జాతీయ వార్తలు

విజయ్ మాల్యా వ్యవహారంపై దద్దరిల్లిన ఉభయ సభలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎందుకు పారిపోనిచ్చారని ప్రశ్నించిన కాంగ్రెస్
యుపిఏ హయాంలోనే రుణాలు: జైట్లీ
మాల్యా ఆస్తులు జప్తు చేస్తామని వెల్లడి

న్యూఢిల్లీ, మార్చి 10: దేశంలోని బ్యాంకులకు దాదాపు పదివేల కోట్ల రూపాయలు ఎగనామం పెట్టిన విజయ్ మాల్యా లండన్‌కు పారిపోయిన అంశంపై పార్లమెంటు ఉభయ సభలు గురువారం దద్దరిల్లిపోయాయి. ఎన్‌డిఏ ప్రభుత్వం విజయ్‌మాల్యాను లండన్‌కు ఎందుకు పారిపోనిచ్చిందని ఉభయ సభల్లో కాంగ్రెస్ నిలదీసింది. దీనిపై ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ సమాధానం ఇస్తూ విజయ్‌మాల్యా వెళ్లిపోయే నాటికి అతనిపై ఎలాంటి ఆంక్షలు లేవని వివరించారు. మొదట లలిత్‌మోడీ, ఇప్పుడు విజయ్‌మాల్యా వెళ్లిపోయారు, ఎన్‌డిఏ ప్రభుత్వం ఎందుకిలా చేసిందని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ నిలదీయగా జైట్లీ బదులిస్తూ లలిత్‌మోదీ యుపిఏ అధికారంలో ఉన్నప్పుడు విదేశాలకు పారిపోయాడనేది మీకు తెలియదా? అని ఎత్తిపొడిచారు. యుపిఏ అధికారంలో ఉన్నప్పుడే విజయ్‌మాల్యాకు బ్యాంకులు రుణాలు ఇచ్చాయి, యుపిఏ అధికారంలో ఉన్నప్పుడే ఆయన రుణాలను పునర్‌వ్యవస్థీకరించి తగువిధంగా సహాయం చేసిన విషయం కాంగ్రెస్ నాయకులు మరిచిపోతే ఎలా అని జైట్లీ మొదట రాజ్యసభ, ఆ తరువాత లోక్‌సభలోనూ కాంగ్రెస్ నాయకులను ప్రశ్నించారు.
విజయ్‌మాల్యా అంశాన్ని ప్రతిపక్ష నాయకుడు గులాం నబీ ఆజాద్ రాజ్యసభలో ప్రస్తావిస్తూ, విజయ్‌మాల్యా దేశం విడిచి వెళ్లిపోయేందుకు జరిగిన కుట్రలో ప్రభుత్వం భాగస్వామి అని ఆయన ఆరోపించారు. రుణాల ఎగవేతపై పలు సంస్థలు విజయ్‌మాల్యాను ప్రశ్నిస్తున్నప్పుడే అతన్ని ఎందుకు అరెస్టు చేయలేదు, అతని పాస్‌పోర్టును ఎందుకు జప్తు చేయలేదని ఆజాద్ ప్రశ్నించారు. ఇంత పొడవుగా ఉండి, పలువురిని వెంటబెట్టుకుని తిరిగే మనిషి అకస్మాత్తుగా ఎలా మాయమవుతాడని ఆయన వ్యంగ్యంగా ప్రశ్నించారు. దీనికి అరుణ్‌జైట్లీ బదులిస్తూ కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే విజయ్‌మాల్యా రుణాలను పునర్ వ్యవస్థీకరించటంతోపాటు వెసులుబాటు కల్పించారంటూ ఎదురు దాడి చేశారు. పది సంవత్సరాల పాటు అధికారంలో ఉన్నప్పుడు విజయ్‌మాల్యాపై ఎలాంటి చర్య తీసుకోని కాంగ్రెస్ ఇప్పుడు తమపై ఆరోపణలు చేయటం విచిత్రంగా ఉందని జైట్లీ విమర్శించారు. లలిత్‌మోదీ విదేశాలకు వెళ్లిపోవటంపై ఆజాద్ చేసిన వ్యాఖ్యలను జైట్లీ తిప్పికొడుతూ మీరు అధికారంలో ఉన్నప్పుడే ఆయన దేశం నుండి వెళ్లిపోయారనేది తెలియదా? అని ప్రశ్నించారు. లలిత్‌మోదీని స్వదేశానికి రప్పించేందుకు చర్యలు తీసుకోని వారికి తమను విమర్శించే అధికారం లేదని జైట్లీ స్పష్టం చేశారు. విజయ్‌మాల్యా తీసుకున్న ప్రతి పైసాను రాబట్టేందుకు బ్యాంకులు అవసరమైన చర్యలు తీసుకుంటున్నాయని ఆయన సభకు వివరించారు. లోక్‌సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు మల్లికార్జున ఖర్గే ఈ అంశాన్ని జీరో అవర్‌లో ప్రస్తావించారు. ప్రభుత్వరంగ బ్యాంకులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవటం వల్లనే విజయ్‌మాల్యా విదేశాలకు వెళ్లిపోగలిగారని ఆయన ఆరోపించారు. అతని పాస్‌పోర్టును జప్తు చేయాలనే ఆదేశాలున్నా ప్రభుత్వం ఏమీ చేయలేకపోయిందన్నారు. జాతీయ బ్యాంకులను పదివేల కోట్ల రూపాయల మేర ముంచిన వ్యక్తి విదేశాలకు వెళ్లిపోతుంటే ప్రభుత్వం వౌనం వహించిందని ఖర్గే దుయ్యబట్టారు. ఇందుకు జైట్లీ బదులిస్తూ విజయ మాల్యా బ్యాంకులకు తొమ్మి ది వేల తొంబై ఒక్క కోట్ల నలభై లక్షల రూపాయల రుణాలు చెల్లించవలసి ఉన్నదని ఆయన వివరించారు. మా ల్యా ఆస్తులను జప్తు చేసేందుకు చర్య లు తీసుకుంటున్నారన్నారు. బ్యాం కులు తమ బకాయిలను వసూలు చేసుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాయని జైట్లీ పేర్కొన్నారు.