జాతీయ వార్తలు

నా కుమారుడిని తిట్టొద్దు: విజయ్ మాల్యా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: బ్యాంకులకు తాను రుణాలు చెల్లించాల్సి ఉండగా, తన కుమారుడు సిద్ధార్థ్‌ను టార్గెట్ చేస్తూ కొందరు సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేయడం తగదని వ్యాపారవేత్త విజయ్ మాల్యా ట్విట్టర్‌లో తాజాగా పేర్కొన్నారు. అనేక బ్యాంకులకు సుమారు 9వేల కోట్ల రూపాయలు బకాయి పడిన మాల్యా ఈనెల 2న లండన్‌కు పారిపోయిన సంగతి తెలిసిందే. వచ్చే నెలలో తాను కోర్టుకు హాజరవుతానని ఈడీ సమన్లకు ఆయన బదులిచ్చారు. బకాయిలు చెల్లించనందుకు తనను ఏం అన్నా భరిస్తానని, ఆర్థిక లావాదేవీలతో ఎలాంటి సంబంధం లేని సిద్ధార్థ్‌ను ఎవరూ తిట్టరాదని ఆయన విజ్ఞప్తి చేశారు.