జాతీయ వార్తలు

నేను పారిపోలేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేశ చట్టాలపై పూర్తి గౌరవం ఉంది
విజయ్ మాల్యా స్పష్టీకరణ
మీడియా తీరుపై మండిపాటు

న్యూఢిల్లీ, మార్చి 11: తాను దేశం వదిలిపెట్టి పారిపోయినట్లు వస్తున్న ఆరోపణలను యుబి గ్రూపు అధినేత విజయ్ మాల్యా తీవ్రంగా ఖండించారు. తాను దేశం వదిలిపెట్ట పారిపోలేదని, ఈ దేశ చట్టాలను గౌరవిస్తానని ఆయన స్పష్టం చేశారు. మాల్యా దేశంలోని వివిధ బ్యాంకులను 9 వేల కోట్ల రూపాయల మేర మోసం చేసి రహస్యంగా లండన్ పారిపోయాడంటూ ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే తాను ఒక అంతర్జాతీయ వ్యాపారినని, వ్యాపార పనుల నిమిత్తం తరచూ విదేశాలకు వెళ్లి వస్తూ ఉంటానని ఆయన అన్నారు. తాను దేశం వదిలిపెట్టి పోలేదని, అలాగే పరారీలో ఉన్న వ్యక్తిని కూడా కాదని మాల్యా శుక్రవారం రహస్య ప్రదేశంనుంచి తన ట్విట్టర్‌లో అన్నారు. ‘ఒక భారతీయ ఎంపీగా నేను ఈ దేశ చట్టాలను పూర్తిగా గౌరవిస్తాను. మన న్యాయ వ్యవస్థ ఎంతో బలమైనదే కాకుండా అందరిచేతా గౌరవించబడుతోంది. అయితే మీడియా విచారణ జరపడం మాత్రం సరికాదు’ అని కూడా అన్నారు. తనపై వస్తున్న వివాదాలన్నిటికీ మీడియాయే కారణమని మాల్యా ఆరోపిస్తూ ఒకసారి మీడియా వేట ప్రారంభమైతే అది కార్చిచ్చులాగా రేగిపోతుందని, దానిలో సత్యం, వాస్తవాలు బూడిదలాగా కాలిపోతాయన్నారు. అంతేకాదు, ఇనే్నళ్లుగా తాను చేసిన సహాయం, ఫేవర్లు, ప్రేమాభిమానాలను మీడియా బాస్‌లు మరిచి పోకూడదని అంటూ, వాటన్నిటికీ లిఖితపూర్వక ఆధారాలున్నాయని, ఇప్పుడు టిఆర్‌పి రేటింగ్ కోసం అబద్ధాలు చెబుతున్నారని అన్నారు. తాను తన ఆస్తులను ప్రకటించి తీరాలంటూ మీడియాలో వస్తున్న వార్తలను మాల్యా ప్రశ్నిస్తూ ‘అంటే బ్యాంకులకు నా ఆస్తుల వివరాలు తెలియవని, లేక పార్లమెంటుకు నేను వెల్లడించిన వివరాలను అవి చూడలేదని అర్థమా?’ అని అన్నారు. కాగా, తాను ఎక్కడున్నాననే విషయమై మాల్యా ట్విట్టర్‌లో ఎలాంటి వివరాలు తెలపనప్పటికీ ఆయన లండన్‌కు ఉత్తరంగా దాదాపు ఓ గంట ప్రయాణం దూరంలోని ఓ గ్రామంలో తనకు చెందిన నివాసంలో ఉన్నట్లు మీడియా కథనాలు పేర్కొన్నాయి. సిబిఐ లుకౌట్ నోటీసులు జారీ చేసినప్పటికీ మాల్యా దేశం వదిలిపెట్టి వెళ్లడానికి ప్రభుత్వం ఎలా అనుమతించిందని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ సహా ప్రతిపక్షాల నేతలు అనుమానాలు వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. కాగా, మాల్యా ఈ నెల 2న దేశం విడిచిపెట్టి వెళ్లాడని ప్రభుత్వం బుధవారం సుప్రీంకోర్టుకు తెలియ జేసిన తర్వాత మాల్యా పాస్‌పోర్టును స్తంభింజేయాలని, సుప్రీంకోర్టు ఎదుట హాజరు కావాలని ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ ఆయనకు రుణాలిచ్చిన బ్యాంకుల కన్సార్టియం దాఖలు చేసిన పిటిషన్లపై రెండు వారాల్లోగా తన సమాధానం తెలియజేయాలని కోరుతూ కోర్టు ఆయనకు నోటీసులు జారీ చేయడం తెలిసిందే.