రాష్ట్రీయం

మక్కామసీదు పేలుళ్ల కేసు కొట్టివేత!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్:మక్కా మసీదు పేలుళ్ల కేసును నాంపల్లి ఎన్‌ఐఏ కోర్టు కొట్టివేసింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న ఐదుగురిని నిర్దోషులుగా ప్రకటించింది. ఈ కేసులో నిందితులైన స్వామి అసీమానంద, దేవేందర్ గుప్తా, రాజేందర్ చౌదరి, లోకేశ్ శర్మ, భరత్ భాయిని భారీ బందోబస్తు మధ్య చర్లపల్లి జైలు నుంచి ఇవాళ ఉదయం నాంపల్లి కోర్టుకు తీసుకువచ్చి హాజరుపరిచారు. అనంతరం వాదనలు విన్న న్యాయమూర్తి.. ఆధారాలు లేనందున ఈ కేసును కొట్టివేస్తున్నట్లు తీర్పు వెల్లడించారు. నిందితులపై నేరారోపణలు నిరూపించడంలో ప్రాషిక్యూషన్ విఫలమైందని చెబుతూ నాంపల్లిలోని స్పెషల్ ఎన్‌ఐఏ కోర్టు ఈ కేసును కొట్టేసింది. నిందితులందరినీ నిర్ధోషులుగా ప్రకటించింది.