మంచి మాట

కృష్ణం వందే జగద్రక్షకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీ మహావిష్ణువు దుష్టశిక్షణ శిష్టరక్షణ కొరకు దాల్చిన అవతారాల్లో సంపూర్ణావతారంలేక పరిపూర్ణావతారం కృష్ణావతారం.ఈ అవతారంలో దుష్టశిక్షణ శిష్ట రక్షణతోపాటు శృంగార, వైరాగ్య, భక్తి, స్నేహ, రౌద్ర, అద్భుతాది అనేక రసాలు ప్రదర్శించాడు.రాముడు అవతారం దాల్చినపుడు కేవలం ధర్మానికి ప్రతిరూపంగా భాసిల్లాడు. శత్రువుల గుండెల్లో నిద్రపోయాడు. అసురులను మట్టుపెట్టాడు. ఏకపత్నీవ్రతుడై విరాజిల్లాడు. భాతృప్రేమకు, పితృప్రేమకు తల్లి ప్రేమకు శ్రీరాముడు పెట్టింది పేరుగా పేరెన్నికగన్నాడు. శ్రీరాముడు తన సేవకులకు, స్నేహితులకు కూడా ఆయన ఆరాధ్య దైవంగా భాసిల్లాడు. శ్రీరాముడు శత్రువులను నాశనంచేసినా ధర్మపునఃస్థాపనే పరమోద్దేశంగా కనబడింది. దశరథపుత్రుడిగానే రాముడు మాట్లాడాడు కాని తాను శ్రీహరి అవతారమని చెప్పలేదు. కేవలం నరుడిగా పురుషోత్తముడిగానే కీర్తనలందుకున్నాడు.
కాని శ్రీకృష్ణావతారంలో అడుగడునా తాను జగత్‌కు ప్రభువనని నేను ఈ సృష్టికి మూలమని స్వయంగా చెప్పాడు. ప్రతి అంశంలోను ఇది భగవంతుడైన శ్రీకృష్ణుడు శ్రీహరి అవతార చేష్టయని చెప్పక చెప్పాడు.
తాను పుట్టబోయన దేవకీవసుదేవులకు పుట్టుక ముందే తన అద్భుతాన్ని చేసి చూపించాడు. తాను శిశువుగా మారింతర్వాత ఏమి చేయాలో ఆయనే చెప్పాడు. ఆయన మహిమవల్లే కారాగార తలుపులు వాటికవే విడివడి పోయాయ. యమునా నదిరెండుగా చీలి దారి ఏర్పడింది. నందాదులు యోగనిద్రకు దాసులయ్యారు. తమ బిడ్డను తీసుకొని వసుదేవుడు తాను తెచ్చిన బిడ్డను తమ పక్కన పరుండబెట్టి వెళ్లిపోయనా వారికి తెలియలేదు. అట్లానే శిశురోదనంతో పరుగెత్తుక వస్తానని చెప్పిన కంసుడు, కావలిగాండ్లు కృష్ణమైకంతో నిద్రలోకి జారుకున్నారు. వసుదేవుడు నందునిదగ్గరకు వెళ్లి తిరిగి చెరసాలకు వచ్చి దేవకీదేవి పక్కన యోగమాయను పడుకోబెట్టేదాకా వారెవరికీ బాహ్య చింతన లేకపోయంది. ఇదంతా కృష్ణమాయనే.
అట్లానే అమ్మస్తన్యపానం చేసే వయస్సులోనే పూతన ప్రాణాలను తోడివేశాడు. బోర్లాపడే వయస్సులోనే శకటాసురుని అసువులు బాపాడు. ఇలా ఎందరి రాక్షసులనో ఒంటి చేత్తో అంతేకాదు బాలకునిగా ఉన్నప్పుడే వారి కుత్తుకలు కత్తిరించాడు.
కాళీయమర్థనం చేసినా, గోవర్థనగిరి నెత్తి రేపల్లె వాసులందరినీ రక్షించి కాపాడినా అదంతా దైవం యొక్కమాయనే. ఈ కృష్ణమాయను బ్రహ్మ సైతం తెలుసుకోలేక పోయాడు. రేపల్లె వాసుడు గోపాలుడు గోవులు కాచే గోపీజనవల్లభుడు పరమాత్మ అయన శ్రీకృష్ణుడా ఏది చూద్దాం అనుకొన్నాడు బ్రహ్మ. తాను అనుకొన్న విధంగానే గోవులను గోపాలురను ఎత్తుకుపోయాడు. ఈ చర్యతో రేపల్లె అంతా గగ్గోలు అవుతుంది. దాని ఫలితంగా ఈ గోపాలుడు శ్రీకృష్ణ పరమాత్మ విషయం తేట తెల్ల మవుతుందనుకొన్నాడు. కొంతకాలం ఎదురుచూశాడు. తిరిగి తాను చేసినపనికి ఎలాంటి విపరీతాలు దాపురించాయో బ్రహ్మ తెలుసుకొందామని రేపల్లెకు వెళ్లాడు. అక్కడ గోపాలురు, గోవులు, గోపబాలికలు గోపవనితలు గోపజనం అంతా కృష్ణునితో ఆడుతూ పాడుతూఉన్నారు. వారంతా వారివారి దైనందిన చర్యలకు ఏమాత్రం ఆటంకమే లేనట్టు జీవిస్తున్నారు. కృష్ణయ్య ఎంతో నింపాదిగా తనకేమీ అసలుతెలీనట్టే ఉన్నాడు. దీన్ని చూచి మ్రాన్పడిపోయన బ్రహ్మ తన తప్పును తెలుసుకొన్నాడు. శ్రీకృష్ణుడే అఖిలలోకనాయకుడని తెలుసుకొన్నాడు. స్వామి కృష్ణమాయను తెలుసుకోలేక అజ్ఞానియై ప్రవర్తించాను. నన్ను క్షమించమని విరించి వేడుకున్నాడు. చల్లని చిరునవ్వుతో శ్రీకృష్ణుడు బ్రహ్మను వీక్షించాడు.
ఈ శ్రీకృష్ణుడే తన్ను మాత్రమే నమ్మినవారికి తానే సర్వం అయ అలరించాడు. కృష్ణుడు తప్పఅన్యమెరుగుని తన భక్తులను తానే సర్వవేళలా కాపాడుతానని అభయం ఇచ్చాడు. అందుకే వారంతా కృష్ణం వందే జగద్రక్షకం అన్నారు. జగత్‌కు గురువు, దైవం అన్నీ కృష్ణస్వామినే. జగత్తే కృష్ణమయం.

- కె. యాదయ్య