మంచి మాట

కర్మబంధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనిషి పుట్టుకనుండి మరణం వరకు జరిగే జీవన ప్రయాణంలో కర్మ చేయకుండా ఒక్క క్షణమైనా ఉండలేడు. జీవికి జన్మ పరంపరలు ఎలా తప్పవో అట్లానే కర్మ పరంపరలు కూడా వస్తూనే ఉంటాయ. కర్మ చేయమని భగవద్గీత చెబుతుంది. కాని ఆ కర్మఫలాలను ఆశించి చేయకపోతే అవి అతనికి అంటవని దానివల్ల అతడు మోక్షగామి కావచ్చు నని కూడా భగవద్గీతనే చెబుతుంది.
కాని మనిషికి ఆశ వుంటేనే జీవితం సజావుగా సాగుతుంది. చివరకు మోక్షకోర్కెతోనే మనిషి తపస్సు ఆరంభిస్తాడు. కోరిక లేని వ్యక్తి ఉండడం చాలా అరుదు.. జీవికి జన్మ లేకుండా మోక్షము అనేది కడు దుర్లభం. జన్మ పరంపరల్లో మానవ జన్మ దొరకడం గొప్ప అదృష్టం. జన్మరాహిత్య సాధనకై దొరికిన సువర్ణ అవకాశం. కాని మానవ జీవితాన్ని సార్థకం చేసుకోవడమూ కూడా ముఖ్యమే. అన్ని మంచివిషయాలు తెలుసుకొన్నా కూడా మానవులో ఉన్న త్రిగుణాల ప్రభావం వల్ల మనిషి అనుకొన్న వాటిని సాధించలేకపోతాడు. త్రిగుణాల వల్ల మోహితులైనవారు అరిషడ్వార్గాలకు బానిసలు అవుతారు. అహంకార, మమకారాలచే జనించిన రాగ ద్వేషాలతో ప్రవర్తించడం ఆరంభిస్తారు.
దానివల్లనే మనిషిలో పాపపుణ్యాల సంచయం మొదలవుతుంది. అనాలోచితంగా ఏదైనా మనసు చంచలించినా సరే యుక్తయుక్తా విశేషంతో ఆలోచించి అది ధర్మయుక్తమైనదా లేదా అని తెలుసు కొని దానిని సాధించే నేర్పు ఉంటే కోరికను తీర్చుకోవడం కూడా ధర్మబద్ధమే అవుతుంది. కాని ఉచ్ఛనీచాలు తెలుసుకోకుండా కోరిక వలలో చిక్కుకోవడం అనేది పూర్తిగా అసుర లక్షణము. ఈ లక్షణం మనిషిలో మొలకెత్తకుండా చూసుకోవాలి కాని ఒకసారి మొలకెత్తితే అది ఎంత తుంచినా పోదు. తిరిగి పిలకలు వేస్తూనే ఉంటుంది.
ఋణానుబంధం రూపేణ పశుపత్ని సుత లయని అనేది సత్యమే కదా. కాని మానవుడు భవబంధాలలో చిక్కుకుని భార్యా బిడ్డలు అనుకోగానే వారికి తాము సంపాదించి పెట్టాలని అనుకొంటూ ప్రయత్నాలు చేస్తారు. ఇలా చేయడంలో మోహబంధంలో ఇరుక్కుని వారి ప్రయత్న ఫలితంగానే సిరి సంపదలు వచ్చాయని అనుకొంటారు. దానివల్ల వారిలో అహంకారాది గుణాలు పెరుగుతాయ. కాని అది పూర్వజన్మ పుణ్యమనో లేక భగవంతుని దయ వలన వచ్చినవనో చాలామంది అనుకోరు. కాని కష్టాలొస్తే మాత్రం భగవంతుడు కల్పించాడని, తమకే ఎందుకు వస్తున్నాయనో వాపోతారు.
ఈ విధంగా జరగకూడదంటే కేవలం పుణ్యమే చేస్తే మంచి జన్మ కష్టపడకుండానే కడుపు నిండే జన్మ వస్తుంది. కాని అపుడు కూడా అహంకారం పెరిగితే తరువాతి జన్మ అధోగతి అవుతుంది.
అందుకని ఎవరు చేయవలసిన పని వారు తప్పనిసరిగా చేయాలి. అది కూడా త్రికరణశుద్ధిగా, ఏది ఆశించకుండా కష్టపడటం, సంపాదించు అనుభవించు.అనేవి సాగించాలి. దేనినైనా ధర్మయుక్తంగా చేసినపుడు ఆ కర్మల ఫలితాలు అంతగా బాధించవు. ఈశ్వరార్పణ బుద్ధితో పనిచేస్తే సర్వం ఈశ్వరమయంగా భాసిస్తుంది. సర్వకర్మలకు ఈశ్వరుడే కర్తకర్మక్రియగా భావిస్తే సుఖదుఃఖాలు బాధించవు. మానవ జన్మ కూడా సార్థకం చెందుతుంది. ఏ పనిని చేసినా దానిపైన దృష్టి, పని భగవంతునికోసం, రణమైనా, రుణమైనా, మంచి యైనా చెడు అయనా కూడా భగవంతుడిచ్చిన ప్రసాదాలుగా స్వీకరించగల భావన పెంపొందించుకోవాలి. అపుడు మనిషి మనిషిగా ఎదుగగలడు.
‘యతో అభ్యుదాయ, నిశ్రేయ ససిద్ధిః సధర్మః’- ఏది అభ్యుదయాన్ని, మోక్షాన్ని సిద్ధింపచేయగలదో అదే ధర్మం. తిండి, నిద్ర, భయం, మైథునం మనుషులకు, పశువులకు సమానమే కాని వ్యత్యాసం ధర్మవర్తనమే! ధర్మం లేనివాడు పశువుతో సమానమే! ధర్మం చేతనే అర్థకామాలు సంపాదించాలని భారతం చెబుతోంది. కనుక మని షి అంత్యత జాగురూకుడై ఏ పని చేసినా అది ధర్మయుతంగా చేయాలి అనడంలో అంతరార్థం అదే. బంధువర్గం, మిత్రబృందం, పదవి - అధికారం ఇవన్నీ ఏదో ఒకనాడు వదిలిపోయేవే. కాని ధర్మం మాత్రం జన్మజన్మలకూ వస్తుంది. మనిషికి అసలైన తోడు నీడ ధర్మం మాత్రమే.
మానవత్వం, సమానత్వం, సహనతత్వం లాంటివన్నీ ధర్మానికి మూలాధారాలు. జీవితాన్ని జీవింపజేసే కళే ధర్మం. ఆత్మ, పరమాత్మలను కట్టివేసేది, అనుసంధానం చేసేదే ధర్మమే. ఈ ధర్మానికి మనిషి జన్మ మహత్తరమైన నిధిని స్తుంది కనుక ధర్మాన్ని పట్టుకొంటే చాలు ఆ ధర్మమే అన్నివేళలా మనిషిని రక్షిస్తుంది.

- హనుమాయమ్మ