మంచి మాట

ఫలితాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒక్కోసారి మనం చేయాలనుకొన్న పనులు ఏవీ ప్రయత్న లోపాలవల్లనో, పరిస్థితుల ప్రాబల్యంవల్లనో అనుకున్నవి అనుకున్నట్టుగా జరగవు. ఆశించినవన్నీ అనుకూలంగా ఫలితాలనిచ్చేట్టుగా పని చేసినట్టు అనిపించినా ఆఖరి నిముషంలో అనుకొన్న ఫలితాలు రావు. ఇది ఒక్కోసారి మనుసును మూగబోయేట్టు చేస్తుంది. కానిఇలాంటి పరాజయాలు మరింత పదునెక్కేట్టు చేస్తాయ. వాటి వల్ల మనిషిలోని అసలైన శక్తి బహిర్గతం కావాడానికి వీలు కలుగుతుంది. అననుకూల పరిస్థితులు అనుకూలంగా ఎలా మార్చుకోవచ్చో అతి సులభంగా పరిసిథతులే నేర్పుతాయ. అంథుకే పెద్దలు కాలమే అన్నింటిని పరిష్కరిస్తుంది అంటారు. ఒక్కోసారి మనం చేయాల్సిందంతా సరిగానే చేసినా మన ఎదుటివారు చేసిన తప్పులు ఒక్కోసారి మనలను విజయపథానికి చేరుకోనివ్వవు. దీనికి కారణం బహుశా వారు కావాలని చేయకపోయనా వారి దృక్పథం మన దృక్పథంలో తేడాలుండవచ్చు.
ఉదాహరణకు ఇల్లు కట్టుకోవాలంటే తగినంత డబ్బు ఉన్నప్పటికీ కానీ, నిర్మాణం చేయాలంటే పలు రంగాలకు చెందిన నిపుణులతోనూ, శ్రామిక వర్గం వారితోనూ అవసరం ఉంటుంది. వారికి మనకున్న ఆలోచన ఉండకపోవచ్చు. ఒకవేళ ఉన్నా కూడా మనకున్న తొందర వారికి లేకపోవచ్చు. దానివల్ల కూడా మనం అనుకొన్న సకాలంలో గృహ నిర్మాణం పూర్తి చేయలేకపోతాం.
ఇట్లాంటి విఘ్నాలు రాకుండాను, మనం చేసే పనుల్లో విఘ్నాలు కలుగకుండా ఉండడానికి భగవంతుని ప్రార్థిస్తుంటాం. అయతే భగవంతుడిని ప్రార్థించాం కదా పూజలు వ్రతాలు కూడా చేసేశాం కాని అనుకొన్న ఫలితం రాలేదు అని అనిపించే పరిస్థితులు కూడా ఉంటుంటాయ. ఇక్కడ భగవంతుని తత్వాన్ని అర్థంచేసుకొని దానికనుగుణంగా సాగాలి కాని దానికి వ్యతిరేకంగా సాగినంతకాలమూ మనం అనుకొన్నదాన్ని సాధించడంలో వెనుకబడే ఉంటాం.
గీతాచార్యుడైన భగవానుడు ‘నీ విధి విధానాలను నీవు త్రికరణ శుద్ధిగా ఆచరిస్తే సర్వాంతర్యామినైన నేనే నీ యోగక్షేమాలు చూస్తానని’ ప్రబోధించాడు. కనుక మనం చేయాల్సిన కర్తవ్యాన్ని చేయాలి. ఫలితాన్ని భగవంతునికే వదిలివేయాలి. ఇలా వదిలివేయాలంటే స్వార్థాన్ని వీడాలి. అపుడు దేవుడు ఏంచేసినా అది మంచిఫలితాన్ని స్తుంది అని అనుకోలేం. స్వార్థంతోచేసే పనులు అప్పటికప్పుడు మంచి జరిగినట్టు అనిపించినా చివరకు తప్పు దారిలో పడేస్తాయ. నలుగురిలో అవమానంపాలు చేస్తాయ. కనుక నిదానంగా ఎదిగినా ఫర్వాలేదు అనుకొని మంచి పనులను మాత్రమే మనం చేయడానికి ఆసక్తి చూపాలి. అపుడు మాత్రమే విఘ్నాలు కలుగకుండా దైవం తోడుగా నిలుస్తుంది.
అజ్ఞాతవాస కాలంలో ధర్మరాజాదులు విరాటుని కొలువులో ఊడిగం చేయాల్సి వచ్చింది. ఎన్ని కష్టాలెదురైనా, కవ్వింపులెదురైనా సంయమనాన్ని కోల్పోలేదు. యుక్తిగా బైటపడ్డారు. అజేయులయ్యారు.
రాముడు లేక లేక పుట్టినా అల్లారుముద్దుగా పెరిగినా వనవాసం చేయాల్సి వచ్చింది. ఆ వనవాసంలో ఎన్నోకష్టాలు పడ్డాడు. రాజుగా పెరిగి సామాన్య మానవునిగా అనేక అవస్థల పాలు అయ్యాడు. కాని చివరకు ధర్మాన్ని ఆచరిస్తూ సత్యాన్ని వీడకుండా విజయాన్ని సాధించాడు. ఇలా ఎన్నో జీవితాలు మనకు ఆదర్శంగా ఉంటాయ. ఎన్ని కష్టాలు పడినా అనుకొన్నవి సాధించలేకపోయనా కూడా సత్యధర్మాలను మాత్రం వదలకుండా ఉండాలి. అపుడే విజయం కలుగు తుంది. సమస్యలు, ప్రతిబంధకాలు ఎదురైనపుడు సహజంగానే నిరాశా నిస్పృహలతో కునారిల్లడం, చేష్టలుడిగి మిన్నకుండిపోవడం జరుగుతుంది. కాని వాటినే తలుచుకుంటూ నాకే ఇలా అయపోయందని వాపోకుండా అప్పటి పరిస్థితులకు అనుగుణంగా మారిపోవాలి. బుద్ధిచాతుర్యాన్ని చూపాలి. ప్రతి కూల పరిస్థితులను, ప్రతికూలురైన మనుష్యులను సానుకూలంగా మార్చుకోవాలి. అపుడే మనిషిలోని నైపుణ్యం బయటకు వస్తుంది. ఇది రావాలంటే ముందుగా మనిషిలో మంచితనం, మానవత్వం ఉండితీరాలి. పరుల పైన సానుభూతి దృష్టి ఉండాలి. అపుడే ఎవరికైనా సాయం చేయాలన్న దృక్పథం ఏర్పడుతుంది. దానివల్ల సత్యధర్మాలు పాటించేవీలు కలుగుతుంది. ఇక అపుడు విజయాల పరంపరను చూడవచ్చు.

- హనుమాయమ్మ