మంచి మాట

పవిత్రం ఫాల్గునం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫల్గునీ నక్షత్రంలో కలిసి పౌర్ణమినాడు చంద్రుడు ఉదయంచే మాసం ఫాల్గునం. ఫల్గునీ నక్షత్రం ‘పూర్వఫల్గుని’ - ‘పుబ్బ’; ‘ఉత్తరఫల్గుని’- ఉత్తర అని రెండు నక్షత్రాలు ఈ రెండింటిలో దేనితో కలిసి చంద్రుడు ఉదయించినా అది ఫాల్గున మాసమే అవుతుంది.
ఫాల్గున మాసం చాంద్రమాన కాలగణన ప్రకారం సంవత్సరంలో చివరిది. కడపటి ఋతువైన శిశిరంలో రెండవది. శిశిరంలో మొదటిదైన మాఘంలో ఆకులు రాల్చిన చెట్లు ఫాల్గునం ద్వితీయార్థంలో చిగురిస్తాయి. నవపల్లవాలతో ప్రకృతి పరిమళభరితమైన శోభిస్తుంది. ఇది రానున్న వసంత ఋతువుకు ద్వారం వంటిది. అందుకే ఫాల్గునమాసాన్ని ‘నవపల్లవ’ మాసం అని కూడా అంటారు.
సంవత్సరంలోని మిగతా మాసాలలోవలె ఫాల్గున మాసంలో ‘హోలాక పౌర్ణమి’ లేదా ‘హోళీ పండుగ’ తప్ప వేరేమీ పండుగలు లేవు. ‘హోళీ పండుగ’ను భారతదేశమంతటా ‘ఆనందహేల’గా ప్రజలంతా జరుపుకుంటారు. ఈ మాసంలో మొదటి 12 రోజులు ‘‘పయోప్రతం’’ పేరులో శ్రీకృష్ణుని ఆరాధించి, క్షీరాన్నాన్ని నివేదించి భాగవత పురాణం పఠిస్తారు. ఈ మాసానికి అధిపతి గోవిందుడు. కనుక అనుగ్రహం శీఘ్రంగా లభిస్తుంది. శుద్ధ విదియ శ్రీరామకృష్ణ పరమహంస జన్మదినం. హైందవ జాతిని సాంస్కృతిక చైతన్య కిరణాలతో మేల్కొల్పిన బ్రహ్మర్షి. ఫాల్గున బహుళ విదియనాడు శ్రీలక్ష్మీ జయంతి. క్షీరసాగర మధన సమయంలో పాలకడలి నుండి ఉద్భవించినట్లు పురాణాలలో చెప్పబడింది. ఈనాడు ‘కనకధారాస్తవము’ పారాయణం చేయడం సత్ఫలితాలనిస్తుందని శాస్తవ్రచనం. ఇదే రోజున హరిహరసుతుడు అయ్యప్పస్వామి జయంతి కూడా. శబరిమలైలో విశేష పూజలు నిర్వహిస్తారు. పయోవ్రతాన్ని నిర్వహించిన కశ్యపుని పత్ని అదితీదేవి శ్రీ మహావిష్ణువును తన పుత్రుడుగా - వామనునిగా జన్మనిచ్చింది.
ఇలా కొన్ని ముఖ్యమైన పర్వదినాలు ఈ మాసంలో చోటుచేసుకున్నా, భారతీయ ఇతిహాసాలైన శ్రీరామాయణ, మహాభారతాలతో ఫాల్గున మాసానికిగల ప్రాముఖ్యం అపారమైనది.
రామాయణంలో అత్యంత ముఖ్యమైన సంఘటన రామరావణ సంగ్రామం. ఇది దేవాసుర సంగ్రామంతో పోల్చదగినది. రామ రావణ యుద్ధం ఫాల్గున బహుళ పాడ్యమినాడు మొదలైంది. రావణాసురుని సైన్యంలో ప్రముఖులైన సేవాపతులు ధూమ్రాక్షుడు విదియనాడు, వజ్రదంష్ఠ్రుడు తదియనాడు, అరంపనుడు చవితినాడు హతులయ్యారు.
రావణాసురుని సర్వసైన్యాధ్యక్షుడు ప్రహస్తుడు శ్రీరాముని వానర సేనాధ్యక్షుడైన నీతిని చేతిలో బహుళ పంచమినాడు పరలోక ప్రాప్తుడయ్యాడు. బహుళ అష్టమినాడు రావణ కుమారుడు అతికాయుడు లక్ష్మణుని చేతిలో మట్టికరిచాడు. రామ రావణ యుద్ధంలో ఒక ప్రధానమైన సంఘటన ఇంద్రజిత్తుని వధ, లక్ష్మణ ఇంద్రజిత్తుల మధ్య మహుళ ఏకాదశి నుండి త్రయోదశ వరకు జరిగిన యుద్ధంలో ఇంద్రజిత్తు అసువులు అంతరిక్షంలో కలిసాయి. అంతకు ముందు కుంభకర్ణుడు కూడా మరణించాడు. రామాయణంలో ప్రధాన ఘట్టమైన రామ - రావణ యుద్ధం బహుళ అమావాస్యనాడు ప్రారంభమై అదేరోజు ముగిసింది. నరకాసుర వధ వలె రావణాసురుని వధతో అన్ని లోకాలలో ఆనందం తాండవించింది. భారతీయులందరికీ మహాపర్వదినంగా భాసిల్లిందనడంలో అతిశయోక్తి లేదు.
ఇక మహాభారతాన్ని పరిశీలిస్తే కొన్ని మహత్వపూర్ణమైన సంఘటనలు దుర్వాస మహాముని నుండి వరం పొందిన కుంతీదేవి ఆ వర ప్రసాదంగా యమధర్మరాజు అంశతో ధర్మరాజు జన్మించాడు. ఆరోజు వికృతి నామసంవత్సరం ఫాల్గున బహుళ అష్టమి తిథి.
ఖరనామ సంవత్సర ఫాల్గున శుద్ధ త్రయోదశి నాడు మఖ నక్షత్రంలో భీముని జననం. అదేరోజు గాంధారికి దుర్యోధనుడు జన్మించాడు. గాంధరి గర్భం ఛిద్రం కాగా, వ్యాసుడు నూట ఒక్క ముక్కలను వేర్వేరు నేటి కుండలలో భద్రపరిచాడు. ఒక్కొక్కరోజు ఒక్కొక్కరు చొప్పున ఆ భాండాల నుండి ఉద్భవించారు. చివరగా ఒక కుమార్తె జన్మించింది. ఇలా శుద్ధ త్రయోదశి నుంచి బహుళ అమావాస్యవరకు దుశ్శాసనాది కౌరవులు ఫాల్గున మాసంలోనే జన్మించారన్న విషయం తేటతెల్లమవుతుంది. పాండురాజు ఫాల్గున మాసంలోనే మరణించాడని భారతంలో ఉంది. ఆ రోజు పదహారు సంవత్సరాల వయసున్న ధర్మరాజుకు తమ్ముడైన అర్జునుని జన్మదినం. అంటే అర్జునుని పుట్టుక ఫాల్గున మాసంలోనే.పాండవులను తుదముట్టించడానికి దుష్టచతుష్టయం పన్నిన పన్నాగం లాక్షాగృహ దహనం. ఫాల్గున శుద్ధ అష్టమినాడు చేయబూనిన పనిని వేగుల ద్వారా తెలుసుకున్న విదురుడు - పాండవులను ముందుగానే హెచ్చరించి వారిని ప్రమాదంనుంచి రక్షించాడు.

- ఏ.సీతారామారావు