మంచి మాట

ధన త్రయోదశి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అశ్వీయుజ మాసంలోని కృష్ణపక్ష త్రయోదశికి ‘్ధన త్రయోదశి’ అని పేరు. అపమృత్యు భయాన్ని పోగొట్టి ఆయురారోగ్యాలను, అష్టైశ్వర్యాలను, సకల సంపదలను ప్రసాదించే దివ్యమైన పండుగ రోజు ధనత్రయోదశి. ఇది సంపదల తల్లి అయిన శ్రీలక్ష్మీదేవికి ప్రియమైన రోజు. వైకుంఠం నుంచి లక్ష్మీదేవి భూలోకానికి వచ్చిన రోజు.
గంగానదీతీరంలో నారదుని సమక్షంలో తమ యజ్ఞ హవిర్భాగాన్ని ఎవరికి సమర్పించాలో అనే విషయమై మహర్షులు రకరకాల ఆలోచనలు చేసి చివరకు త్రిమూర్తుల్లో ఎవరికి సమర్పించాలనే నిర్ణయించే బాధ్యతను భృగుమహర్షికి అప్పగించారు. భృగువు బ్రహ్మదేవుడిని, శివుడిని పరీక్షించి వారికి అర్హత లేదని భావించి వైకుంఠం చేరుకున్నాడు. వైకుంఠంలో శ్రీమహావిష్ణువు శేషతల్పంపై శయనించి వుండగా పాదాలవద్ద లక్ష్మీదేవి ఆశీనురాలై వుంది. భృగువు రాకను విష్ణువు గమనించలేదు. దాంతో కోపోద్రిక్తుడైన మహర్షి శ్రీ మహావిష్ణువు వక్షస్థలంపై కాలితో తన్నాడు. దీనితో ఇహంలోకి వచ్చిన విష్ణువు భృగువును ఆసనంపై కూర్చునబెట్టి- ‘నా వక్ష స్థలం సోకి మీ సుతిమెత్తని పాదం ఎంతగా కమిలిందో కదా..’ అని పాదాలు వత్తుతూ సేవ చేయసాగాడు. పాదాలు వత్తుతూ భృగువు అరికాలిలో వున్న కన్నును చిదిమివేశాడు. దీనితో భృగువు తన తప్పును తెలుసుకుని విష్ణువును ప్రార్ధించాడు. కాని, తన స్థానమైన వక్షస్థలంపైన తన్నినా భృగువుకు సేవ చేయడాన్ని సహించలేని శ్రీ లక్ష్మీదేవి వైకుంఠం వదిలి భూలోకానికి వెళ్లి కరవీరపురం అంటే ‘కొల్హాపూర్‌‘కు చేరింది ఈరోజేనని కథనం. ఈ విధంగా భూలోకం చేరిన లక్ష్మీదేవిని ముందుగా కుబేరుడు పూజించి, నవ నిధులను పొందినట్టు కథనం. అటువంటి పుణ్యదినం అయిన ధనత్రయోదశినాడు లక్ష్మీదేవిని శక్తిమేరకు పూజించి నివేదన సమర్పించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభించి అష్టైశ్వర్యాలు సకల సంపదలు సిద్ధిస్తాయి. లక్ష్మీదేవి వద్ద బంగారు నగలు వుంచి కూడా పూజించడం మంచిది.
నరక చతుర్దశికి ముందురోజు వచ్చే ధనత్రయోదశి నరక లోకాధిపతి అయిన యముడికి ప్రీతికరమైన రోజు. యముడిని స్మరించడంతోపాటు సాయంత్రం యముడి ప్రీత్యర్ధం దీపాలను వెలిగించాలని శాస్త్ర వచనం. ఈ సాయంత్రం నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించి ఇంటి వెలుపల వుంచి పూజించాలి. ఈ దీపానికి ‘యమదీపం’ అని పేరు. యమదీపం వెలిగించడంవల్ల అపమృత్యు భయం తొలగిపోయి ఆయురారోగ్యాలు వృద్ధి చెందుతాయని శాస్త్ర వచనం. అందుకు సంబంధించిన ఒక గాథ కూడా ఉంది.
పూర్వం హేమరాజు అనే ఒక పాలకుడు వుండేవాడు. ఆయనకు వివాహమైన చాలాకాలానికి ఒక కుమారుడు జన్మించాడు. ఆ పిల్లవాడి జాతజాతకం ప్రకారం 16 ఏళ్ల వయసులో వివాహమైన నాలుగవరోజు మృతి చెందుతాడని పండితులు చెప్పారు. 16 సంవత్సరాల ప్రాయంవాడైన కుమారుడిని చూసి రాజు దిగులు చెందేవాడు. ఈ విషయం తెలిసీ ఒక రాకుమార్తె రాకుమారుడిని వివాహం చేసుకుంది. వివాహం తరువాత నాల్గవ రోజు రానే వచ్చింది. ఆరోజు ధన త్రయోదశి. రాకుమార్తె దీపాలను వెలిగించి ఇంటి ముందు వుంచి పూజలు నిర్వహించింది. లక్ష్మీదేవిని పూజించింది. తన నగలన్నింటినీ అమ్మవారి వద్ద వుంచి దీపాలను వెలిగించి పూజలు చేసి, అనంతరం అమ్మవారిని కీర్తిస్తూ పాటలు పాడుతూ గడపసాగింది. రాకుమారుడిని ప్రాణాలను తీసుకువెళ్లేందుకు యముడు సర్పరూపంలో వచ్చాడు. అయితే దీపాల వెలుగులను, బంగారు ధగధగ మెరుపులను చూస్తూ వుండిపోయాడు. రాకుమారుడి మృత్యు సమయం కాస్తా దాటిపోయింది. దీనితో యమధర్మరాజు ఏమీ చేయలేక వెళ్లిపోయాడు. కనుక ధన త్రయోదశి రోజు దీపాలను వెలిగించడంవల్ల అపమృత్యు భయం తొలగిపోయి ఆయురారోగ్యాలు లభిస్తాయని కథనం.
వ్రత చూడామణి, వామన పురాణంలోని గాథ ప్రకారం బలి చక్రవర్తిని పాతాళానికి పంపించే సమయంలో వామనుడు అశ్వీయుజ కృష్ణ త్రయోదశి, చతుర్దశి, అమావాస్య రోజులలో దీపాలను వెలిగించే వారి ఇంట లక్ష్మీదేవి శాశ్వతంగా వుండేట్టు వరం ప్రసాదించినట్టు కథనం. ధన్రతయోదశినాడు లక్ష్మీదేవిని పూజించి, దీపాలను వెలిగించడం వల్ల అపమృత్యుభయం ఉండదు. అష్టైశ్వర్యాలు సకలసంపదలు లభిస్తాయ.

- ఐ.ఎల్.ఎన్.చంద్రశేఖరరావు 9491946070