జాతీయ వార్తలు

కాంగ్రెస్, సిపిఎం పొత్తు అనైతికం: మమత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, మార్చి 11: కాంగ్రెస్, వామపక్షాల మధ్య కుదిరిన ఎన్నికల పొత్తు అనైతికమని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి మొత్తం ఐదు భాషల్లో ఎన్నికల మేనిఫెస్టోను శుక్రవారం విడుదల చేసిన సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. తమది మాటల ప్రభుత్వం కాదనీ, చేతల ప్రభుత్వమని స్పష్టం చేశారు. తమ పార్టీ అనుసరించే విధానాలు ప్రజానుకూలంగా, పరిశ్రమలకు అనుకూలంగా, రైతులకు అనుకూలంగా వుంటాయని, కుల, మత, ప్రాంత విచక్షణ లేకుండా అందరి సంక్షేమమే తమ ధ్యేయమని తెలిపారు. అయితే కొన్ని పార్టీలు తమకు వ్యతిరేకంగా కుట్ర పన్నుతున్నాయని, తమ పరువు తీసేందుకు ప్రయత్నిస్తున్నాయని అన్నారు. ‘ఇది నీతిబాహ్య ఒప్పందం. నేను కాంగ్రెస్ పార్టీని వీడి తృణమూల్ కాంగ్రెస్‌ను ఏర్పాటుచేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ జెండాను సిపిఎంకు అప్పగించారని ఆరోపించాను. నాడు నేను చేసిన ఆరోపణే ఇప్పుడు రుజువైంది’ అని అన్నారు. రాష్ట్రంలో తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో రకాలుగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని, అనేక అంశాల్లో దేశంలో అగ్రగామిగా ఉన్న రాష్ట్రాల్లో పశ్చిమ బెంగాల్ ఒకటని అన్నారు. తమ ప్రభుత్వం చేపట్టిన అనేక పథకాలు అంతర్జాతీయ వేదికలపై ప్రశంసలు కూడా అందాయని, భారత్‌లోనే అత్యుత్తమమైన పథకాలుగా ప్రతి ఒక్కరు వాటిని పరిగణించారని తెలిపారు. అన్ని వర్గాల ప్రజలకు చేరువ కావాలన్నదే తమ పార్టీ ఆలోచన అని, దాన్ని తమ ప్రభుత్వం ఆచరణాత్మకం చేసిందని వెల్లడించారు.