మెయిన్ ఫీచర్

చైతన్య హేతువు ద్యుమణి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘కామకలావిలాస’’ కర్త తమ గ్రంథమునందు
శివశక్తులకు, దేవతలకు, మంత్రమునకు భేదము లేదనియు, పిండాండము (మన శరీరరము)నకు, బ్రహ్మాండమునకు, పరాశక్తికి, పరాశక్తి స్వరూపమైన శ్రీచక్రమునకు భేదము లేదనే అర్థముతో నిరూపించాడు. మానవుడు కేవలము ప్రాణంతో చరించి జీవి మాత్రమే కాదు. ఇంకను పంచభూతములు, సూర్య, చంద్ర, ఇంద్ర శక్తులను ఇందియాదులుగా కలిగి ఉన్నాడు. అగ్నిశక్తిని వాక్కుగాను, సూర్యశక్తిని కన్నులుగాను, ఇంద్రశక్తిని బలముగాను, చంద్రశక్తిని మనస్సుగాను, పృథ్వీశక్తిని శరీరముగాను, జలశక్తిని రేతస్సుగాను, ఈశానశక్తిని కోపముగాను, బ్రహ్మసృష్టి క్రియాశక్తిని జననాంగముగాను, నాడులను వివిధ దేవతాశక్తులుగాను పొందియున్నాడని మన (శాస్తజ్ఞ్రులైన) వేద ఋషులు ఏనాడో గుర్తించి తదనుగుణమైన ఉపాసనల నేర్పాటు చేసిరి. శాక్తేయులు ఇంకొక అడుగు ముందుకువేసి, మనలోని ప్రాణాది దశ వాయువులను చక్రములను (శక్తి కేంద్రములు), ధాతువులను, నాడులను, అన్నింటిని ఆ పరాశక్తి అంశలుగానే గుర్తించిరి.
ప్రశ్నోపనిత్తు ఒకటవ ప్రశ్నలో పిప్పలాద మహర్షిని శిష్యుడైన కాత్యాయన కబంధి, ఇలా అడిగాడు. దేవా! ఈ ప్రాణికోటులన్నీ ఎక్కడ నుండి పుడుతున్నవి? దానికి పిప్పలాద మహర్షి ఇలా బదులిచ్చాడు.
‘‘ప్రజాకామో వై ప్రజాపతిః సతపో తప్యత, సత్స్తత్వా, సమిధునముత్పాదయతే రయించ ప్రాణం చేతి, ఏతౌ మే బహుధా ప్రజాఃకరష్యత ఇతి’’
వివిరణ: సృష్టికర్త సంతానం (ప్రాణులను) కోరినవాడై ధ్యాన రూపమైన తపస్సు చేసి పదార్థము - శక్తి అనే జంటను సృష్టించాడు. వీటి కలయిక ద్వారా అనేక విధములుగా సృష్టి (సంతతి) జరుగునని భావించాడు. శ్రీ ఆదిశంకరుల బాష్యంలో పైన చెప్పిన మూలంలోని ‘‘రయి’’ అంటే అర్థం, అన్నం లేదా చంద్రుడు అని. ప్రాణం అంటే అగ్ని లేదా భోక్త. వైదికాభిప్రాయం ప్రకారం కూడా ఆహారం, చంద్రుడి సూక్ష్మప్రభావం వల్లనే లభిస్తోంది. అదెట్లనిన, చంద్రుడే భూమిపైన రసత్వానికి, ద్రవత్వానికి కారణం భూమియందలి అగ్నితత్త్వానికి తేజస్సును ప్రసరించే సూర్యుడే కారణం. అందువలన సూర్యుడే భోక్త. ఈ విషయం భౌతికంగా, శారీరకంగా కూడా సత్యమే కదా! భూమిపైన జీవం వర్థిల్లడానికి ఆహారం, ఊపిరి, అంటే అన్న ప్రాణములే కారణం.ఈ వ్యాఖ్య నవీన వాస్త్ర విజ్ఞానంతో కూడా సమన్వయవౌతోంది. కావున సూర్యుడే శక్తి, చంద్రుడే పదార్థం. చంద్రుడు సూర్యునివల్ల ప్రకాశించినట్లే, పదార్థం కూడా శక్తి వల్లనే ప్రకాశాన్ని పొందుతోంది.
మరియి ఎక్కడెక్కడ శక్తి ప్రకటితవౌతున్నదో అనగా జీవమూ, ప్రాణమూ మనగలుగుతున్నవో అది అంతయు సూర్యుని ప్రేరక ప్రభావమేనని శ్రుతి వెల్లడిస్తోంది. సూర్యుడు, అగ్ని, రెండూ కూడా సర్వగతము సర్వవ్యాప్తి అయిన ప్రాణశక్తి యొక్క అభివ్యక్తులేనని శ్రుతి వాక్యము.
ప్రాణికోటి అంతా ఎక్కడ నుండి ఉద్భవిస్తోందన్న పై ప్రశ్నకు పిప్పలాద మహర్షి ఈ క్రింది వచనం ద్వారా సూటిగా సమాధానం చెప్పారు.
‘‘అన్నంవై ప్రజాపతిస్తతో హవై తత్రేదస్త
సాదిదీమాః ప్రజా ప్రజాయంత ఇతి’’
వివరణ: ఆహారమే (నిజానికి) ప్రజాపతి. ఆహారం నుండే రేతస్సు కలుగుతుంది. ఆ రేతస్సు నుండి ప్రాణికోటి జన్మ ఎత్తుతోంది. ఇక్కడ పదార్థమూ శక్తి సృష్టికి మూల కారణమైనవి కావున జీవానికి కారణమైన శరీరద్రవాలు కూడా ఆ పదార్థ శక్తులయొక్క గాఢమైన అభివ్యక్తులు ప్రకటితములు మాత్రమేనని తెలుస్తుంది.
(ఇంకా ఉంది)

- డా॥ గుడిపాటి వి.ఆర్.ఆర్.ప్రసాద్ 9490947590