రాష్ట్రీయం

ప్రపంచ బ్యాడ్మింటన్ సూపర్ సిరీస్ ఇండియా మేనేజర్‌గా తేతలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రావులపాలెం, నవంబర్ 28: ఇండోనేషియా దేశంలోని ఈస్టు జావా మలాంగ్‌లో డిసెంబర్ ఒకటో తేదీ నుండి ఆరు వరకు జరిగే వరల్డ్ బ్యాడ్మింటన్ మాస్టర్స్ సూపర్ సిరీస్‌కు ఇండియా టీం మేనేజర్‌గా ఆంధ్రప్రదేశ్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు, తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంనకు చెందిన తేతలి నారాయణరెడ్డి నియమితులయ్యారు. శనివారం రావులపాలెం కాస్మో పాలిటన్ రిక్రియేషన్ క్లబ్ (సిఆర్‌సి)లో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు డాక్టర్ గొలుగూరి వెంకటరెడ్డి వివరాలు వెల్లడించారు. ప్రతి ఏడాది ప్రపంచంలోని వివిధ దేశాల్లో వరల్డ్ బ్యాడ్మింటన్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అయిదు సూపర్ సిరీస్‌లు జరుగుతాయని, వాటిలో ఇండోనేషియా సూపర్ సిరీస్ ఒకటన్నారు. ప్రతి దేశం నుండి అర్హత గల ర్యాంకింగ్ క్రీడాకారులు మాత్రమే పాల్గొనే ఈ టోర్నమెంటులో 1.2 లక్షల యుఎస్ డాలర్లు ప్రైజ్ మనీగా ఇస్తారన్నారు. మన దేశం నుండి సైనా నెహ్వాల్, పివి సింధూ, కశ్యప్, శ్రీకాంత్, ప్రణయ్ ఈ టోర్నమెంటులో ప్రాతినిధ్యం వహిస్తారన్నారు. ఈ నెల 29న క్రీడాకారులతో కలిసి నారాయణరెడ్డి ఇండోనేషియా బయల్దేరి వెడతారన్నారు. పురుషుల, మహిళల విభాగాల్లో సింగిల్స్, డబుల్స్, మిక్స్‌డ్ డబుల్స్‌లో జరిగే పోటీలకు సంబంధించి మెయిన్ డ్రాకు మొత్తంగా ఈ సిరీస్‌లో వివిధ దేశాల నుండి 56 మెన్ సింగిల్స్, ఉమెన్ సింగిల్స్, మెన్ డబుల్స్, ఉమెన్ డబుల్స్, మిక్స్‌డ్ డబుల్స్‌లో మరో 28 చొప్పున ఎంట్రీలు ర్యాంకింగ్ ఆధారంగా తీసుకున్నారన్నారు. అలాగే క్వాలిఫైయింగ్ రౌండ్ల ద్వారా మరో 24 ఎంట్రీలను కలుపుకొంటారన్నారు. ఇంతటి ప్రతిష్టాత్మక టోర్నమెంటుకు ఇండియా తరఫున టీం మేనేజర్‌గా నారాయణరెడ్డి నియమితులు కావడం రాష్ట్రానికే గర్వకారణమన్నారు. కెసిహెచ్ పున్నయ్యచౌదరి తరువాత ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల నుండి దేశ బాడ్మింటన్ టీం మేనేజర్‌గా నారాయణరెడ్డి మాత్రమే నియమితులయ్యారన్నారు. తనను టీం ఇండియా మేనేజర్‌గా ఎంపిక చేయడంలో ప్రోత్సహించిన బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు అఖిలేష్‌దాస్ గుప్తా, ఎపి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కెసిహెచ్ పున్నయ్యచౌదరికి నారాయణరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఆయనను వెంకటరెడ్డితో పాటు సిఆర్‌సి అధ్యక్షులు నందం వీర వెంకట సత్యనారాయణ, జిల్లా బాడ్మింటన్ అసోసియేషన్ కార్యదర్శి రామాంజనేయరాజు, కర్రి శ్రీనివాసరెడ్డి, నల్లమిల్లి వీర్రాఘవరెడ్డి తదితరులు అభినందించారు.