మంచి మాట

కాలగణన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాలాన్ని భగవంతుని స్వరూపంగా భావిస్తాం. తరిగే కాలాన్ని, పెరిగే మనిషి ఆయుష్షును ఎవరూ ఆపలేరు. మన జననం మనకు తెలియదు.. మన మరణ నెపం కూడా తెలియదు. అదే దేవరహస్యం. కాని కాలంలో మంచికాలము , శుభకాలము అశుభకాలమని ఏదీ ఉండదు. కాని మనం తిథివారనక్షత్రాలంటూ విభాగించుకుంటూ అందులో శుభాశుభాలను లెక్కకడతాము. అష్టమి అమ్మో కష్టకాలమని భయపడు తుంటారు కొంతమంది. కాని దుర్గమాలను దూరంచేసే దుర్గాదేవి ని పూజించేది అష్టమినాడే. ఎందరో రాక్షసులను చంపి అధర్మాన్ని నాశనం చేసి ధర్మాన్ని స్థాపించినవాడు శ్రీకృషుడు. ఆయనకు కూడా అష్టమి నాడే పుట్టినరోజులు జరుపుతుంటారు.
అట్లానే శ్రీరామనవమి నవమి కష్టాలను కొని తెస్తుంది అంటారు. కాని, శ్రీరాముడు నవమి నాడే పుట్టాడు. త్రేతాయుగంలో నాటివాడు రాముడు నేడు కూడా పూజలందుకుంటూ ఉన్నాడు. కొంతమంది అష్టమినవమినాటి తిథి రహస్యాలుచెబుతూ అష్ట కష్టాలు వచ్చినా అవి చివరకు ధర్మవిజయాన్ని కలిగిస్తాయ. అపారమైన కీర్తి సంపదలను కల్గిస్తాయ. కనుక ధర్మాన్నిఆచరిస్తేచాలు . అది విజయమే కొని తెస్తుంది అనేది వాస్తవం అంటారు. ఫంచభూతాలు మనల్ని నడిపించే ప్రత్యక్ష దైవాలు. వాటిని సక్రమంగా వినియోగించుకుంటే లోకకళ్యాణం, లేదంటే ప్రళయం ఏర్పడుతుంది. ఏకాలంలోని వారైనా దీన్ని ఎపుడో ఒకప్పుడు కొద్దిగానో గొప్పగానో అనుభవించి ఉంటారు. భగవంతుని దృష్టిలో మనష్యులంతా సమానులే. ఈ కుల మతాలు, ఆస్తి అంతస్థులు, అధికారాలు, హోదాలు మనిషికి కొలమానాలు కావు. ఇవి మనుషులు ఏర్పరుచుకున్నవి. తాత్కాలికమైనవి. ఏదో ఒకనాడు జరిగి పోయేవి అంటే నశించిపోయేవే. అందుకే వీటిమీద మక్కువ ఎక్కు పెంచుకోకూడదు.
కలియుగంలో పరస్పరాధీనములు. పరస్పరాధితములైనవే ఉన్నాయ. అవి కాదంటే జీవనము ముందుకు పోదు. ఉదా. రైతు పంటలు పండిస్తే అందరికీ ఆహారం. మరి అందరూ రైతులు కాలేరు కదా! రైతు పంట పండించాలంటే.. భూమి కావాలి. ఎద్దులు కావాలి, కూలీలు కావాలి. విత్తనాలు కావాలి. ఎరువులు కావాలి. వర్షాలు కావాలి. ఇట్లాంటివన్నీ మరొకరి దగ్గర నుంచి తీసుకొన్నపుడు పంటలు బాగాపం డుతాయ. వారికి రైతు పండించిన పంట కావాల్సే ఉంటుంది.ఇట్లా ఒకరిపై మరొకరు ఆధారపడి ఉండడం సహజం.
లోకంలో ఎవరూ ఎక్కువకాదు. మరెవ్వరూ తక్కువ కూడా కారు. కాని కొంతమంది పదవి, కాంతాకనకాలు చూపి అందరనీ లోబరుచు కోవాలని చూసారు. ఇది అజ్ఞానం. ఈ అజ్ఞానాన్ని దూరం చేసుకొంటే భగవంతుడే మనహృదయంలో కొలువుంటాడు.
స్వర గనరకాలు అంటూ ఎక్కడా లేవు అని చెప్పే వారి మాట వింటే మనలో వద్దన్నా చోటు చేసుకోవాలని చూసే ఈర్ష్య అసూయాద్వేషాలను విడనాడాలి. అపుడే ఈ జన్మకు సార్థకత. ఎంత కష్టమొచ్చినా ధర్మమార్గాన నడవాలి. ఆ భగవంతున్ని సదా స్మరిస్తూ వుంటే ప్రతిక్షణం మనకు ఓ శుభక్షణం అవుతుంది.
అంతా నేనే.. నేను లేనిదే ఏమీ లేదు అని విర్రవీగే వారికి ఆ భగవంతుడే తగిన గుణపాఠం చెబుతాడు. అహంకారం కళ్లు మూసుకొనేట్టు చేస్తుంది. భక్తి కళ్లు తెరిపిస్తుంది. కనుక భక్తిమార్గంలో నడుస్తుంటేచాలు మీరు ధర్మమార్గంలో నడుస్తున్నట్టే. ఇక్కడ కూడా ఒకచిక్కు ఉంది. భక్తిమార్గంలో నడవడం అంటే భగవంతుని తత్వాన్ని అర్థం చేసుకోవాలి. అంతేకాని ఆడంబరాలకు పోయ అట్టహాసంగా భజనలు, కీర్తనలు, దీపారాధనలు అంటూ హంగామా చేస్తే అందులో భక్తి భావన తగ్గిపోతుంది.
మనపక్కనే పొంచిఉన్న అహంకారం పట్టి కుదిపేస్తుంది. అందుకే అహంకారం దూరం చేసుకొంటూ ఉండాలి. దుర్యోధనుడు అహం కారంతో విందు భోజనాన్ని శ్రీకృష్ణుడు కోసం ఏర్పాటు చేస్తే భగవం తుడైన కృష్ణయ్య తనకు ప్రేమతో భక్తితో ఇచ్చే మంచినీరైనా ఆనందంగా స్వీకరిస్తాను. కాని పొగరుతో ఇచ్చేవి ఏవైనా ఎంత ఖరీదువైనా అక్కర్లేదని చెబుతాడు. ఇదే విషయాన్ని శ్రీకృష్ణతులాభారంకూడా చెబుతుంది. అందుకే కాలంతో పాటుగా సాగుతూ ఎప్పటికప్పడు తమను తాము విమర్శచేసుకొంటూ సజ్జనులతో స్నేహం చేయాలి. ధర్మమార్గంలో నడవాలి.

- కె. రాణి