మంచి మాట

చైతన్య కేంద్రాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంతకుముందు కాలంలో ఎందరో మహర్షులు, వేల సంవత్సరాలు తపస్సు చేసి దైవ సాక్షాత్కారం పొందేవారు. కాని నేటి కలియుగంలో నామస్మరణతోనే భగవంతుని సాక్షాత్కారం చేసుకోవచ్చు అంటారు. ఈ భగవంతుని చూచినవారు కూడా ఉన్నట్టు అనేక భక్తుల కథలు మనకు కనబడుతాయ. యోగశక్తితో అంతర్ముఖులైనవారు అంతర్యామి అయిన పరమాత్మను దర్శింపగలరు. పవిత్రమైన నామ జపాన్ని చేయటం, తోటి మానవులకు సాయం చేయడం, సత్యం పలకడం, మానవుల్లో పరమాత్మ అంశాన్ని చూడడం, మానవత్వంతో మసలడం ఇవన్నీ కనుక ఉంటే వారు తప్పక పరమాత్మను దర్శించుకోవచ్చు అని పెద్దలు అంటారు.
దైవ చింతన, నామస్మరణ, పురాణ శ్రవణాదులతో పుణ్యఫలాన్ని పొందే ప్రయత్నం చేయాలి. ఇట్లాంటి వాటి వల్ల మానవుల్లో సహజంగా ఉండే కామక్రోధాదులు దూరమవుతాయ. తామసబుద్ధిని అంతవౌతుంది. కనుక లభించిన ఉతృష్టజన్మమైన మానవజన్మను సార్థకం చేసుకోవడానికి వీలు కలుగుతుంది. దైవ చింతన చేయడానికి ప్రతిరోజు దేవాలయ సందర్శన చేస్తే మనసు భగవంతునివైపు కు మళ్లుతుంది. ఈదేవాలయ సందర్శన వల్ల అనిర్వచనీయమైన శాంతి, దానితోపాటు మనోనిబ్బరం కూడా కలుగుతాయి,
మానవ జీవితంలో ఏర్పడే చికాకులు, పరాకులు, చిత్త చాంచల్యాలు అన్నిటినీ కూడా కాస్తంతైనా నియంత్రణలోకి తెచ్చుకోవచ్చు.
దేవాలయాలు ఆధ్యాత్మిక కేంద్రాలు, ప్రశాంతతకు మారుపేరు. ఆపదలు చుట్టు ముట్టినపుడు కొందరు దేవుడిని ప్రార్థిస్తుంటారు. ఇలా చేసినా కూడా భగవంతునివైపుకు వారంతవారే మళ్లుతారని శిరిడీ సాయ బాబా అనేవారు. ఒక్కసారి భగవంతుని గూర్చి ఆలోచన మొదలైతే వారిలో సాత్విక బుద్ధిఅంకురిస్తుంది. ఆ సాత్వికమనస్సు తో సదాచారం అలవడుతుంది. సత్కర్మల వైపు మనసు తిరుగుతుంది. కనుక దేవాలయం సందర్శన, భజనలో పాల్గొనడం అనేవి చేయడం ఉత్తమమైన కార్యాలే.
ఆకాశం, గాలి, నీరు, చెట్టు, చేమా, వివిధ వర్ణాలతో, సువాసనలతో విరబూసే పూలు ఇలా సృష్టిలోని వింతలు విశేషాలను, వైవిధ్యాలు, రంగు, రూప భేదాలతో మనుషులను సృష్టించినదైవం పట్ల అనురక్తి పెరుగుతుంది. భగవంతుని దివ్యశక్తిని కొనియాడుతూ మానవుడు కూడా ఆ దివ్యశక్తికి ఆకర్షితుడై తాను కూడా దివ్యపథంలోకి అడుగుపెడుతాడు.కొన్నాళ్లకు దివ్యుడై చరిస్తాడు.
అందుకే ప్రతి ఒక్కరూ సర్వజీవులలోనూ సర్వత్రా ఆ భగవంతుని దర్శించగలగాలి. ఆయన నామాన్ని నిత్యం స్మరించాలి. అప్పుడే మన జీవితానికి అర్థం పరమార్థం చేకూరుతుంది.ఇవి అన్నీ నేర్పే దేవాలయాలను చైతన్య కేంద్రాలుగా, ఆధ్యాత్మిక కేంద్రాలుగా అభి వర్ణించారు.
మానవవికాస కేంద్రాలైన ఈ దేవాలయాల్లో చేసే అన్ని కార్యక్రమాలు అంటే ప్రసాద వితరణ కాని అన్నదానం లాంటి సేవా కార్యాలు కాని, పురాణ ప్రవచనాలు కాని ఏవైనా సరే మానవుణ్ణి దివ్యపథంలోకి అడుగులు వేయస్తాయ. పురాణ వ్యక్తుల గురించి చెప్పడం వల్ల మనం కూడా ఆవిధంగా ఉండాలనే బుద్ధి పుడుతుంది. భగవంతుని నామాన్ని అనేక సార్లు స్మరించడం వల్ల ఏకాగ్రత ధ్యానంచేసే స్థితి కలుగుతుంది. దాన కార్యాకలపాలవల్ల ఇవ్వడంలోని సంతృప్తి గమనించి ఉన్నదాంట్లో కొంతభాగమైనా దానం చేయాలన్న సద్బుద్ధి పుడుతుంది.
సామూహిక యజ్ఞాలు, యాగాలు, పూజలు, కుంకుమార్చనల్లాంటి వాటి వల్ల ఐక్యత విలువ తెలిసి కుటుంబ సభ్యులతోనే కాక ఇతరులతో కలసిమెలసి ఉండే భావం ఏర్పడుతుంది. ఇది దేశభక్తికి దారితీస్తుంది. దేశపటిష్టతకు పట్టుగొమ్మ అవుతుంది. పూజకు పనికివచ్చే పూల సేకరణ, ఆలయ శుభ్రత లాంటి వాటివల్ల కొందరికి జీవనోపాధి దొరుకు తుంది. కూర్చుని తినే పద్ధతిని విడనాడి కర్మలను ఆచరించడంపై మనసు లగ్నవౌతుంది. ఇన్ని సత్కర్మలను నేర్పే దేవాలయాలు మానవ వికాస కేంద్రాలుగా భావించి ప్రతివాడలో నిర్మించాలి. ఆ వాడలోని వారందరూ ఆ దేవాలయ సందర్శన చేసే పద్ధతిని ఆచరింపచేయాలి.

- చివుకుల రామమోహన్