మెయిన్ ఫీచర్

అన్నింటికీ ఆధారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనుష్యులందరూ సమానమే అయినా స్ర్తికి మాత్రం ప్రకృతి ఎక్కువ బాధ్యతలనే పెట్టింది. ఇక జీవితంలోను అంతా ఆడాళ్లదే బాధ్యత అంటూ స్ర్తిని కొన్నాళ్లు వంటింటికి పరిమితం చేసినా నేడు పరిమితులు లేవు మీరు సంపాదించుకోండి. మీకూ సమాన అవకాశాలు అంటూ అన్నిరంగాల్లోకి స్ర్తి దేదీప్యమానంగా దూసుకెళ్లే అవకాశాలు వచ్చాయి.
నిజమే. ఇపుడు అన్ని రంగాల్లోను స్ర్తి ఉంది. కాని, ఆఫీసుల్లోను నైపుణ్యంతో చేసే పనులు, నిదానంగా వ్యవహారం చెడకుండా చేసేపనులు ఇట్లాంటివి స్ర్తిలకే అప్పజెప్పేస్తున్నారు. ఇంకా కొన్ని సంస్థల్లో అయితే స్ర్తిని ఆర్థిక నిపుణురాలిగా పెట్టుకొంటే పొదుపు చర్యలుకూడా ఆమెనే తీసుకొని కంపెనీ ఆర్థికంగా మెరుగుపరుస్తుందని ధృడంగా నమ్ముతున్నారు.
న్యాయవాదుల్లో కూడా కాస్త క్లిష్టమైన సమస్యలు వస్తే ఒక లేడీ లాయర్ సలహా తీసుకొందాం అనేవారు ఉన్నారు. సినిమాల్లో అయితే సాధారణ సినిమాల్లో ప్రేమ సీన్లు.. లేకపోతే హీరో పక్కన ఆటబొమ్మగా కనిపించడమే అనేవాటికి తెరపడింది. కాకపోతే లేడీఒరియెంటెడ్ సినిమా అంటే అన్ని పాత్రలకన్నా గొప్పగా అటు చాకచక్యంతో చేసే పనులు, నీతిన్యాయాలకు మారుపేరుగా ఉన్న పనులు ఇవి అన్నీ కూడా ఒక స్ర్తి చేయగలదు అని చూపిస్తున్నారు.
బాగానే ఉంది. ఇన్ని పనులు చేస్తున్నా కూడా స్ర్తి తనకు తానే మరికొన్ని బాధ్యతలను తనపై వేసుకొంటుంది. అదే కుటుంబం అంతా సంతోషంగా ఉండడానికి తనకు కూడా తెలీయకుండానే తన వంతు బాధ్యతను నెరవేరుస్తుంది. దీన్ని ఎవరూ గుర్తించకపోవడం విడ్డూరం.
ఒక సామాన్యస్ర్తి ఇండ్లల్లో పనిచేసుకొని బతుకీడుస్తున్న మనిషి దగ్గర నుంచి మంచి కంపెనీలో అతిపెద్ద హోదాలో ఉన్న మనిషియైనా లేదా కంపెనీనే స్థాపించిన యజమానియైనా ఒక్కవిషయంలో మాత్రం ఒక్కటిగానే వ్యవహరిస్తున్నారు.
అదే తాగుడు... మద్యపానం .. ఇంకేదైనా పేరు పెట్టుకోండి. ఒకరు చెట్టు కింద కూర్చునితాగితే మరొకరు బెంచీమీద కూర్చుంటారు. మరొకరు ఫ్యాన్ కింద మరొకరు ఏసీలో మరొకరు అత్యాధునిక మద్యపానంతోపాటుగా మరికొన్ని అత్యాధునిక వసతులను కల్పించుకొంటారు.
ఇవన్నీ కేవలం తాగడానికే కదా. వీళ్లందరినీ భరించిదే స్ర్తి. వివిధ హోదాల్లో కాదు ఇంటి ఇల్లాలుగా, ఒక తల్లిగా, ఒక చెల్లిగా స్ర్తి మూర్తే వీరిని భరిస్తోంది. వీరి వల్ల జరిగే నష్టాన్ని భర్తీచేయడమో లేక జరగబోయే నష్టాన్ని కొంత అదుపులో పెట్టడమో చేస్తున్నది మాత్రం స్ర్తినే.
సామన్యస్ర్తి విషయం తన భర్త తాగి వస్తే గొడవపడో నెమ్మదిగా చెప్పో కొద్ది రోజులు భరిస్తుంది. ఆ తాగిన మనిషి చేసే అల్లరి వల్ల తన ఇల్లు పాడయి పోకుండా ఉండాలని స్ర్తి ఎంతో కష్టపడుతుంది. మానాన్న తాగుబోతు అని పిల్లలల్లో భావన రాకుండా కాపాడుకోవడానికి అతి కష్టపడుతుంది. ఇదే పెద్దింటి స్ర్తి అయినా కూడా చిన్న పిల్లల విషయంలో అతి జాగ్రత్తలు తీసుకొని తండ్రిపైన వారికి చెడు అభిప్రాయం కలుగకుండా చూస్తుంది.
అదే తండ్రి అయితే మీ అమ్మ ఇలా అంటూ పిల్లల ముందే వారిబాధనువెళ్లగక్కేస్తుంటారు. కాని ఒక అమ్మ స్థానంలో ఉన్న స్ర్తి మాత్రం మీ నాన్న ఇలా అని చెప్పడానికి వేయివిధాలుగా ఆలోచిస్తుంది. ఇక్కడ స్ర్తిపురుషుల్లో తేడా కనబడుతుంది. ఈ ఒక్కవిషయంలోనే స్ర్తి తనకుతాను గా కనబడని బరువు మోస్తుంది.
అట్లానే కుటుంబ గౌరవం కోసం సమాజంలో తమకంటూ ఒక స్థానం ఉండాలనుకొంటూ తన్ను తాను కర్పూరంలాగా కరిగించుకొంటుంది. ఈ స్ర్తి త్యాగాన్ని చూసేవారు అరుదుగా ఉంటారు. ఒకవేళ గుర్తించినా పెద్దగా పట్టించుకోరు. అదేదో వారి బాధ్యతను వారు మోస్తున్నట్లు అనుకొంటారు. ఇదేమి భావ్యం?
ఈ కుటుంబ గౌరవడం నిలపడం భార్యాభర్తలిద్దరిది కదా. మరి పురుషుడు ప్రాధాన్యత ఇవ్వకపోగా ఆ గౌరవం దిగజార్చడానికి తానే కారకుడవుతున్నాడు.
అట్లానే నెలంతానో, లేక రోజంతానో కష్టించి సంపాదించిన సొమ్ములో కొంత ఇంటిలో ఖర్చుపెట్టడానికి ఉపయోగిస్తే మరికొంత తన స్వంత ఖర్చులకు అని అట్టేపెట్టేసుకుంటాడు. కాని అదే స్ర్తి తన సంపాదనలో ముందు ఇంటిలోని అనారోగ్యంతో బాధపడే వారికోసం, పిల్లల కోసం, అత్యవసర సమయాల ఖర్చుకోసం, రోజులు జరగడానికోసం ఇలా ఎన్నో రకరకాలుగా ఖర్చుపెడుతుంది. కాని తనకోసం తన స్వంత ఖర్చుకోసం అంటూ 99శాతం మంది స్ర్తిలు డబ్బును వెనకేసుకోరు. ఈ విషయంలోను స్ర్తి తనకు తానుగా బరువును మోస్తున్నట్టేకదా.
అందుకే అన్నారు అన్నింటికీ ఆధారం ఆడదే అని నిజమే. తనకు తానుగా తీసుకొనే బరువునుమోయడం పురుషులకు కూడా నేర్పించే బాధ్యత స్ర్తిలకే ఉంది. ఆ బరువును ఇద్దరూ మోస్తే మోసేశక్తిలోను, శక్తి భరించడంలోను వచ్చే మార్పు మరింత నాణ్యతగా ఉంటుంది ఆలోచించండి ఒక్కసారి.
అన్నింటికీ ఆధారం

- శ్రీలత