మెయిన్ ఫీచర్

కావాల్సిందే ఆచరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒక్కోమనిషిలో ఒక్కోజ్ఞానం ఉంటుంది. జ్ఞానమనేది కేవలం పాండిత్యం వల్ల రాదు. అనుభవం వల్ల రాదు. పూర్తి ఏకాగ్రతతో పాటుగా నేర్చుకోవాలన్న జిజ్ఞాస వల్లే జ్ఞానం వస్తుంది. ఒక ఊరిలో రచ్చబండ దగ్గర ఒక పండితుడు రోజు పురాణ కాలక్షేపం చేసేవాడు. ఊరిలోని అందరూ ఆ పురాణం విని ఆనందిస్తూ ఉండేవారు. కాని ఆ ఊరిలోని ఒక సామాన్య రైతు పురాణం వినడానికి వచ్చేవాడు కాదు. అందరూ తెలివి లేనివాడు అని అతనిని అనేవారు. ఒకరోజు పురాణం చెప్పే పండితుడు పంటచేనునుంచి వెళ్లుతూ ఈ రైతును చూశాడు. నా పురాణం వినేవుంటాడు అనుకొని అతడిని పురాణం గురించి అడిగాడు. నాకు తెలీదు బాబూ నేను ఈ చేనులో పంట పండించడానికి దీన్ని కాపలా కాయడానికే సమయం సరిపోతోంది అనిచెప్పాడు.
పండితుడు ఆమాట ఈమాట చెప్పి ఎలాగైనా నీవు ఒకసారి ఆ పురాణం విను. నీ జన్మ ధన్యమైపోతుందిఅని చెప్పాడు. నీవు రోజు ఈ పొలం పనులుచేసుకొనేటపుడు గీతా గీతా అని ఉచ్చరిస్తూ ఉండు. నీకు మంచి జరుగుతుంది అని చెప్పాడు.
రైతు కొన్నాళ్లు పండితుడు చెప్పినట్లుగానే గీతా అనడం ప్రారంభించాడు. మరికొన్నాళ్లకు పండితుడు కనిపించి పురాణం విన్నావా అని అడిగాడు. ‘లేదయ్యా! కాని మీరుచెప్పినప్పుడు మాత్రం గీతా అని అంటున్నాను. గీతా కాస్త తాగి ఒక్కోసారి త్యాగి అని నాకు తెలియకుండానే మారిపోతోంది’అని చెప్పాడు.
త్యాగి అంటే నీకున్నదానిలో కాస్త పక్కన వానికి పెట్టమని దాని అర్థం అని చెప్పి నీవు మా మాటనే ఉచ్చరిస్తూ ఉండు. వీలైనప్పుడు వెళ్లి ఆ గీతాబోధనే ఆయన చెప్తున్నాడు. వెళ్లి విను అని చెప్పాడు.
రైతు అంతకుముందే కాస్త త్యాగబుద్ధి ఉన్నవాడు. ఇపుడు మరింతగా పండితుడు చెప్పాడని తనకున్న దానిలోనే పక్కవానికీ పెట్టడం ఆరంభించాడు.
ఒకసారి అనుకోకుండా గీతాబోధ దగ్గరకు వచ్చాడు. ఆ సమయంలో పండితుడు శ్రీకృష్ణుని లీలలు చెబుతున్నాడు. యశోదమ్మను కృష్ణయ్య ఆట పట్టించడం ఆమె కృష్ణుని ఆగడాలతో విసిగిపోయి రోటికి కట్టెయ్యడం అన్న సంగతి ని చెప్తున్నాడు.
ఈ రైతు ఒక్కసారిగా లేచి ‘అమ్మా! అమ్మా! నీవు కడుతున్న తాడు వల్ల పిల్లవాని నడుము ఒరుసుకుపోతోంది కాస్త మెల్లగా మెల్లగా ’అని గట్టిగా అరుస్తున్నాడు. అందరూ వింతగా ఆయన్ను చూశారు. అతడు మాత్రం కృష్ణయ్యా అమ్మ చెప్పినట్టు వినయ్యా అంటూ కన్నీళ్లు కారుస్తున్నాడు. పైగా ‘యశోదమ్మా! మనకున్నదానిలో కాస్త ఇతరులకు పెట్టాలటమ్మా అందుకే ఆ కృష్ణయ్య పెడుతున్నాడు. అందులో ఆ బాబు తప్పేమీ లేదు కాస్త కోపం తగ్గించు అమ్మా’అని అంటున్నాడు.
ఈ రైతు చెప్పేమాటలు పండితునికి అర్థం అయ్యాయి. అతడు స్టేజీ నుంచి దిగి రైతు దగ్గరకు వచ్చాడు. రైతు ఆయన్ను చూసి ‘బాబయ్యా! మీరే కదా ఉన్నదాంట్లో పక్కవానికి పెట్టమన్నారు. మరి ఇప్పుడేమిటి ఆయన పెడుతుంటే వాళ్ల అమ్మ కోప్పడుతోంది’అని అమాయకంగా అడుగుతూ ‘మీరైనా చెప్పుచ్చు కదా’అన్నాడు.
పండితుడు రైతును ఆలింగనం చేసుకొని ‘అయ్యా! నీవు నిజంగా పరమాత్మ స్వరూపుడవు. నేనిన్నాళ్లనుంచి ఈ భాగవత బోధ చెప్తూనే ఉన్నాను. వింటూనే ఉన్నాను. కాని నాకీ తట్టలేదు ’అని చెప్పుతుండగానే రైతు
కన్నీళ్లు కారుస్తూ ‘బాబయ్యా! ఆ అమ్మ చూడు ఎంతగా నడుముకు తాడు కట్టేవేస్తోంది. ’అని అన్నాడు. పండితుడు రైతునువేదికపైకి తీసుకొని వచ్చి అక్కడున్నవారికి పరిచయం చేస్తూ ఇతడు జ్ఞాని, భగవదనుభూతిని అనుభవించిన ధీశాలి. ఇతనిని మనం గౌరవించాలి అని చెప్పాడు. రైతుకు ఏమీ అర్థం కాలేదు.
అక్కడున్నవారికీ అర్థం కాలేదు.
అపుడు పండితుడు ఇలా చెప్పాడు. నేను ఇన్నాళ్లనుంచి మీకు భాగవతం చెప్తున్నాను కదా. నాకెప్పుడు కృష్ణయ్య కనబడలేదు. కాని మీలో ఎవరూ కృష్ణయ్య కనిపించాడని చెప్పలేదు. కాని ఈ రైతుకు మాత్రం నిత్యం కనిపిస్తున్నాడు. కనుక మనం ఇతనిని గౌరవించాల్సిందే కదా అన్నారు. అందరూ ఏవిధంగా సాధన చేశావు అని రైతును అడిగారు. రైతు నాకు సాధన గురించి తెలీదన్నాడు. మళ్లీ పండితుడే నేనే ఒకరోజు గీత గురించి చెప్దామనుకొన్నాను. కాని ఇతనికి పని వత్తిడి ఎక్కువ వుండడంతో అది వీలు కాలేదు. కాని గీత అన్న పదాన్ని మాత్రమే పలుకుతుండమని చెప్పాను. అతడు ప్రతి పనిని గీత అన్నశబ్దంతోనే చేయడం ప్రారంభించాడు. గీతలోని పరమార్థాన్ని మరోసారి చెప్పాను. ఈ రైతు నేను చెప్పింది కేవలం వినడమే కాక ఆచరణలోను పెట్టాడు. భగవంతుడు ఎప్పుడు తన్ను స్తుతించేవారినే కాక తాను చెప్పింది చేసేవాళ్లను చూస్తాడు అందుకే ఇతడు నిర్మల మనస్సుతో చేసే పనులను భగవంతుడు చూశాడు కనుక భగవంతుని తత్వాన్ని అర్థం చేసుకొన్నాడు కనుక ఇతనికి భగవంతుడు కనిపిస్తున్నాడు అని వివరంగా చెప్పాడు.
అపుడు అందరూ మేము కూడా విన్న మంచిమాటలను ఆచరణలో పెట్తామని ప్రతిన బూనారు. భగవంతుని గూర్చి తెలుసుకోవడం అంటే మనమూ భగవంతుని రూపుగా మారిపోవడమే నని పండితుడు వారికి చెప్పాడు.

- ఎస్.ఎస్.సాయికృష్ణ 9989207825