జాతీయ వార్తలు

మాల్యా ఆస్తుల జప్తుకు ఈడీ సన్నాహాలు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: కింగ్ ఫిషర్ అధినేత విజయ్ మాల్యా ఆస్తులను జప్తు చేసే దిశగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డిపార్ట్‌మెంట్ (ఈడీ) అడుగులు వేసే అవకాశం కనిపిస్తోంది. మాల్యా, ఆయన కుటుంబ సభ్యులు ఆస్తుల వివరాలు ప్రకటించాలని సుప్రీం కోర్టు ఇచ్చిన గడువు గురువారంతో ముగిసింది. అయినప్పటికీ మాల్యా నుంచి ఎలాంటి స్పందన లేనందున ఇక ఆయన ఆస్తులను జప్తు చేయాలన్న ఆలోచనలో ఈడీ ఉన్నట్లు తెలుస్తోంది. పలు బ్యాంకులకు 9వేల కోట్ల రూపాయలను ఎగవేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మాల్యా దేశాన్ని వీడి ప్రస్తుతం లండన్‌లో తలదాచుకున్న సంగతి తెలిసిందే. ఈడి విచారణకు హాజరుకానందున ఆయన పాస్‌పోర్టును తాత్కాలికంగా రద్దు చేసి అరెస్టు వారంటు జారీ చేశారు. మరోవైపు రెడ్‌కార్నర్ నోటీసు విడుదల చేసి ఆయనను లండన్ నుంచి భారత్‌కు రప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆస్తులన్నింటినీ ఈడీ స్వాధీనం చేసుకుంటే మాల్యా పరిస్థితి ఏమిటన్నది తేలాల్సి ఉంది.