మనలో - మనం

మనలో మనం ( ఎడిటర్‌తో ముఖాముఖి)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎ.వి. సోమయాజులు కాకినాడ
కౌన్సిల్ అనవసరం, దాని పేర ప్రజాధనం వృథా ఖర్చు అని గతంలో అంటూ వచ్చిన బాబుగారు ఇప్పుడు తన తనయుడిని కష్టపడి ఎమ్మెల్సీని చేశారేమిటి? కలెక్టర్లకే ఆజ్ఞలు చేసే సిఎం తనయుడి హోదా కంటే ఎమ్మెల్సీ పదవి గొప్పదా? పెద్దల సభకు ఈ చిన్న వయసు వాడిని పంపడం సబబేనా?
ఎగువ సభలు రాజకీయ పునరావాస కేంద్రాలుగా మారి చాలా కాలమైంది. అబ్బాయని మంత్రిని చేయదలచుకున్నప్పుడు కౌన్సిల్ రూటే సేఫ్! ఆర్నెల్లలో ప్రత్యక్ష ఎన్నికల్లో నిలబడాల్సిన రిస్కు ఉండదు. ఎవరి భయం వారిది.

శ్రీనివాస్ ములుగూరి (ఈమెయల్)
మన హిందూ ధర్మం ప్రకారం సర్వసంగ పరిత్యాగులు మరియు సన్యాసులు రాజ్యాధికారానికి అనర్హులు అంటారు. ప్లాటో యుటోపియాలో కుటుంబం లేని రాజు ఆదర్శ రాజు అంటాడు. ఇప్పుడు మన దేశం ప్లాటోని అనుసరిస్తుందా?
సన్యాసులందరూ సర్వసంగ పరిత్యాగులు కారు. కాషాయధారులైన పాలకులు ఇంతకుముందూ ఉన్నారు. కుటుంబం ఉండటం, ఉండకపోవడం, కాషాయం కట్టడం, కట్టకపోవడం కాదు... రాజ్యాధినేతకు కావలసింది రాజధర్మాన్ని గుర్తెరిగి, సమర్థంగా పరిపాలించే లక్షణం. కుటుంబం ఉన్న రాజయోగి జనకుడు మీరన్న తత్త్వవేత్త పుట్టటానికి వేల ఏళ్ల పూర్వమే ఆదర్శ రాజు అనిపించుకున్నాడు.

బి.ఆర్.సి. మూర్తి, విజయవాడ
కులాలవారీగా రిజర్వేషన్లు, కార్పొరేషన్లు, వివాహ వేదికలే కాక జాబ్ మేళాలు ఎంతవరకు సబబు?
అది మన కాలపు తెగులు.

బొడ్డు రామకృష్ణ, చిరతపూడి
దొంగలు, దోపిడీదారులు దొరికినప్పుడు వారిని ముసుగులు వేసి పోలీసుస్టేషన్‌లో పోలీసులు మనకు చూపిస్తారు ఎందుకు?
ఆనక ఐడెంటిఫికేషన్ తతంగానికి వీలుగా...

లంచగొండులు దొరికినప్పుడు పెద్ద చేప దొరికిందని పేపర్లలో ఫొటోలతో సహా చూపిస్తారు. తరువాత ఆ లంచగొండులకు ప్రమోషన్లు వచ్చిన దాఖలాలు ఉంటే ఏమనుకోవాలి?
పెద్దచేప ఇంకా పెద్దచేప అయందన్నమాట.

పి. రామకృష్ణ, రాజమండ్రి
తెంపరి ఎన్నికల్లో గెలవడు అన్న టైమ్ మ్యాగజైన్‌కి ట్రంప్ గెలవగానే ఘశ యచి ఆ్దళ కూళ్ఘూ గా ఎలా ఎంపిక అయనట్టు?
ఏ ఎండకా గొడుగు.

సిహెచ్. సాయ రుత్విక్, నల్గొండ
ఇటీవల పత్రికలలో ప్రచురితమవుతున్న కథలు ఒకే మూసలో పోసినట్లుగా వుంటున్నాయ. ఒక రచయత ఒక కొత్త ఇతివృత్తం ఎంచుకొని ఒక కథ రాస్తే తర్వాత అదే ఇతివృత్తం మీద తామరతంపరగా కథలు వచ్చి పడుతున్నాయ. తెలుగు నాట ఇదివరలో లబ్ధప్రతిష్టులైన ఎందరో కథకులు వైవిధ్యభరితమైన రచనలతో తెలుగు రచనా రంగానికి ప్రపంచ ఖ్యాతి తీసుకురాగా ఇప్పుడు అలాంటి పరిస్థితి కనబడటం లేదు. తెలుగు సాహిత్య రంగానికి దుర్దశ ఎందుకు వచ్చిందంటారు?
కాపీ కళ ఇంతకుముందూ ఉన్నదే. రాసేవాళ్ల బుర్రల్లో సారం పలచబడటం వల్ల ఇప్పుడు మరీ అధ్వాన్నమైంది.

జి.ఎస్.కె మోహన్, విజయవాడ
అన్ని కులాల్లో ఆర్థికంగా వెనుకబడినవారు ఉన్నారు. అగ్రకులాల ముద్ర వేయంచబడి ఎంతోమంది వెనుకబడిపోతున్నారు. ఎంతోకొంత అభివృద్ధి చెందినవారికి కూడా రిజర్వేషన్లు అవసరమా? ఈ రిజర్వేషన్లు ఇంకా ఎంతకాలం?
రాజకీయం తన చుట్టూ తాను తిరుగుతూ ఓట్ల చుట్టూ తిరిగినంత కాలమూ వౌలిక సంస్కరణలు సాధ్యపడవు.

కుంచం రామారావు, విజయనగరం
ఎక్కడ అన్యాయం జరిగినా జగన్ అక్కడకు క్షణాలమీద వెళ్లి రైతులుగాని, కర్షకులు గాని, సామాన్య ప్రజలు గాని, మహిళలు, విద్యార్థులు... ఇలా ఎవ్వరికైనా అన్యాయం జరిగితే అక్కడికి వెళ్లి వాళ్లకు బాసటగా నిలుస్తున్నారు. 2019లో అతనికి అందరూ మద్దతు తెలిపి ముఖ్యమంత్రిని చేస్తారా?
ఆయన వారికి ఆ అవకాశం ఇస్తే! తన బలాన్ని, బలహీనతనలను గుర్తెరిగి సెల్ఫ్‌గోల్స్ కొట్టుకోకుండా జాగ్రత్తపడగలిగితే!
*

ప్రశ్నలు పంపాల్సిన చిరునామా

మనలో మనం,
ఆదివారం అనుబంధం, ఆంధ్రభూమి దినపత్రిక,
36 సరోజినీదేవీ రోడ్,
సికిందరాబాద్ - 500003.

: email :
sundaymag@andhrabhoomi.net