ్మూఢబుద్ధితో తప్పుచేశాను. నన్ను క్షమించు. ఎలాగైనా ఆ కొడుకులను కూడా బతికించు అని కాళ్లావేళ్లా పడింది. ఇంద్రుడు సరే అన్నాడు.
చూశారా! ఒక పురుషుడు స్ర్తిగా మారినా సరే ఎంత ఆర్ధ్రతలోనైందో అసలు స్ర్తి స్వభావమే మృదుత్వాన్ని కలిగి ఉంటుంది. స్ర్తి తన సంతానాన్ని రక్షించుకోవడానికి తాను ఎన్ని పొరపాట్లు చేసినానని చెప్పడానికి కూడా వెనకాడదు. తనని ఏదైనా అన్నా కూడా బాధపడకుండా ముందు తన బిడ్డలను రక్షించాలని నుకొంటుంది. అందుకే స్ర్తి అనురాగమూర్తి, అమృతమూర్తి.

- శ్రీలత