మంచి మాట

తత్వశాస్తవ్రేత్త

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తత్త్వశాస్తమ్రులో గాని మనస్తత్వ విషయములోగాని పరిశోధనలలోగాని, ఉద్యమాలలోగాని సంభవించిన మార్పులకన్నింటికి కారణం మహాజనకుడు కపిల మహర్షియే. మహాభారతములో, భాగవతములోనే కాకుండా ఉపనిషత్తులలో కూడా కపిల మహర్షి ప్రశంస ఉన్నది.
మనస్తత్వ శాస్తవ్రేత్తలందరిలో కపిలుడు మూలపురుషుడు. ఇతడు గొప్ప మహర్షియే కాదు ఉత్తమ వివేచనాదక్షుడు. ఇతని నుండి భారతీయ తత్త్వశాస్తమ్రు ప్రారంభమై దేశ విదేశాలకు ప్రాకింది. భారతదేశం నుండియే పైథాగరస్ మనస్తత్వ శాస్త్రాన్ని నేర్చుకొని గ్రీకులకు నేర్పించాడు. ఆ తర్వాత ప్లేటో కూడా నేర్చుకొని అలెగ్జాండ్రియా, యూరపు దేశాలకు అందజేశాడు.
ఉత్తర భారతదేశంలోని త్రివేణి సంగమం అతి పవిత్రమైనది (గంగాయమునా సరస్వతీ నదులు). సరస్వతీని ఇప్పుడు గంగానదిలో అంతర్భాగమై యున్నది. ఒకప్పుడీ సరస్వతీ నదీ తీరంలో కర్దమ ప్రజాపతి ఆశ్రమం ఉండేది. ఇక్కడనే కపిలుడు జన్మించాడు. కావున కపిలుని జన్మస్థానం, నివాస స్థానం ఉత్తరప్రదేశ్‌గానే పరిగణించారు. ఇది అంబాలా (హర్యానా) నగరమునకు దగ్గరలోనున్న రేణుకా సదస్సు దరిదాపులలోనున్నది.
బుద్ధునికి పూర్వమే కపిలుడు బౌద్ధమత భావాలను ప్రజలలో వ్యాపింపజేశాడని కొన్ని ఆధారాలు లభించాయి. కపిలుని భావాల సంకలనమే సాంఖ్య దర్శనము. దీనినే సాంఖ్య ప్రవచనముగా వ్యవహరించారు. ఈ ప్రవచనములో 60 విషయాలపై చర్చ ఉన్నందున దీనిని షష్ఠితంత్రముగా పేర్కొన్నారు. మనస్సు, మనస్సుయొక్క తత్త్వాన్ని వెదుకుటవలన ఇది దర్శనం అయినది.
సమ్యక్ ఖ్యాతి, సరియైన జ్ఞానము ఇచ్చుటవలన సాంఖ్యం అయినది. అంతేగాకుండా గుణాలు, ప్రకృతి పరిణామములు లెక్కలు తెలుపుటవలన కూడా సాంఖ్యయోగమైనది. మనస్సును, బుద్ధిని నడిపిచేది ఆత్మ. ఆత్మ ఎంతో సూక్ష్మమైనది. మనస్సు ఒక మట్టి ముద్దలాంటిది. దీనికి స్వంత ప్రకాశము లేదు. కాని ఆలోచిస్తుంది. ఆ ఆలోచన వెనుక ఏదో ఉంటుంది. ఆ ఏదో అనునదియే పురుషుడు అని కపిలుడు నిర్థారించాడు. ఆ పురుషుడినే వేదాంతులు ఆత్మ అన్నారు. అంటే మనస్సుకు బుద్ధి కాకుండా ఇంకొకటిగానున్నదానినే ఆత్మ అన్నాడు.
ఈ ఆత్మ అనేది సర్వస్వతంత్రమైనది. ఇది భౌతిక పదార్థము ఎంత మాత్రము కాదు. వాస్తవమునకు ఈ ఆత్మకు సుఖములేదు. దుఃఖము లేదు. సమస్తమైన కార్యకలాపములకు శాశ్వత సాక్షియే ఆత్మ. అనుభవించేవాడు భోక్త, చూచేవాడు ద్రష్ట. పరమార్థతత్త్వం, ప్రభువు జీవాత్మ అన్నది కపిల మహర్షి తత్త్వం.
ప్రాణం వున్న జీవులన్నియు మూడు రకాలైన దుఃఖాలకు గురి అగుతుంటాయి. అందువలన తీవ్రమైన బాధలు కలుగుతాయి. అవి- ఒకటి ఆధ్యాత్మిక దుఃఖం, రెండవది భౌతిక దుఃఖం. ఇక మూడవది ఆదిదైవికము. శరీరానికి కష్టము కలిగినపుడు మనస్సు ద్వారా బాధపడడమే ఆధ్యాత్మిక దుఃఖం. ఇతర ప్రాణులవలన, దొంగలవలన కలిగిన దుఃఖము ఆదిభౌతికము. ఇక ప్రకృతివలన అనగా వర్షము శీతోష్ణస్థితి వలన కలుగు బాధలేమో దైవము వలన సంభవించిన దుఃఖము.
ఒక వస్తువునుండి ఇంకొక వస్తువు రూపొందుచున్నదని మొట్టమొదటగా ప్రతిపాదించిన మహావ్యక్తి కపిల మహర్షియే. జీవునిలో వున్న ఆత్మ స్వభావము చేత పవిత్రమైనది. స్వభావం చేత మానవుడు అపవిత్రుడైనచో కొంతసేపు పవిత్రుడైనప్పటికినీ అతడు ఎప్పుడూ అపవిత్రునిగానే ఉండిపోతాడని మహాతత్త్వవేత్తయైన కపిల మహర్షి ప్రపంచానికి గొప్ప సందేశమిచ్చిన దివ్యజ్ఞాని.
కపిల మహర్షి సూచనలను సిద్ధాంతాలను పాటించి ప్రవర్తించిన వారికి కష్టసుఖములు సమానముగా తోచును. అట్టివారిని ఈతిబాధలు ఏమీ చేయలేవు. నేటి మనస్తత్వ శాస్తవ్రేత్తలందరూ కపిల మహర్షి సూత్రాల ఆధారంగానే మనస్తత్వ శాత్రముల పరిశోధనలు చేసి లోకానికి అందించుచున్నారు. వారికి లోకం ఎంతో ఋణపడి ఉంటుంది.
ఇట్లాంటి శాస్త్ర విషయాలు కాని, విజ్ఞాన విషయాలు కాని తెలుసు కోవాలంటే ముందుగా మనకు త్వరగా అర్థమయ్యేటట్టుగా ఉన్న భారత భాగవతాదులను, రామాయణాదులను క్షుణ్ణంగా అధ్యయనం చేయాలి.

-పెండెం శ్రీ్ధర్