మెయిన్ ఫీచర్

పేదరికంలో పుట్టినా... చదువుతో ఎదిగాడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రతిషాఠత్మక అహ్మదాబాద్ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం)లో సీటు వస్తే ఎవ్వఠికీ మాత్రం ఆనందం ఉండదు. ఆ ఇన్‌స్టిట్యూట్‌లో అడుగుపెట్టాలని ఎంతోమంది కలలు కంటారు. పదేళ్లపాటు స్కూలు ముఖమే చూడని ఓ కుర్రాడికి ఆ అవకాశం దక్కింది. చేతిలో చిల్లి గవ్వ లేకపోయనా.. అంచెలంచెలుగా వచ్చిన అవకాశాలను ఏదీ జారవి డుచు కోకుండా అందిపుచ్చుకున్న ఈ మధ్యతరగతి యువకుడు నేడు సీఈఓ స్థాయికి వెళ్లాడు. అతని కెరీర్‌కి పునాది వేసింది మాత్రం ఆనంద్‌కుమార్. బీహార్‌లో పేద విద్యార్థులకు
ఐఐటి శిక్షణ ఇచ్చే సూపర్30 సంస్థ నిర్వాహకులు ఆనంద్‌కుమార్ వద్ద చేరటం తన కెరీర్‌కు పునాది వేసిందని అక్విబర్ రెహమాన్ అం టున్నారు.
అది బీహార్ రాష్ట్రం. పూర్ణియా జిల్లాలోని మహ్మదీయ అనేకు గ్రామం. ఆ గ్రా మానికి ఓకేఒక ప్రభుత్వ పాఠశాల ఉంది. అక్విబర్ రెహమాన్ పదేళ్ల వరకు స్కూలుకే వెళ్లలేదు. తండ్రి అసిఫర్ రెహమాన్ స్టాటిస్టిక్స్ మాస్టర్ డిగ్రీ సంపాదించినా ఓ చిరు కాంట్రాక్ట్ ఉద్యోగి. తల్లి కూడా విద్యావంతురాలవ్వటం వల్ల స్కూలుకు వెళ్లకుండా పదేళ్లు వచ్చేవరకు ఇంట్లోనే చదువుకున్నాడు. ఆ తరువాత పాట్నాలోని తాతగారింటికి వెళ్లి అక్కడ తక్కువ ఫీజు చెల్లించే వెసులుబాటు ఉన్న ముస్లిం పాఠశాలలో ఏడవ తరగతిలో చేరాడు. పదవ తరగతిలో 95శాతం, క్లాస్ 12లో 87.8 శాతం మార్కులు సంపాదించాడు. పదవ తరగతిలో ఉండగానే ఆనంద్‌కుమార్ సార్ గురించి తెలుసుకుని ఐఐటి-జెఇఇ శిక్షణ తీసుకోవాలని భావించాడు. మిగతా స్నేహితులంతా లక్షా యాభైవేల రూపాయలు ఫీజు చెల్లించి శిక్షణ తీసుకుంటే.. అంత ఆర్థిక స్థోమత లేక ఆనంద్‌కుమార్ సార్‌ను సంప్రదించాడు. అక్కడ ఆయన రెండు సంవత్సరాలకు 9వేల రూపాయల ఫీజు మాత్రమే తీసుకున్నారు. ఇక్కడ చేరటంతోనే రెహమాన్ జీవితం మలుపు తిరిగింది. అతని ఆర్థిక పరిస్థితులు, కుటుంబ నేపథ్యం గురించి అడిగి తెలుసుకున్న ఆనంద్ సార్ మానసికంగా ఐఐటి-జెఇఇ పరీక్షకు సిద్ధంచేయటంతో ఏ ప్రశ్న వేసినా చిటికెలో సమాధానం చెప్పే స్థాయికి తీసుకువెళ్లగలిగారు. మంచి ర్యాంక్ రావటంతో మైనంగ్ మెషినరీ ఇంజినీరింగ్ కోర్సులో చేరాను. ధన్‌బాద్‌లోని ఇంజనీరింగ్ కాలేజీలో సీటు రావటం తో అంత పెద్ద ఇన్‌స్టిట్యూట్‌లో చేరాలంటే మొదట కొంచెం భయపడ్డాను. తరువాత అక్కడ వాతావరణానికి అలవాటు పడిపోయాను. ఇక్కడ చేరేవారందరూ పుట్టుకతోనే స్పూన్లతో భోజనం చేసేవారు. రెహమాన్ చేతితో తినే స్థాయి. క్రమేణా అతని అలవాట్లలోనూ, ప్రవర్తనలో హుందాతనం ప్రవేశించింది. ఇంజనీరింగ్ చదువుతుండగానే క్యాట్ పరీక్షకు ప్రిపేర్ అయ్యాడు. ఆనంద్‌సార్ మ్యాథ్స్‌లో వేసిన గట్టి పునాది వల్ల తొలిసారే క్యాట్ ప్రవేశ పరీక్షలో మంచి ర్యాంక్ వచ్చింది. దీంతో రెహమాన్‌కు అహ్మదాబాద్‌లోని ఐఐఎంలో సీటు వచ్చింది. అందివచ్చిన అవకాశాన్ని జారవిడుచుకోకుండా అక్కడ చేరిపోయాడు. ఇక్కడ పాఠ్యపుస్తకాల్లో నేర్చుకునేదానికంటే ఫీల్డ్‌లో సంపాదించే అనుభవమే విద్యార్థులను ఉన్నత శిఖరాలకు చేర్చుతోంది. డిజైనింగ్, స్టేటజీ, మార్కెటింగ్, క్రమశిక్షణ, సమయపాలన, అంకితభావం అనే ఆరింటిలో చూపిన శ్రద్ధాసక్తులు రెహమాన్‌ను విదేశాలకు పయనించేలా చేశాయి.
ఎక్కడో కుగ్రామంలో చదువు సంధ్యలేకండా తిరిగే అతను విదేశాలకు వెళ్లే స్థాయికి వెళ్లటం రెహమాన్ కలల సాకారానికి నిదర్శనంగా చెప్పవచ్చు. 2014లో ఎనర్గో ఇంజనీరింగ్ కంపెనీకి బిజినెస్ డెవలప్‌మెంట్ మేనేజర్ అయ్యాడు.. ఇక్కడ చూపిన ప్రతిభాపాటవాల వల్ల కొద్ది రోజుల్లోనే మరో కంపెనీకి సీఇఓగా వెళ్లాడు. భవిష్యత్తులో వ్యాపార రంగంలోకి ప్రవేశించి వ్యాపారవేత్తగా స్థిరపడి పేదలకు ఉద్యోగావకాశాలు ఇవ్వాలనే లక్ష్యంతో రెహమాన్ అడుగులు ముందుకు వేస్తున్నాడు. చారిటీ వంటి సంస్థల పట్ల తనకు నమ్మకం లేదని వ్యాపార సంస్థను స్థాపించి ఉపాధి అవకాశాలు కల్పించటమే ధ్యేయంగా ముందుకు సాగుతున్న రెహమాన్ నిన్నటి కంటే ఈ రోజు మంచివ్యక్తిగా తనను తాను నిరూపించుకోవటానికి ప్రతి మనిషి ప్రయత్నిస్తే ఆకాశమే సొంతమవుతోందంటాడు.

chitram అహ్మదాబాద్ ఐఐఎం నుంచి పట్టా తీసుకుంటున్న రెహమాన్