మంచి మాట

నరక చతుర్దశి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పరమార్థంతో నిండి ఉండే పండుగల్లో దీపావళి ప్రత్యేకమైంది. అజ్ఞానపు చీకటులు తొలగి విజ్ఞానపు వెలుగులు సర్వత్రా వ్యాపించడమనే అంతరార్థం చెప్పేది దీపావళి. వెలుగునే భారతీయులు పరంజ్యోతి అన్నారు. అవిద్య, అజ్ఞానం, అవివేకం లాంటి చీకట్లు ఎపుడు తొలుగు తాయో అపుడు దివ్యవెలుగులు ప్రసాదిస్తాయ. ఆ దివ్య వెలుగులు ప్రసరించేవేళనే దీపావళి అని యావత్తు ప్రపంచం వెలుగును ఆహ్వానిస్తూ దీపావళి పండుగను జరుపుకుంటారు.
తులామహాత్య్మం ‘‘ తైలేగంగా జలే లక్ష్మీ’’ అంటూ దీపావళి నాటి ప్రత్యూష వేళ చేసే తైలాభ్యంగన స్నానం గంగాస్నానఫలాన్ని ఇస్తుందని లక్ష్మీ గంగలు ఆశీర్వదిస్తారని చెప్తోంది. దీపావళి అభ్యంగన స్నానానికి జువ్వి, నేరేడు, అత్తి, మర్రి, మామిడి ఆకులను నానబెట్టిన నీటిని వాడడం సాంప్రదాయమనీ చెప్తారు.
ఈ చతుర్దశి స్వాతి నక్షత్రంతో కూడి వున్నపుడు అభ్యంగన స్నానం చేస్తే నరక భయం పోతుంది. యమధర్మరాజునుద్దేశించి తర్పణం వదలుతారు. అప్పుడు తమ ధర్మరాజు స్మరిస్తూ-
‘‘యమాయ ధర్మరాజాయ మృత్యువే చాంతకాయచ
వైవస్వతా కాలాయ సర్వభూతక్ష యాయచ
జేదుంబ రాయ దధ్నాయ నీలాయ పరమేష్ఠినే
వృకోదరాయ చిత్రాయ చిత్రగుప్తాయ వైనమః
యమతర్పణం వదలడం అనేది శాస్త్ర వచనం.
ఒకానొకకాలంలో బ్రహ్మ వరప్రసాద గర్వితుడైన ఇతడు ప్రాగ్జ్యోతిష పురమనే రాజ్యాన్ని పాలించేవాడు. రాజై ఉండి కూడా దేవతల తల్లి అదితి కర్ణకుండాలను, వరుణుడి ఛత్రాన్ని అపహరించాడు. మణిపర్వతమనబడే మేరు పర్వతాన్ని వశపరచుకున్నాడు. సదా మునులను హింసిస్తూ ఉండేవాడు. దేవతలమీదికి పదే పదే దండెత్తేవాడు. ఇక సాధువులను, బ్రాహ్మణులను అదేపనిగా బాధించేవాడు.
నరకుడు పెట్టే ఈ హింసలు భరించలేక మునులు, దేవతలు అందరూ కలిసి శ్రీకృష్ణుని వద్దకొచ్చి మొరపెట్టుకున్నారు. గోబ్రాహ్మణులను పనికట్టుకు బాధించేవాడు. పదహారువేల మంది స్ర్తిలను చెరబట్టినాడు. దైవ దూషణ మితిమీరి చేసేవాడు నరకుడు అంటూ వీని దుష్టచేష్టలను భరించలేక భూదేవి మహావిష్ణువు దగ్గరకు వెళ్లి మొరపెట్టుకుంది. శ్రీకృష్ణుడే నరకాసుర సంహారం చేయగలడని ఆయన అభయం ఇచ్చాడు. నరకాసుర సంహారం లక్ష్యంగా శ్రీకృష్ణ భగవానుడు గరుడ వాహనారూఢుడయ్యాడు. సత్యభామ కూడా ఆయన వెంట బయలుదేరింది. శ్రీకృష్ణుడు నరకునిపై యుద్ధ్భేరిని మ్రోగించాడు. నరకుడు కట్టుకొన్న అజ్ఞాన మేడలన్నీ సత్యాకృష్ణుల సమరనాదంతో కుప్పకూలిపోయాయ. వీరాధివీరుడని విర్రవీగే నరుకుని వీరత్వం బీటలు వారింది. వాని సైన్యం అంతా నాశనం అయంది. కదనభూమిలో కాలిడి సత్యాకృష్ణులు చేసే యుద్ధదాటికి తట్టుకోలేక నరకుడు సత్యాశ్రీకృష్ణుల చేతిలో అసువులు బాసాడు. ఆ విషయం సర్వులకు తెలిసింది. నరకుని పీడ వదిలిందని దేవతలు, మానవులు, సిద్ధులు, సాధుసత్పురుషులు, అందరూ సంతోషించారు. నరకుని చెరలో ఉన్న వనితలకు కృష్ణుడు బంధవిముక్తి కలిగింది. ఆరోజే ఆశ్వీజమాస కృష్ణపక్ష చతుర్దశి. అదే నరక చతుర్దశి. మరుసటి రోజు కూడా నరకుని పీడ వదిలిన సందర్భంగా దివ్యదీపావళి పండుగను ప్రతి సంవత్సరం జరుపుకోవడం ఆనవాయితీగా మారింది. ఆ నరకుని పీడ వదిలిన సందర్భంగా చతుర్ధశి తెల్లవారు జామున ‘చతుర్వత్తుల’ దీపం వెల్గించి యమధర్మరాజునుద్దేశించి తర్పణం వదలుతారు. ఈ పండుగను దక్షిణ భారతదేశంలో నరక చతుర్దశి, దీపావళి, బలిపాడ్యమి అని మూడు రోజులు జరుపుకొంటారు. ఉత్తర భారతంలో ధనత్రయోదశి, నరక చతుర్దశి, దీపావళి, బలిపాడ్యమి, యమ ద్వితీయ అని ఐదు రోజులు జరుపుకొంటారు. ఈ ఐదురోజులు దీపావళిపండుగను పురస్కరించుకుని ఇంటాబయట అంతా అందరూ దీపాలను వెలిగిస్తారు. లోకంలోని కారు చీకట్లను పారద్రోలి కాంతిరేఖలతో నింపాలనే సందేశాన్ని ఇస్తూ ఈ పండుగను కుల, మత భేదాలు లేకుండా చిన్నాపెద్దా వ్యత్యాసం లేకుండా ఆబాలగోపాలం దీపావళి పండుగను అత్యు త్సాహంతో జరుపు కుంటారు.

కె. యాదయ్య