మంచి మాట

మనస్సు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మన మనస్సు చంచల స్వభావం కలిగినది. సర్వకాల సర్వావస్థలయందును ఏదో ఒక విషయముపై చింతించుచునే యుండును. ఒక్క క్షణమైననూ తీరిగ్గా యుండదు. ఒక విషయము నుండి మరొక విషయమునకు త్వర త్వరగా మారిపోవుచుండును. లోకంలో మనోవేగానికి మించిన వేగము మరియొకటి లేదు. ఇటువంటి మనస్సును యధేచ్చగా విడిచినచో, ఇంద్రియములకు అధీనమై, కామక్రోధాదులను బలపరచి అహంకార మమకారములను వృద్ధి చేసి, మనల్ని పాపపు దారిలో నడిపించి అధోగతి పాలు చేస్తుంది.
మనస్సు బహు చంచలమైనది అగుట చేత ఏ విషయమునందును స్థిరముగా నిలువక సంచరించుచుండును. అట్టి చంచల చిత్త అయిన మనస్సును విషయ లోలత్వమునుండి మరల్చి ఆత్మయందే స్థాపితము చేసి ఆత్మకు సర్వదా అధీనమై ఉండేటట్లు చేయవలెనని భగవద్గీతలో చెప్పబడింది. గొప్ప ఆకర్షణలు మనల్ని లోబరచుకోవడానికి ప్రయత్నిస్తున్నపుడు మనం ఏం చెయ్యలో ఆలోచించుకోవాలి. ఆ సమయంలో మీ ఆలోచనలను మంచివాటిమీదకి మెచ్చదగిన విషయాలమీదకి మళ్లించండి. మీ మంచి ఆలోచనలు మీ హృదయాలను నింపివేసినపుడు అవి ఆకర్షణలను, దుష్ట సంకల్పాలను దూరంగా తరిమివేస్తాయి. పెద్దవైనా, చిన్నవైనా అన్ని రకాల ఆకర్షణలకూ తిరుగులేని మందు ఏమిటంటే, మీ హృదయాన్ని తెరచి వుంచి, దాని సూచనలను, భావాలను, అనురాగాలను మీ గురుదేవులకు నివేదించండి. నిరంతరం భగవంతుణ్ణి నామజపం చేస్తూ వుంటే, ఊపిరితీయడంలోనూ, వదలడంలోనూ ఆయన పేరునే తలుస్తూ వుంటే అపుడు ప్రతికూలమైన ఆలోచనలు రావటానికి అవకాశం ఉండదు. ఇటువంటి ప్రతికూలమైన స్వభావాలను నిరంతరం ఒక కంట కనిపెట్టి ఉండాలి. ఎట్టి పరిస్థితులలోనూ వాటికి మద్దతు ఇవ్వరాదు.
మనస్సు మీద నిరంతరం నిఘా వేసి ఉంచాలి. ఎటువంటి అనవసరపు ఆలోచనలు, ఆకర్షణలు లోనికి చేరకుండా చూసుకోవడం మంచిది. అవి ఎపుడు లోనికి చొరబడాలని చూసినా వెంటనే భగవంతుని వైపు తిరిగి మనఃపూర్వకంగా ప్రార్థించండి. అలా చేయడంవల్ల మనస్సు పవిత్రమవుతుంది.
మనస్సు మలినమైనచో స్థిరత్వము ఉండదు. మలినమైన మనస్సు చంచలత్వమునకు లోనై ఉన్న కారణంగా ఆత్మావలోకనం సిద్ధించదు. మనస్సు చంచల స్వభావము కలిగియున్న కారణంగా స్థిరత్వమును కోల్పోయి వివేచనాశక్తిని, ధారణ శక్తిని కోల్పోయి ఆధ్యాత్మిక చింతనకు దూరమైపోతుంది. అందువల్ల మనం సరైన పద్ధతిలో ఆధ్యాత్మిక చింతనను చేయలేము. అందుకే మనం మనోనిగ్రహాన్ని అలవర్చుకోవాలి.
సర్వఅవస్థల యందును, సర్వకాలములయందును ‘మనస్సు’ను నిగ్రహించుకొనుట అనే లక్షణము ఉత్తమమైనది అని వ్యాస భగవానుడు చెప్పియున్నారు. మనస్సును జయించినవాడు ముల్లోకములను జయించవచ్చును. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములు అనునవి మానవుని మనఃశాంతికి బద్దశత్రువులు. ఈ శత్రువులు మన భౌతిక, మానసిక శక్తులను క్షీణింపజేస్తాయి. అందువల్ల ఆధ్యాత్మిక శక్తిని పెంచుకోవటానికి తప్పనిసరిగా అరిషడ్వర్గములను జయించాలి. మనిషి ప్రాపంచిక సుఖాలకు లోబడి సహజ స్వాతంత్య్రాన్ని పోగొట్టుకుంటున్నాడు. తనలోని సద్గుణాలను పోగొట్టుకుని దుఃఖానికి ప్రబల కారణమైన కోరికలకు బానిస అవుతున్నాడు. కోరికలకు బానిస కాకుండా నిరంతరమైన అభ్యాసంతో మనస్సును భగవంతునిపై కేంద్రీకరించాలి. మనస్సును పవిత్రమైన ఆలోచనలతో నింపితే చివరికి ఆ పవిత్రమైన ఆలోచనలు మాత్రమే మనలోనుంచి బయటకు వస్తాయి. అపుడు మనస్సు శుభ్రపడుతుంది.
మితాహారము, బ్రహ్మచర్యము, గృహస్థాశ్రమ ధర్మములను సక్రమంగా నిర్వర్తించుటవల్లనూ, ఉపవాస, వౌనవ్రత దీక్షలు జరుపుటవల్ల సాత్వికాహారం భుజించటంవల్ల మనం తప్పనిసరిగా మనస్సును నిగ్రహించుకోవచ్చును.

-నల్లా నరసింహమూర్తి