మంచి మాట

క్రమశిక్షణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రమశిక్షణ వ్యక్తిని మానసికంగాను, భౌతికంగాను అదుపులో వుంచి ప్రయోజనకరమైన పనులను సాధించేందుకు తోడ్పడుతుంది. మనసును కట్టడి చేస్తుంది. సద్గుణాలకు క్రమశిక్షణ తోడైతే సాధ్యం కాని పని ఏదీ ఉండదు. వ్యక్తుల వ్యక్తిత్వాన్ని క్రమశిక్షణను బట్టి అంచనా వేసే వీలుకలుగుతుంది. మొక్కై వంగనిది మానైవంగునా అన్నట్టు చిన్నప్పటి నుంచి క్రమశిక్షణకు అలవాటు పడకపోతే పెద్దయైన తరువాత వారు ఏపనిని సక్రమంగా చేయడానికి అవస్థలు పడాల్సి ఉంటుంది. జీవితంలో మంచి పనులు చేస్తూ చెడుపనులకుదూరంగా ఉండడంలోను కూడా క్రమశిక్షణ తోడు అవుతుంది.
క్రమశిక్షణలోని ప్రధానాంశం సమయపాలన. రోజువారీ పనులకుకానీ, దీర్ఘకాలిక పరిమితిగల పనులకు కానీ క్రమశిక్షణ అవసరం. ఉన్నత లక్ష్యాల సాధనకోసం దీర్ఘకాలిక ప్రణాళికలను సిద్ధం చేసుకోవడానికీ, అమలుపరచడానికీ క్రమశిక్షణ అవసరం.
రోజువారి ఆర్థికాంశాలలో కూడా క్రమశిక్షణ అవసరం. ఆదాయ వ్యయాలను సమన్వయం చేసుకుంటూ ఖర్చుచేయడం, డబ్బును సద్వినియోగం చేయడంఇలాంటి వాటిని కూడా క్రమశిక్షణతో చేసినట్టయతే మంచిఫలితాలను రాబట్టే వీలు ఉంటుంది.
క్రమశిక్షణ మనిషిని నియంత్రిస్తుంది. పరుషపు మాటలు, వ్యర్థపు మాటలు, పరనిందలు చేయడం లాంటిపనులు చేయకుండా ఉండడంలో కూడాఈ క్రమశిక్షణ దోహదం చేస్తుంది. వినయంతోను ప్రేమతో మాట్లాడడానికి ఈ క్రమశిక్షణ ఎంతో పనికివస్తుంది. నిర్ణీత ఆహారం తీసుకొంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి క్రమశిక్షణ తోడ్పడుతుంది. క్రమశిక్షణ ప్రతి ఒక్కరికీ అవసరం.
క్రమశిక్షణ గల పౌరునిగా రాముడు ఎంతో కీర్తివంతుడు అయ్యాడు. రాముని ఉన్న క్రమశిక్షణ వల్లే ‘ ఐశ్వర్యం, ధర్మం, కీర్తి, సంపద, జ్ఞానం’ అనే గుణాలే రూపు ధరించినవానిగా శ్రీరాముని వర్ణించారు. రామానుజుడుగా పేరు పడినలక్ష్మణుడు , భరతుడువీరిలో ఉన్న క్రమశిక్షణ వల్లే వారు అనుకొన్న పనులు కఠినమైనా సాధించగలిగారు. పదునాల్గేండ్లు కోసల దేశానికి రాముని ప్రతినిథిగా ఉంటూ రాజ్యవ్యవహారాలను రామునిలాగా ఛూడడానికి కూడా భరతునిలోని క్రమశిక్షణే పనికివచ్చింది.సీతానే్వషణలో రామునికి ఎప్పటికప్పడు దుఃఖాన్ని దూరం చేయడంలోను లక్ష్మణుని పాత్ర అమోఘమవడానికి కారణం లక్ష్మణునిలోని క్రమశిక్షణే.
పాండవుల్లో ఉన్న క్రమశిక్షణ వల్లే వారు వందమంది కౌరవులకన్నా బలోపేతులు అయ్యారు. అర్జనుడు విలువిద్యలో ఆరితేరినవాడుగాను, భీముడు గదాయుద్ధంలో మేటిగాను ధర్మరాజు వినయసంపదలో అందరినీ మించినవాడుగాను, ధర్మాచరణలో యముని వంటివానిగా గాను పేరుబడిసారంటే దానికి కారణం వారిలో ఉన్న క్రమశిక్షణనే. కృతయుగంలో తపస్సు, త్రేతాయుగంలో జ్ఞానము, ద్వాపరయుగంలో యజ్ఞయాగాదులు, మరి కలియుగంలో దానము చేసికోవటం మానవ ధర్మమమని శాస్త్రాలు పేర్కొంటున్నాయి. ఈ దానంచేయలేనివారు కేవలం నామస్మరణ వల్ల జన్మను ధన్యం చేసుకోవచ్చు. అయతే నామస్మరణ చేయడం కూడా అన్యఆలోచనలవల్ల చేయలేకపోవచ్చు. అదే క్రమశిక్షణ ఉన్నట్లయతే మనసు నియంత్రణ చేసి సదా భగవంతుని నామాన్ని జపించే శక్తి సామర్థ్యాలను పొందవచ్చు. నాలుగు వేదాల అధ్యయనంకంటె ఒక్క సత్యం ఉన్నతమైనది. అట్లాంటి సత్యం మాట్లాడడానికి ధైర్యం అవసరం. జీవితానికి ఏర్పరుచుకున్న క్రమశిక్షణతో సత్యధారణ సులభంగా చేయవచ్చు. సత్యధర్మాలను ఆచరించేందుకు క్రమశిక్షణ ఎంతో మేలు చేస్తుంది. నేటి బాలలే రేపటి పౌరులు కనుక వారికి ఉపాధ్యాయ వృత్తి చేయువారు వారి విద్యార్థులందరికీ క్రమశిక్షణ నేర్పి, భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాలి. న్యాయవాదులు తమకున్న క్రమశిక్షణతోనే ధర్మనిర్ణయాలు చేయాలి. ఏరంగంలో ఉన్నవారికైనా వారిలో ఉన్న క్రమశిక్షణద్వారా వారు ఉన్నతమనస్కులుగా కీర్తించబడుతారు. కనుక క్రమశిక్షణ ప్రతివారు కలిగి ఉండడమే శ్రేయస్కరం.

- రాం ప్రసాద్