జాతీయ వార్తలు

మాలెగావ్ కేసులో నిందితులకు విముక్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: మాలెగావ్ బాంబు పేలుళ్ల కేసులో మొత్తం ఎనిమిదిమంది నిందితులను నిర్దోషులుగా పేర్కొంటూ బాంబే హైకోర్టు సోమవారం తీర్పు ఇచ్చింది. నిందితులపై అభియోగాలను తొలగించడంతో కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. మహారాష్టల్రోని మాలెగావ్ ప్రాంతంలో 2006 సెప్టెంబర్‌లో ముస్లింల శ్మశానవాటిక వద్ద బాంబులు పేలి 37 మరణించారు. వందమందికిపైగా గాయపడ్డారు. ఈ కేసులో 9 మందిని నిందితులుగా పేర్కొంటూ పోలీసులు కేసు పెట్టారు. బెయిల్‌పై బయటకు వచ్చిన సమయంలో ఓ నిందితుడు రోడ్డు ప్రమాదంలో మరణించాడు. మిగతా 8 మంది నిందితులు గత అయిదేళ్లుగా విచారణ ఖైదీలుగా జైలులోనే ఉన్నారు. ఈ నిందితులకు బాంబుపేలుళ్లతో సంబంధం లేదని గతంలో మాలేగావ్ ప్రాంతంలో స్థానికులు ఆందోళనలు నిర్వహించగా కేసును సిబిఐ విచారించింది. అభియోగాలను తొలగించడంతో గత అయిదేళ్లుగా జైలులో ఉంటున్న 8 మందిని విడుదల చేయాలని కోర్టు ఆదేశించింది.