మంచి మాట

స్కందపంచమి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పార్వతీ పరమేశ్వరుల ముద్దుల బిడ్డడు. కార్తికేయనామధారుడు, సంతానప్రదాతగా స్తుతించబడువాడు సుబ్రహ్మణ్యేశ్వరునిగా కోవెలల్లో కొలువైనవాడు, దేవతల ఆలోచనలతో గంగమ్మకు స్కందునిగా, అగ్నికి కుమారుడుగా, దేవతలకు ప్రీతిపాత్రుడుగా దేవసేనను పెళ్లాడినవాడు. రాక్షసులకు అతిభయంకరుడుగా శూరపద్మాసురుణ్ణి యమునికి అతిథిగా పంపినవాడు కృత్తికల చెంత ఆరుముఖాలతో పాలు గ్రోలినవాడు అయన సుబ్రహ్మణ్యేశ్వరుడు అఖిలలోకాలకు జ్ఞానప్రదాత శరవణంనుంచి పుట్టినవాడు కనుక శరవణభవునిగా కూడా కీర్తించబడేవాడు సుబ్రహ్మణ్యేశ్వరుడే.
పరమేశ్వరునికే ఒకసారి కుమారస్వామి జ్ఞానప్రదాతగా ఉన్నాడని పురాణాలు చెబుతున్నాయ. శాంత స్వభావం, ఇంద్రియ నిగ్రహం కలవాడు, సత్కులజుడు, వినమ్రుడు, పవిత్ర వేషము కలవాడు, సదాచార సంపన్నుడుగా తలంచి ఇంద్రుడు సంతోషపడి కుమారునికి తన కుమార్తె అయిన దేవసేనను ఇచ్చి పెండ్లి జరిపించాడు. శివముని కూడా తన కుమార్తె వల్లీనికూడా సుబ్రహ్మణ్యునికిచ్చి పెళ్లి చేశారు. దేవసైన్యాన్ని వెంటబెట్టుకుని వెళ్లి రాక్షస సంహారం చేసాడు సుబ్ర హ్మణ్యేశ్వారారధన అనాది కాలంనుంచి ఉంది దేవసేనాధి పత్యాన్ని ఇచ్చిన సందర్భాన్ని బట్టి ఆషాఢ పంచమి, షష్ఠినాడు కుమారషష్ఠి, స్కందపంచమి అనీ స్కందునకు విశేష పూజలు జరుపుతారు.
సుబ్రహ్మణుని ఆషాడ శ్రావణాల్లోను కార్తికం లోను మార్గశిరంలోను అసలు ప్రతిరోజు కూడా కొలుస్తారు. ఆషాడ శుద్దపంచమిని స్కంద పంచమిగా సంభావిస్తారు. సుబ్రహ్మణ్యునికి ఆషాడ షష్ఠినాడు స్కందషష్ఠి పేర వ్రతం చేస్తూ షోడశో పచారాలు ఆచరించినవారికి అనుకొన్న కోరికలు నెరవేరుతాయని పెద్దల వాక్కు. శ్రావణ కార్తీకాల్లో పుట్టల్లో పాలు పోసి సుబ్రహ్మణ్యుణ్ణి కొలిస్తే స్కందపంచమినాడు దేవాలయాల్లో పూజలు నిర్విర్తించి సుబ్రహ్మణ్యేశ్వరునికి వివాహ వేడుకలు చేస్తారు.
శక్తి ఉన్నవారు పంచెల చాపును, దక్షిణతాంబూలాలను లేనివారు కేవలం బ్రాహ్మణునికి నమస్కారాన్ని పెట్టి ఈ స్కందవ్రతాన్ని చేస్తుంటారు.
రామాయణంలో కుమారసంభవఘట్టంలో వాల్మీకి మహర్షికుమారుని జననం విన్నవారికి సకల సౌభాగ్యాలు ఒనగూరుతాయని అన్నందువల్ల స్కందపంచమినాడు కుమారోదయం పఠిస్తారు.ఆషాఢమాసంలోని పంచమినాడు, షష్ఠినాడు కుమారారాధన ఎంతో పుణ్యాన్నిస్తుందని పురాణాలూ చెబుతున్నాయి. కష్టాలు తీరి సుఖసంతోషాలు కలగటానికి కుమారజనాన్ని పఠించితే మంచిదని అంటారు.
శివకుమారుడు బ్రహ్మచారి అని చెప్పే పురాణకథలున్నందువల్ల వటువును సుబ్రహ్మణ్యేశ్వరునిగా భావించి అతనికి దక్షిణతాం బూలాలను ఇస్తారు. శివపార్వతుల కుమారుడే క్రౌంచపర్వతాన్ని భేదించాడని వామనపురాణం చెబుతుంది.
సుబ్రహ్మణ్యేశ్వరుని వాహనం నెమలి. నెమలి నర్తనం ఓంకారరూపం. సుబ్రహ్మణ్యేశ్వరుడు ప్రణవ స్వరూపుడు. ఇతని ధ్వజం కోడి పుంజు. ‘కో’ అనే ధ్వని ప్రణవ సూచకం కనుక ఇతనిని కొలిచిన వారికి ఆధ్యాత్మిక మార్గం కూడా సుగమమవుతుందని సుబ్రహ్మణ్య భక్తుల నమ్మకం.తమిళనాట, తెలుగునాడులోను ప్రసిద్ధి చెందిన సుబ్రహ్మణ్యేశ్వ రుని ఆలయాలెన్నో ఉన్నాయ. సత్సంతానాన్ని, సద్భుద్ధిని, సకల విద్య లను ప్రసాదిస్తాడు. సర్పదోషాలు కూడా మటుమా యం అవుతాయ.

- హనుమాయమ్మ