మనలో - మనం

మనలో-మనం - ఎడిటర్‌తో ముఖాముఖి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అందవరపు నాగేశ్వరరావు, పలాస
అమరావతి పూర్తి అగుటకు కనీసం 5,6 సంవత్సరాలు కాగలదు. ప్రణాళిక ప్రకారం ఖర్చులు బాగా పెరుగుతున్నాయి. ఇంకా వేగవంతము చేసే మాలాంటి వాళ్లు చూచి తరించాలని ఉంది. నా కోరిక నెరవేరుతుందా?
కంటినిండా కునుకు తీయండి. ఏదో ఒకరోజు తీరుతుంది.

ఎ.నగేష్, కాశీబుగ్గ
మన ఆరోగ్యం మన చేతుల్లో ఉందా, జాతకం ప్రకారము ఆరోగ్యం ఉంటుందా? ఏమైనా ఒంట్లో బాగాలేకపోతే పూజలు జరిపించండి అని చెపుతారు. పూజలు చేస్తే, మనకి మంచి జరుగుతుందని నమ్మమంటారా?
మంచి జరుగుతుంది అన్న నమ్మకం మానసిక బలాన్ని ఇస్తుంది. అదోరకం సైకలాజికల్ ట్రీట్‌మెంట్. ఆత్మానందానికే పనికొస్తుంది.

యం.ఎస్. సికిందరాబాద్
ఒకపక్క తెలుగు తెలుగో అని ఆక్రోశిస్తూ, రచయితలమని చెప్పుకునే కొందరు ఇంగ్లీషు పేర్లతో సాంస్కృతిక సంస్థలు ఎందుకు ప్రారంభిస్తున్నారు?
కారణం - మనకి పట్టిన ఇంగ్లిషు తెగులు.

గుండు రమణయ్య, పెద్దాపూర్, కరీంనగర్
గోదావరి నదిపై నిర్మించే ప్రాజెక్టుల విషయంలో మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల మధ్య కుదిరిన ఒప్పందంపై మీ అభిప్రాయం?
మంచిదే.

సి.ప్రతాప్, శ్రీకాకుళం
పది వేలు రుణాలు తీసుకొని తిరిగి కట్టలేని రైతులను రోడ్డున పడేసి నానా రకాలుగా వేధించే బ్యాంకులు వేల కోట్లు ఎగ్గొట్టే కుబేరులను ఏమీ చెయ్యలేకుండా ఎందుకు ఉండలేక పోతున్నాయి? ఈ మధ్య ఒక పెద్ద మనిషి ఏకంగా తొమ్మిది వేల కోట్లు బ్యాంకులకు ఎగనామం పెట్టి దేశాంతరం వెళ్లిపోతే బ్యాంకులన్నీ ఎందుకు ప్రేక్షక పాత్ర పోషిస్తూ ఉండిపోయాయి?
కడుపు చించుకుంటే కాళ్ల మీద పడుతుంది. జరిగిన పాపంలో తమ భాగం ఎంతో బయటపడితే బ్యాంకుల పరువు పోతుంది. పెద్ద కుర్చీల్లోని వాళ్ల ఉద్యోగాలు పోతాయి. అది కూడా ఒక కారణం.

నిబంధనలను గాలికొదిలేసి బంగారు పళ్లెంలో అప్పులిచ్చిన వీరిపై ప్రభుత్వం ఇంతవరకు ఎందుకు చర్యలు తీసుకోలేదు?
లోగుట్టు పెరుమాళ్ల కెరుక.

కొమ్మన శ్రీనివాసకుమార్, నెల్లూరు
లబ్దిప్రతిష్టులైన కొంతమంది రచయితలను సెలెక్ట్ చేసి, వారికి పెన్షన్స్ ఏర్పాటు చేస్తే బాగుంటుంది కదండీ?
బాగుండదు.

ఎన్.రామలక్ష్మి, సికిందరాబాద్
భగత్‌సింగ్‌ను ఉగ్రవాదులను సమర్థించిన కన్నయ్యతో పోల్చిన మాజీ మంత్రి, ఇప్పటికీ అనేక విమర్శలను ఎదుర్కొంటున్న విద్యాధికుడు శశిధరూర్‌కు చరిత్ర తెలుసా?
వాగుడుకు అర్థాలు వెదకకూడదు.

కొలుసు శోభనాచలం, గరికపర్రు, కృష్ణాజిల్లా
‘తన మెడపై కత్తి పెట్టినా భారత్ మాతాకీ జై అనను’ అని వ్యాఖ్యానించిన ఈ కరడుగట్టిన మతవాది రాజ్యాంగం ప్రకారం ఏ శిక్షకు అర్హుడు?
ప్రతి దానికీ రాజ్యాంగానే్న వెతికి చూడనక్కర్లేదు. అందులో పేర్కొనని అవకరాలు అనేకం ఉన్నాయి. వాటి విషయంలో ఏమి చేయాలన్నది సమాజం ఆలోచించుకోవాలి.

ఎ.వి.సోమయాజులు, కాకినాడ
ప్రత్యేక హోదా 15 ఏళ్లు, 10 ఏళ్లు కావాలని అప్పుడు పోరాడిన వాళ్లు ఇప్పుడు దాటవేయడం?
రాజకీయం... అవకాశవాదం..

పైడిపాల, అమలాపురం
19.3.2016 సంచికలో ‘ఆదర్శ చీకటి’ కథ డబ్బింగ్ సినిమా టైటిల్‌లా అధ్వాన్నంగా ఉంది. మీవంటి భాష మీద పట్టున్న సంపాదకులు అటువంటి కథల్ని ఆమోదించడం...?
అనెయ్యండి. ఫర్వాలేదు.
*

ప్రశ్నలు పంపాల్సిన చిరునామా : మనలో మనం, ఆదివారం అనుబంధం, ఆంధ్రభూమి దినపత్రిక, 36 సరోజినీదేవీ రోడ్, సికిందరాబాద్-500003
e.mail : bhoomisunday@deccanmail.com