మెయిన్ ఫీచర్

మానసిక దృఢత్వానికి ‘కవచ’మిదే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దృఢమైన శరీరం ఉన్నప్పటికీ పూర్వం యుద్ధంలో శత్రువులతో పోరాడవలసిన వీరులు తమ శరీరానికి ఉక్కు కవచాలను, తలకు శిరస్త్రాలను ధరించేవారు. దీనివలన శత్రువుల నుండి ప్రయోగింపబడే శస్త్రాల బారి నుండి రణరంగంలో రక్షణ లభించేది. కర్ణుడు పుడుతూనే సహజ కవచ కుండలాలతో పుట్టాడు. అయినప్పటికీ అర్జునుని మించినవారు ఉండకూడదని ఇంద్రుడు మారువేషంలో వచ్చి వాటిని దానంగా స్వీకరించిని సంగతి అందరికీ తెలిసినదే. నేడు కూడా శరీరానికి రక్షా కవచంగా బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు ధరించి సైనికులు శత్రువులను ఎదుర్కొంటున్నారు.
ఈ విధంగా పైకి కనిపించే విధంగా శరీరానికి ధరించే కవచాలు కాకుండా శారీరక, మానసిక దృఢత్వాన్ని కలిగించేవి స్తోత్రరూపంలో ఉండేవి కూడా ‘కవచాలే’ జగద్గురు శంకరాచార్యులతో పాటు ఎందరో ఋషులు మనకు అందించిన దైవస్తోత్రాలలో అష్టోత్తరాలు, సహస్రనామాలు, అష్టకములు మొదలైన వాటిలో ఆయా దేవతలకు సంబంధించిన కవచములు పఠించటం వలన ఆ దేవతల రక్షణ లభించి శారీరక, మానసిక స్వస్థతను పొందగలుగుతాము. కవచస్తోత్ర పారాయణ వల్ల ఆరోగ్యం, ఆయుష్షు, యశస్సు, ధైర్యం, కార్యానుకూలత మొదలైనవి లభిస్తాయి. ఈ కవచాలలో కొన్ని ముఖ్యమైనవి ‘శ్రీరామరక్షా స్తోత్రమ్’, సరస్వతీ కవచమ్, హనుమత్ కవచమ్, శివకవచమ్, దుర్గా కవచమ్, దత్తాత్రేయ వజ్ర కవచమ్, నారాయణ కవచమ్, శ్రీవేంకటేశ్వర వజ్ర కవచమ్ మొదలైనవి ముఖ్యమైనవి. కాని ప్రతి దేవీ దేవతలకు సంబంధించిన కవచములన్నీ కూడా వేటికవే ప్రసిద్థి చెందినవి. మంచి ఫలితాలను ఇచ్చేవిగా ఉంటాయి.
‘శ్రీరామ రక్షాస్తోత్రము’ పారాయణ చేయటం వలన రామలక్ష్మణులు, తోడుగా మన వెంటనే ఉండి రక్షిస్తూ ఉంటారు. శ్రీరామ రక్షాస్తోత్రమే ‘శ్రీరామ కవచమ్’. ‘రామః పాతు స లక్ష్మణః’ లక్ష్మణునితో కూడిన శ్రీరాముడు మన శరీరంలోని అవయవాలన్నిటిని కాపాడుదురుగాక. ధనుర్బాణధారులై మన ముందు వెనుకల అండగా నిలిచి రక్షింతురు గాక అని స్తోత్రం సాగుతుంది.
ప్రతి కవచనంలోను శిరస్సు నుండి పాదాల వరకు శరీరంలోని అంగాలన్నిటికి రక్షణ లభించాలని దేవుని స్తుతించటం జరుగుతుంది. ‘సరస్వతీ కవచమ్’ పఠించటం వల్ల మనలోని జడత్వం, అజ్ఞానం తొలగిపోయి చైతన్యం, జ్ఞానం కలుగుతాయి. మనం ఉన్న ప్రాంతంలో దశదిశల నుండి మనకు సరస్వతీదేవి రక్షణ లభిస్తుంది. సద్బుద్ధిని, వాక్సుద్ధిని కూడా కలిగిస్తుంది. హనుమత్ కవచమ్ మనోధైర్యాన్ని, శారీరక బలాన్ని చేకూరుస్తుంది. శివకవచమ్ చిత్తశుద్ధిని, జ్ఞానాన్ని కలిగిస్తుంది. దుర్గా కవచమ్ శత్రు పీడను తొలగించి రోగాలను నివారిస్తుంది. శ్రీవేంకటేశ్వర వజ్ర కవచమ్ కలిదోష నివారణ గావించి శరీరాన్ని తేజోవంతం కావిస్తుంది.
శ్రీదత్తాత్రేయ కవచమ్ ఎంతో ప్రసిద్ధి వహించినది. దత్త భక్తులే గాక అందరూ నిత్యం పఠించి తరించవలసిన మహిమ కలది. దత్తాత్రేయుడు స్వయంగా దీనిని దలాదన మునికి ప్రసాదించినది. ఆయన చెబుతూ ఉన్న సమయంలో దూరశ్రవుడు అనే బిల్లుడు ఒకడు దీనిని విన్నాడు. విన్నంత మాత్రాననే అతడు వజ్రకాయుడైనాడు. దీనిని నిర్దిష్ట సంఖ్య ప్రకారం జపించటం వల్ల అనేక రకాలైన వ్యాధుల నుండి రక్షింపబడవచ్చుననివివిధ దేవతలతోపాటుగా నవగ్రహాలకు కూడా కవచ స్తోత్రాలు ఉండటం విశేషం.

-అబ్బరాజు జయలక్ష్మి