మంచి మాట

వర్ణాశ్రమ ధర్మాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అపౌరుషేయాలైన వేదములు మంత్రద్రష్టలైన ఋషులచే పూర్ణమయిన అనంతము నుండి గ్రహింపబడి తమ స్మృతి పథం లో నిక్షిప్తపరుచుకొని తరతరాలకు అందించబడిని వేదవ్యాసులు వాటిని లిఖించి మానవాళికి మహోపకారం చేసారు.
సర్వకాల సర్వావస్థల యందు ఎంతో నియమనిష్ఠలతో తమ జీవితాలను క్రమశిక్షణకు అంకితం చేసి వేద నిధిని కాపాడుకుంటూ వచ్చిన ఋషి పుంగవులకు ఎంతో ఋణపడి ఉంది. మనభారతజాతి.
నక్షత్రకాంతి తమపై ప్రసరించుచుండగా నదీప్రవాహములో నడుములోతు నీటిలో నిలబడి వేదాలను అధ్యయనం చేయుట ఒక తపస్సు. సర్వభోగాలను త్యజించి ప్రకృతి యే భగవంతుడనే సత్యాన్ని కనుగొనుటకు నిత్యం శ్రమించారు. ప్రకృతిని అనేక దేవతా స్వరూపాలుగా భావన చేసి మానవుని ఉనికిని శాశ్వతం చేసారు.
జ్ఞానమనే సంస్కారాన్ని మానవుడిలో నిక్షిప్తం చేశారు. నాగరికతకు నేపథ్యం వేదజ్ఞానమే. అనుటలో సందేహించవలసిన అవసరంలేదు.
ఈర్ష్యాపరులైన కొందరు తమ ప్రాబల్యము నిలుపుకొనుటకు అసుర ప్రవృత్తితో వేద విజ్ఞానాన్ని చిన్న చూపు చూసేలా ప్రచారం చేయుట జరిగినది. కాని అవి కాలగమకములోని నిలబడలేదు. భగవంతుని ప్రసాదమైన వేదములనుండి జనించిన పురాణ ఇతిహాసములు. ఉపనిషత్తులు మనకు ఎన్నో దైవారాధనా ప్రక్రియలను అందించినవి. ఈనాడు దేవాలయములో నెరవేర్చు అనేక అర్చనా విధానములు, క్రతువులు అత్యంత మహిమాన్విత వాటి యొక్కప్రాధాన్యత , మహిమ ఎంతో నియమనిష్టలతో నెరవేర్చు ఆగమ శాస్త్ర ఉద్దండులైన పండిత పూజారులకు మాత్రమే అవగతము. అటువంటి శాస్త్ర బద్ధులైన పండితోత్తములు మాత్రమే అర్చకులుగా అర్హులు. అపుడే వాటి ఫలితముప్రజలందరికి సంపూర్ణముగా లభిస్తుంది. కులముతో సంబంధము లేకుండా ఎవరైతే అటువంటి వైదిక, ఆగమ పరంపరలో వస్తారో వారే ఈ ప్రవృత్తికి సంపూర్ణఅర్హులు. ఇక కులప్రస్థాపన నేరుగా మన సనాతన ధర్మములో ఎక్కడా లేదు. వర్ణాశ్రమ ధర్మాలు మాత్రము నిర్దేశించబడ్డాయి. గీతలో భగవానుడు చెప్పినట్లు.
చాతుర్వర్ణం............ మవ్యయమ్‌॥ గుణములను బట్టి తాము చేపట్టే కర్మలను అనుసరించి నాలుగు వర్ణములుగా మానవులు విభజింపబడ్డారు. త్రిగుణముల ఆధారముగా సత్యప్రధానమైన శమము, దమము, తపము ఎవరైతే అనుసరిస్తారో వారు బ్రహ్మజ్ఞానులు. రజోగుణ ప్రధానమైన శౌర్యమును అనుసరించువారు క్షత్రియులు. తేజమును అనుసరించువారు వైశ్యులు. తమోగుణప్రధానమైన సేవాభావము గలవారు శూద్రులు. కొంతమంది స్వార్థపరులు ఈ వర్ణములను కులము గా మార్చి సమాజమును భ్రష్టుపట్టించిరి. వేదాధ్యయనమునకు , క్షాథ్ర లక్షణములకు ఎంతో త్యాగము, తెగువ, క్రమశిక్షణ అవసరం. అటువంటి కఠోరమైన శిక్షణలను పాటించలేని సోమరులు , భోగలాలసులు వాటిని సాధించలేక వర్ణవిమర్శజేయుట పరిపాటి. తుదకు అసూయాద్వేషముతో వర్ణసంకరము చేయుటకు సృజియించిన ఈ చాతుర్వర్ణ వ్యవస్థలో మానవుడనేవాడు ఎవడైనా ఆయా గుణములను సాధనచేసి తదనుగుణవర్ణములలో ప్రవేశించవచ్చు. అశక్తుడయినచో ఆ వర్ణమునుండి నిష్క్రమించవచ్చు. అంతియే గాని పుట్టుకతోనే వర్ణము నిర్దారించబడదు. జన్మనా జాయతే శూద్రాః కర్మణా జాయతే ద్విజః అని స్మృతి. పుట్టకతో అందరూ శూద్రులే. నియమనిష్టలతో భోగత్యాగాలు చేసి వేదాధ్యయనము చేయుచూ లౌకిక విషయాసక్తులు కాని వారు ద్విజత్వమును పొందుదురు. బ్రహ్మజ్ఞానము గల ఈ ద్విజలు మిగిలిన వర్ణముల వారికి దిశానిర్దేశము చేయగలరు. సత్వగుణ ప్రధానుడైన బ్రహ్మజ్ఞాని సకల శాస్త్రాలను సృజించగల శక్తిగలవాడై మానవ సమాజము సుఖసంతోషాలతో మనుగడ సాగించుటకు తగిన ప్రణాళిక వేయగలడు. స్ర్తిపురుష సంయోగమే మరొక జన్మకు కారణము తప్పకులము కాదు. చరిత్రలో రాజ్యములేలిన రాజులందరూ క్షత్రియ కులము వారు కాదు. క్షాత్రగుణమును బట్టి రాజులయినారు. వేదాయలను అధ్యయనము చేసిన బోయలు బ్రహ్మజ్ఞానులైనారు. పరమ నైష్టికుడైన కౌశికునకు ధర్మవ్యాధుడు ధర్మబోధ చేసి బ్రహ్మజ్ఞాని అయినాడు. కావున చక్కని సమాజమునకు వర్ణాశ్రమధర్మములు ఎంతో ముఖ్యములు. వీటికంటే సర్వజనీనము, సర్వజనసమ్మతము అయిన ధర్మాచరణ ఎంతో ముఖ్యం. అదియే మన భరతజాతికి శ్రీరామ రక్ష.

- వారణాశి వెంకట సూర్యకామేశ్వరరావు