మంచి మాట

లోక కల్యాణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశ్వామిత్రుని యాగ సంరక్షణార్థం వెళ్లిన రామక్ష్మణులు విశ్వామిత్రులవారు చెప్పే కథలను వింటూ ముందుకు సాగారు. విశ్వామిత్రుడు ఇచ్చిన అస్తశ్రస్త్రాలను వారు ఎంతో వినమ్రంగా తీసుకొన్నారు. అలా వారు మువ్వురు త్రేతాగ్నులలాగా సిద్ధాశ్రమంలోకి వెళ్లారు. అక్కడ విశ్వామిత్రుడు చేపట్టిన యాగాన్ని నిర్విఘ్నంగా సాగడానికి రామలక్ష్మణులు శ్రమపడ్డారు. చివరకు యాగం పరిసమాప్తి చెందింది. దాంతో విశ్వామిత్రుడు ఎంతో సంతోషించాడు. మునిగణమంతా ఆనందించారు. ఇక అక్కడ నుంచి వారి కొచ్చిన ఆహ్వానం మేరకు మిథిలానగరం వెళ్తూ విశ్వామిత్రుడు తన శిష్యులను జనకుని యాగానికి తీసుకుని వెళ్లాడు. అక్కడ ఉన్న శివధనస్సు గురించి వారికి చెప్పగా రామలక్ష్మణులు ఆసక్తి కనబరిచారు.
విశ్వామిత్రుని ఆజ్ఞతో శివధనుస్సును రాముడు ఎక్కుపెట్టాడు. శివధనుర్భంగం జరిగింది. జనకుడు ఆయన చేసిన ప్రతిజ్ఞను చెప్పి దశరథాదుల అనుమతితో సీతారాముల కల్యాణం జరిపించారు. రామాదులు నలుగురు సీత ఆమె చెల్లెళ్లతో వివాహాలు చేసుకున్నారు. అందరూ కలసి అయోధ్యకు పయనమయ్యారు. దారిలో వారికి పరశురాముడు దర్శనమిచ్చాడు. రామునితో మాటలాడిన అనంతరం పరశురాముడు తపస్సు చేసుకోవడానికి వెళ్లిపోయాడు. ఆ తరువాత ఏ విఘ్నం లేకుండా రామాదులంతా అయోధ్యకు చేరారు.
కొన్నాళ్లు సంతోషంగా గడిపారు. కైకమ్మ కోరికలతో పట్ట్భాషిక్తుడు కావలసిన రాముడు అడవి బాట పట్టాడు. అక్కడ ఎందరి రాక్షసులనో దునుమాడాడు. సీతమ్మను దూరం చేసుకొన్నాడు. సీతమ్మను వెతకడంలో వానరుల సాయం తీసుకొన్నాడు. చివరకు రావణుని చెరలో సీతమ్మ ఉందన్న నిజాన్ని తెలుసుకొన్నాడు. వారథి నిర్మించి సముద్రాన్ని దాటి లంకలో ప్రవేశించాడు.
లంకాధిపతి యైన రావణుని రాముడు సంహరించాడు సీతమ్మను తన దగ్గరకు చేర్చుకున్నాడు. తిరిగి అయోధ్యకు వచ్చి 11వేల సంవత్సరాలు రాజ్యపాలన చేశాడు. ఎన్నో కష్టాలు అనుభవించినా రాముడు ధర్మాచరణను ఎపుడూ విడనాడలేదు. సత్యానే్న తన ఆయుధంగా చేసుకొన్నాడు. ప్రజారంజకంగా పాలించిన రాముని రాజ్యం లాంటిదే కావాలని నేడు కూడా జనులందరి ఆకాంక్ష. ఆ రామరాజ్యంలో అవిద్య ఉండేదికాదట. ప్రతిఒక్కరూ అక్షరాస్యులే ఉండేవారట. ఏవిధమైన సంపదను దోచుకునే చోరులు ఉండేవారు కారట. అందరూ కష్టపడి తమకున్న దానిలో తృప్తితో జీవనం సాగించేవారట.
నేటి కాలంలో కూడా సంతృప్తితోను జీవించడం అలవాటు చేసుకోవాలి. అవిద్యను దూరం చేసుకోవాలి. అందరూ చదువుకోవాలి. జ్ఞానాన్ని సముపార్జించాలి. అపుడే నీతి నిజాయతీలతో జీవిక సాగించడానికి వీలు ఉంటుంది. సత్యధర్మాలు, నీతి నిజాయతీలను అందరూ ఎపుడు కలిగి ఉంటారో అపుడే రామరాజ్యం మళ్లీ కళ్లముందు కదలాడుతుంది.
చిన్ననాటి నుంచి పిల్లలందరికి విద్యాబుద్ధులను నేర్పించాలి. వారిలో త్యాగగుణాన్ని ప్రోది చేయాలి. పురాణ పురుషుల జీవిత చరిత్రలను వారికి తెలియచేయాలి. పెద్దలైన వారు విచక్షణతో స్వార్థం లేకుండా జీవించడం అందరి యెడల సమబుద్ధితో వ్యవహరించడం అనే వాటిని అలవాటు చేసుకోవాలి. కోరికలను అదుపులో పెట్టుకోవాలి. నలుగురి మంచిని సదా కోరుకోవాలి. లోకాసమస్తాసుఖినో భవన్తు అన్న భావనలు చేయాలి.

రాంప్రసాద్