మంచి మాట

జ్ఞాన సంపద

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శుక్ల యజుర్వేద ప్రవర్తకుడు, శత పథ బ్రాహ్మణాన్ని, వైదిక లౌకిక ధర్లాను జీవం పోసి యాజ్ఞవల్క్య మహాముని రాజగురువుగా ఎన్నో సార్లు వారు ప్రతివాదాలలో సర్వోత్తముడుగా నిలిచి పారితోషకాలందుకొన్న వివేక చూడామణి. చులకనగా చూబడడం ఇష్టం లేక ఒకానొక సందర్భంలో గురుధిక్కారం చేశావన్న ఆరోపణ ఇష్టపడక గురువు ఆజ్ఞమేరకు ఆయన ప్రసాదించిన విద్యలన్నింటిని నిప్పుకణాల రూపంలో వదిలివేసి, ఆశ్రమం విడిచి వెళ్లిన ఆత్మాభిమాని. సూక్ష్మ శరీరంతో స్వయంగాసూర్యభగవానుననుసరించి తనకు ఇష్టమైన శుక్ల యజుర్వేదాన్ని అభ్యసించిన ధీశాలి. తన పాండితీ ప్రతిభతో సంచలనాన్ని సృష్టిస్తున్న ఈ విద్యావేత్తను అల్లునిగా చేసుకోవాలన్న కోరిక మిథిలానగర సమీపంలో వున్న కతుడు అనే మహర్షికికలిగింది. తనకుమార్తె కాత్యాయని యాజ్ఞవల్క్యమహర్షికి తగిన ఇల్లాలని చెప్పి ఆయనకిచ్చి వివాహం చేశాడు కతుడు.
యాజ్ఞవల్క్యుని ధీశక్తి, వాక్పటిమాదులు చూచి ఆ జ్ఞాన ఖని దగ్గర వేద ప్రతిపాదితాలైన ఎన్నో విషయాలు తెలుసుకోవాలి. ఆయనను వివాహమాడైనా సరే.. అని నిర్ణయించుకున్న మైత్రేయి ప్రతిపాదనను ఆమె తండ్రి మిత్రయుడు సమ్మతించాడు. యాజ్ఞవల్క్యుని భార్య, కాత్యాయని కూడా విద్యావిషయంలో ఆమె జిజ్ఞాసకు ముచ్చటపడి తనభర్తతో మైత్రేయిని వివాహానికంగీకరించింది.
యాజ్ఞవల్క్యుని సేవిస్త ఆయన సాహచర్యంలో తనజ్ఞానాన్ని పెంపొందించుకొంటోంది మైత్రేయి. గృహసుథగా తాను నిర్వహించవలసిన పనులు పూర్తి చేసి మోక్షానికి అర్హతైన వానప్రస్తాశ్రమాన్ని స్వీకరించి తరువాత సన్యసించాలి నిశ్చయించుకున్నాడు యాజ్ఞవల్క్యుడు.
గృహస్థు సన్యసించాలంటే ముందుగా తనభార్య అనుమతి తీసుకోవలసి ఉంటుంది. మోక్షగామియైన యాజ్ఞవల్క్యుడు తనభార్యలిరువురితో ఈవిషయం చెప్పాడు. నా వద్ద నున్న సంపదనంతా మీరిరువురికి సమానంగా ఇస్తాను. నేను సన్యసించడానికి మీకేదైనా అభ్యంతరం ఉందా అని అడిగాడు.
అపుడు కాత్యాయని వౌనంతో అర్థాంగీకారం తెలిపింది. కాని రెండవ భార్య మైత్రేయి ప్రతి మనిషి సుఖాలను కోరుకుంటాడు అటువంటప్పుడు మీరు సన్యాసాన్ని కోరుకుంటున్నారు. అందులోనే సుఖశాంతులు లభిస్తాయా? అటువంటి సుఖశాంతులు నాకు కూడా కావాలి. ఆస్తిపాస్తులు నాకు గడ్డిపరక తో సమానం. ఇవేమన్నా మోక్షాన్ని ప్రసాదిస్తాయా? నాకు కావలసిన మోక్షమార్గాన్ని చూపే జ్ఞాన సంపద అని బదులిచ్చి యాజవల్క్యుని వెంట తాను ప్రయాణమైంది మైత్రేయి. తన వద్ద నున్న సంపద నంతా ఆశ్రమంలోని శిష్యుల పరం చేసి మైత్రేయి వెంట సన్యసించడానికి యాజ్ఞవల్క్యుడు బయలుదేరాడు.
సతీసమేతంగా వనాల్లో ప్రశాంత వాతావరణంలో వేదాంత చర్చలతో తన వద్దకు వచ్చే వారి సందేహాలను నివృత్తి చేస్తూ తన కర్తవ్యం నెరవేరిందని తృప్తిపడిన యాజ్ఞవల్క్యుడు సన్యాసం స్వీకరించి విముక్తి పొందాలన్న తన నిశ్చయాన్ని మైత్రేయికి తెలుపగా ఆమె సంతోషంగా అనుమతించింది. సన్యాసం స్వీకరించినట్టు యాజ్ఞవల్క్యుడు చీకటిని చీల్చుకుంటూ వెలుగువైపు ‘‘అసతోమా సద్గమయ
తమసోమా జ్యోతిర్గమయ అంటూ హిమాలయాలవైపు పయనం సాగించాడు. బ్రహ్మవిద్య ప్రతీకగా మైత్రేయి నిలిచింది. ఈ లోకంలో వన్నీ అశ్వాతమైన సుఖాలుగా కనబడుతాయి. కేవలం భగవంతుని నామస్మరణ, జ్ఞానసముపార్జనొక్కటే పరలోకానికి శాశ్వతసంపదగా నిలుస్తుంది.

==========
మంచిమాట శీర్షికకు ఆధ్యాత్మిక సంబంధమైన వ్యాసాలను సులభశైలిలో ఎవరైనా సొంతంగా రాసి పంపించవచ్చు. రచనలు పాఠకులకు ఆసక్తికరంగా వుండాలి. మూడు అరఠావులకు తగ్గకుండా వుండాలి. ప్రచురించిన రచనలకు పారితోషికం ఉంటుంది.

- రేవతి