మంచి మాట

శనైశ్చరుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నవగ్రహాల్లో శనిగ్రహానికి చాలా ప్రాముఖ్యత ఉంది. సూర్యుని కుమారుడు, యమునికి సోదరుడు శని. మానవులకు శని దేవుడు అంటే భక్తి కన్నా భయమే ఎక్కువగా ఉంది. అందుకు కారణం ఎవరిపైన అయినా శని ప్రభావం అంతో ఇంతో పడే వుంటుంది. వారి ఆ బాధలు అనుభవించే ఉంటారు. సంకటపరిస్థితులు ఎదుర్కోవలసి వస్తేశని పట్టాడని అంటుంటారు. కాని, శని సంచారం జాతకంలో ఉన్నప్పుడు శని శుభఫలితాలను కూడా ఇస్తుంటాడు.
శని మందంగా నెమ్మదిగా సంచరించే గ్రహం. దానివల్లనే శనిని మందుడు అని వ్యవహరిస్తుంటారు. గ్రహసంచారం వల్ల ప్రతి మనిషి జీవితంలో ఉత్తానపాతాలుంటాయి.సుఖదుఃఖాలు కలుగుతుంటాయి. అయితే కష్టానికి భయపడకుండా అననుకూల పరిస్థితులున్నపుడుభక్తితో భగవంతుడిని ప్రార్థిస్తూ ముందుకు అడుగువేసిన వారికి మంచి కాలం వస్తుంది.చీకటి వెనుక వెలుగు తప్పనిసరిగా ప్రసరిస్తూ ఉంటుంది. శని గమనాన్ని బట్టి ఏలినాటి శని,అష్టమ శని, అర్థాష్టమ శని అంటూ రకరకాలున్నాయి. వాటి ప్రభావాలు కూడా వేర్వేరుగా ఉంటాయి. శనిదోషం వల్ల అనారోగ్య బాధలు కలుగుతుంటాయి. ప్రమాదాలు,పనుల్లో ఆటంకాలు మొదలైనవి జరుగుతాయి శనిని దూషించడంగాని, నిర్లక్ష్యంగా మాట్లాడడం కాని చేయకూడదు. కష్టాలు వచ్చినపుడే మనిషిలో ఉన్న ఓర్పు తెలుస్తుంది. ధైర్యంగా సమస్యలను పరిష్కరించుకునే మార్గం తెలుసుకొని ఆచరించగలగాలి. మహారాష్ట్ర లోని శని సింగణాపూర్ ఆంధ్రలోని మందపల్లి శనికి సంబంధించిన ప్రముఖ క్షేత్రాలుగా ప్రసిద్ధి. ఇతర దేవాలయాలల్లో కూడా నవగ్రహాలు ఉంటాయి. శనికి ప్రధానమైన శనివారం నాడు శనికి పూజలు జరిపించి శని బాధల నుండి నివారణ పొందవచ్చు.
శనికి నలుపురంగు అంటే ఇష్టం. ఆయన వాహనం కాకి. నల్లని నువ్వులదానం, నువ్వుల నూనెతో అభిషేకం చేసినల్లని వస్త్రాన్ని ధరింపచేసి వంగపండు రంగుపువ్వులతో పూజించి ధూపదీపాలు ఇవ్వాలి. పండ్లు కొబ్బరి కాయను నైవేద్యంగా ఈవిధంగా పూజలు చేసి ప్రదక్షిణ నమస్కారాలు చేసి శనిపీడ తొలిగించమని ప్రార్థించాలి.
శనికి ఎప్పుడు కూడా ఎదురుగా నిలబడి నమస్కరించకూడదు. ఆయన చూపులు తీక్షణంగా ఉండటం వలన ఆ చూపులను తట్టుకునే శక్తి మనకు ఉండదు. కనుక దుష్పరిణామాలు ఏర్పడటానికి అవకాశం ఉంటుంది. ఎంతటివారయినా శని ప్రభావం నుండి శని పెట్టే బాధలనుండి తప్పించుకోలేరు.
ఆఖరికి శివుడు కూడా శని బారిన పడినవాడే అనే ఐతిహ్యలు ఉన్నాయి. ఒకసారి శని కైలాసానికి వెళ్లాడు. శివుడు శనితో పరాచికాలు ఆడుతూ నువ్వు అందరినీ ఏమైనా చేయవచ్చు కాని, నన్ను మాత్రం ఏం చేయలేవు అన్నాడు. దాంతో చిన్నచిరునవ్వు నవ్వి చూద్దాం లే శివా ఎందుకన్ని మాటలు అన్నాడట శని.
కబుర్లు అయిపోయి శని వెళ్తూ వెళ్తూ శివా నా ప్రభావం ఏమిటో రేపు చూపిస్తాను. నేను రేపు నీ దగ్గరకు వస్తాను అని చెప్పాడట. ఏం ఫర్లేదు. రేపు కదా నిరభ్యంతరంగా రమ్ము, నీ ప్రభావానికి నేను లోను కాను చూద్దాం అన్నాడట శివుడు. తెల్లవారాక శివుడు ‘ఈ శనికి నేను అసలు కనిపించకుండా ఉంటే పోతుంది కదా ఎందుకొచ్చిన గొడవ అనుకొని భూలోకానికి వెళ్లి ఓ చెట్టు తొర్రలోకి వెళ్లి దాక్కున్నాడు. అక్కడికి శని వచ్చాడు.
‘ఏం శివా బాగున్నావా’అంటూ అక్కడికి వచ్చాడు శని దేవుడు.
‘నాకేం చాలా బాగున్నావు. అయినా నా మీద మీ ప్రభావం ఏమీ లేదు చూశావా’అన్నాడట ఆ కైలాసవాసుడు.
శని మెల్లగా నవ్వుతూ ‘పరమశివా! నీవు కైలాసంలో వెండికొండపైన పార్వతీ దేవితో కలసి కూర్చుని ప్రమథగణాలతో పూజింపబడుతూ ఉండే వాడిని. కాని ఇపుడు ఈ చెట్టు తొర్రలో ఉన్నావు. ఇది నా ప్రభావం కాక మరేమిటి? ’అన్నాడు శని.
శని ప్రభావాన్ని స్వయంగా శివుడు మెచ్చుకుని ‘శనిదేవా! ఇక నుంచి నిన్ను పూజించినవారికి నీవుచెడుప్రభావం చూపించకు’అని చెప్పాడట.
‘శివాజ్ఞలేనిదే చీమైనా కుట్టగలదాపరమశివా! నీవు ఎలా చెప్పితే నేను అట్లా చేస్తాను’అని శనిదేవుడు చెప్పాడట. అందుకే శనిని పూజించుదాం. శని నుంచి శుభఫలితాలను అందుకుందాం.

-అబ్బరాజు జయలక్ష్మి