మంచి మాట

జ్ఞానమార్గం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రస్తుతం ప్రపంచంలో మానవుడు ఏదో ఒక సమస్యతో బాధింపబడుతున్నాడు. శారీరక మానసిక అనారోగ్యాలు, కుటుంబ సమస్యలు మానసిక అశాంతి, దారిద్య్రం, అవినీతి మొదలగు రకరకాల కుటుంబ సామాజిక, శారీరక మానసిక సమస్యలకు బలవుతున్నారు. సుఖం, శాంతి లేని అల్పాయుషుతో జీవిస్తున్నారు.
మనిషి 84 లక్ష జీవరాసులలో బుద్ధి, జ్ఞానంచే అధికుడు. తన మేధా శక్తిని విశ్వకల్యాణానికి, సమాజ క్షేమానికి వినియోగించక తమ తమ స్వార్థ ప్రయోజనాలకు ఉపయోగించుకుంటున్నాడు. తన సుఖం కోసం తోటి మనిషిని బాధిస్తున్నాడు. సకల జీవజాతిని హింసించడం, వధించడం, ప్రకృతిని కలుషితం చేయడం, చేయకూడని పనులు చేయడం, దోపిడీలు - వీటివల్ల తన వినాశనాన్ని తనే కొని తెచ్చుకుంటున్నాడు. కారణం శారీరక, ఇంద్రియ, మానసిక స్థాయిలలో మానవుడు జీవించడం. ఒక్క మాటలో చెప్పాలంటే అజ్ఞానం. తన సహజ స్థితిని మరచి ప్రాపంచిక స్థితిలో ఉండడమే. సత్యాన్ని, ధర్మాన్ని విస్మరించడం. తనలోని దైవత్వాన్ని మరిచి రాక్షసత్వంలో జీవితం సాగించడమే. మనకు సనాతన ఋషులు అందించిన సత్యాలను జీవన సూత్రాలను సరైన రీతిలో ఉపయోగించుకోలేకపోవడమే.
ఆధ్యాత్మికత అంటే మనసు కమ్మిన అజ్ఞాన తిమిరాలను, జ్ఞాన ప్రకాశంతో తొలగించుకోవడం. త్రికరణశుద్ధితో ఆత్మ స్థితిలో జీవించడం. భూత, భవిష్యత్తులను వదలి వర్తమానంలో జీవించడం. సత్యంలో జీవించడం. ముందు మనసును సంస్కరించుకోవాలి. మనసు మహమ్మారి అహంకారానికి మారు పేరు.
కనుక అహంకారాన్ని కరిగించుకుంటే పరిమితత్వం పోయి అనంత స్థితిని అనుభవించగలరు. సమదృష్టి, సమబుద్ధి, సమగ్ర వ్యక్తిత్వం కలిగి యుండడం, త్రిగుణాలకు అతీతంగా, శుద్ధ సాత్విక గుణంలో జీవించడం, సమస్త సృష్టిలో అంతర్లీనంగా వున్న పరమాత్మ తత్త్వాన్ని అనుభవపూర్వకంగా గ్రహించడం. ఏ అనుభవంలో ఆనందం ఆయుష్షు, ఆరోగ్యం లభిస్తాయో అదే ఆధ్యాత్మికత. ఉపచేతన మనస్సును సమూలంగా శుద్ధి చేసి తన మనసును చైతన్యపరిచే ప్రక్రియ. ప్రపంచాన్ని వాస్తవ దృష్టితో చూడటానికి, పరమాత్మ తత్వాన్ని అనుభవించడానికి, ఇది స్పష్టమైన మార్గం.
ఆధ్యాత్మికత ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం, సద్గ్రంధ పఠనం ద్వారా సాధించుకోవచ్చు. సాధన ద్వారా ‘ఆత్మ సత్యం, జగన్మిథ్య’ అనగా ఆత్మ మార్పులేనిది. అన్ని కాలాలలో వున్నది. దీనికి చావు పుట్టుకలు లేవు. జన్మించేది, మరణించేది దేహమే. దేహాలు మారుతాయి కాని సచ్చిదానంద స్వరూపమైన ఆత్మ ఒకటే అని సాధన ద్వారా అనుభవంలోకి తెచ్చుకుని నిత్యా నిత్య వస్తు వివేక జ్ఞానంతో ప్రపంచంలో వుంటూ ప్రాపంచిక విషయాలలో నిమగ్నవౌతూ, వృత్తి, వ్యాపార, దైనందిన జీవితంలో అన్నిటినీ అనాసక్తంగా అనుభవిస్తూ దేనిలోనూ చిక్కుబడకుకండా ‘తామరాకుమీద నీటిబొట్టు’లాగా జీవించడమే ఆధ్యాత్మికత.
ఈ ఆధ్యాత్మికత ప్రస్తుత సమాజానికి ఎంతో అవసరం. ఆదర్శ ప్రపంచ నిర్మాణానికి, వసుధైక కుటుంబం ఏర్పడటానికి, జాతుల, మతాల, కులాల కుమ్ములాటలను నిర్మూలించడానికి, మానవ జాతిని పట్టి పీడించే అశాంతి, రోగాలు, దుఃఖాలు, భవబంధాలనుండి విడిపించటానికి మానవుని జ్ఞాన మార్గంలో పయనింపజేయడానికి ఆధ్యాత్మిక మార్గం తప్ప వేరొక ప్రత్యామ్నాయ పద్ధతి లేదు. కనుక అందరూ దీనిని అనుభవంలోకి తెచ్చుకుని సత్యజ్ఞాన సంపత్తిని సమకూర్చుకొని లోక కల్యణాన్ని కాంక్షిస్తూ మానవ జన్మ లక్ష్యాన్ని సాధిస్తాం.

-కె.లక్ష్మి