మెయిన్ ఫీచర్

అభినయమా.. అదేంటి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘స్వర్ణ యుగం’లో మాత్రం టాలెంటుతో సినీరంగాన్ని ప్రభావితం చేసిన హీరోయినే్ల కనిపిస్తారు. మహానటి సావిత్రి నుంచి సౌందర్య వరకూ.. తారలంతా నవరసాలను పోషించి మెప్పించిన వారే. ప్రస్తుతం టాలీవుడ్ హీరోయిన్లు శ్రుతిమించిన శృంగారాన్ని నమ్ముకుని ముందుకు సాగుతున్నారు. అభినయం ఊసెత్తితే.. అదేంటి? అని అడిగే పరిస్థితి కనిపిస్తోంది. కొందరు నాయికలు వారసత్వ ముసుగులో వెండితెరపై మెరవాలని, గొప్ప నటి కావాలని కలలు కంటూ అడపాదడపా తెరపై కనిపిస్తూ తెలీకుండానే తెరమరుగు అవుతున్నారు. మరి కొందరైతే.. ‘మోడలింగ్’ రంగం నుంచి వయా ‘ప్రకటనల’ మీదుగా పరిశ్రమకు వస్తున్నారు. ‘్ఫలానా యాడ్‌లో నన్ను చూసిన దర్శకుడు సంప్రదించాడు. హీరోయిన్ అనగానే ఎగిరి గంతేశాను. తర్వాత మీకు తెలిసిందే‘నంటూ తెచ్చిపెట్టుకునే చిత్రమైన భాషలో హొయలు పోవడం చూస్తూనే ఉన్నాం. -పరిశ్రమకు రాకుంటే వ్యాపార రంగంలో ఉండేదాన్ని, డిజైనింగ్ వైపు వెళ్లేదాన్ని, ఫిట్‌నెస్ సెంటర్ నడిపేదాన్ని అంటూ ఇంకొందరూ చెబుతుండటం చూస్తూనే ఉన్నాం. అందృష్టాన్ని నమ్ముకుని వస్తున్నవాళ్లు, అందాన్ని నమ్ముకుని వస్తున్నవాళ్లు.. రెంటినీ కలగలిపి అవకాశాలు అందుకుంటున్నామని చెప్తున్నవాళ్లు ఇక్కడ కనిపిస్తూనే ఉన్నారు. చిత్రం ఏమంటే వీళ్లంతా ‘అందం- అదృష్టం- వారసత్వం’ నమ్ముకుని ముందుకొస్తున్నారే తప్ప, ‘అభినయం’పై నోరు మెదపని వాళ్లే ఎక్కువ.
ఇక ఆడియో ఫంక్షన్లలోనూ, చిత్రం విడుదలకు ముందు ప్రచార కార్యక్రమాల్లోనో చూడాలి. ఏ సినిమాలోనైనా ‘హీరోయిన్’కు నటించాల్సిన అవసరం ఎలాగూ రావడం లేదు కనుక, ‘మేకప్ గ్లామర్’తోనైనా సినిమాకు ఒకింత సాయం చేద్దామన్న ధోరణే కనిపిస్తోంది. లేటెస్ట్ ట్రెండ్ అంటూ ఉల్లిపొర దుస్తులు, పీలికల డిజైన్లు, విరబోత కురులతో ‘ఏ ప్రదర్శన’కైనా సిద్ధపడటం చూస్తుంటే, ఎటుపోతున్నాం అన్న అనుమానాలు కలుగుతున్నాయి. పిచ్చి పిచ్చి డ్రెస్సులు, ఐదారు పాటల్లో రెచ్చగొట్టే గంతులు తప్ప, నేటి హీరోయిన్ల పాత్రకు గుర్తింపన్నది ఎక్కడుంది? శృంగారం ఒలికించే పాత్రలే తప్ప నటించే చాన్స్‌లేవీ? వీళ్లను పాటల హీరోయిన్లు అనుకోవాలే తప్ప, పాత్రల హీరోయిన్లు అనుకునే అవకాశమేదీ? మంచి పాత్రలు సృష్టించలేకపోవడం మన రచయితల, దర్శకుల మొదటి తప్పు. అందం ఒలికించడానికి అడిగిన పారితోషికం ఇస్తే చాలు, పాత్రలోని సొగసు మనకెందుకు అని హీరోయిన్లు సిద్ధపడిపోవడం మరో తప్పు. సంస్కృతీ సంప్రదాయానికి పాతరేసేలాంటి చిత్రాలను తీస్తున్నా, ఎగబడి చూస్తుండటం ప్రేక్షకుల వైపునుంచి జరుగుతోన్న ఇంకో తప్పు. ఇక హీరోయిన్ల పాత్రౌచిత్యాన్ని, ఆమె అభినయంలోని అందాన్ని పట్టించుకోకుండా -మిల్కీ బ్యూటీ, కాఫీ బ్యూటీ, బోర్న్‌విటా బ్యూటీ అంటూ అర్ధంపర్ధంలేని పొగడ్తలతో మోసేస్తుండటం మీడియావైపు నుంచి జరుగుతోన్న ఇంకో తప్పు. బెంగాలీ బ్యూటీ, కేరళ కుట్టి, ముంబై ముద్దుగుమ్మ అంటూ ఆకాశానికెత్తడం మనకే చెల్లుతుందేమో. ఫలానా నటి చేతిలో నాలుగు ప్రాజెక్టులు ఉన్నాయి.. రెండేళ్ల వరకూ ఆమె డైరీ ఖాళీ లేదు, అగ్రనటుల సరసన నటించే అవకాశం దక్కించుకుంది.. ఇటు తెలుగు అటు తమిళం, మలయాళం చిత్రాల్లో బిజీగా ఉంది.. త్వరలో బాలీవుడ్‌లోనూ కనిపించబోతోంది.. లాంటి చిలక జోస్యం కథనాలు మానకుంటే నటీమణుల్లోని ప్రతిభ గురించి మాట్లాడుకునే అవకాశమే రాకుండాపోయే ప్రమాదం లేకపోలేదు. పాత్రల్లో జీవిస్తే ఆమెను మెచ్చుకోవడంలో అర్ధంముంటుంది. సావిత్రిని మహానటి అని, వాణిశ్రీని కళాభినేత్రి అని, జయసుధను సహజనటి అని సంబోధించినా.. తప్పనిపించదు. కారణం నటనలో వారిస్థాయి అలాంటిది. స్క్రీన్‌పై కనిపిస్తున్న ఇప్పటి హీరోయిన్లలో మెజారిటీ కథానాయికలకు శృంగార రసాన్ని ఒలికించడమే తెలుసు. అంగాంగ ప్రదర్శనలే వచ్చు. దీనే్న నటన అందామా? వీరిని నటీమణులని సంభోదిద్దామా? స్వర్ణయుగం తారలు సావిత్రి, అంజలి, జమున, భానుమతి, బి సరోజాదేవి, జానకి, కృష్ణకుమారి, శ్రీదేవి, వాణిశ్రీ, జయసుధ, జయప్రద, విజయశాంతి లాంటి వాళ్లను నేటికీ గుర్తుంచుకున్నామంటే కారణం వారి ప్రతిభ. ఇప్పటి హీరోయిన్లను ముద్దుగుమ్మ, హార్లిక్స్ బ్యూటీ, అగ్రనటి, టాలీవుడ్ నంబర్ వన్ అంటూ పనికిరాని ప్రశంసలు కురిపించడం ఎబ్బెట్టుగా ఉంటుంది.

-మురహరి ఆనందరావు