మంచి మాట

ఆత్మజ్ఞాని

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అత్రిమహర్షి, అనసూయల పుత్రుడు దత్తాత్రేయుడు. అత్రి పుత్రుడు కనుక ‘ఆత్రేయుడు’ అని కూడా పిలిచారు. శివానుగ్రహంతో దత్తాత్రేయుడు సంపూర్ణజ్ఞానాన్ని పొందాడని బ్రహ్మ పురాణం చెబుతుంది. ‘శ్రీదత్తా’ అని స్మరించినంతనే మన మనస్సులోని కోర్కెలు తీర్చునని శ్రుతి తెలుపుచున్నది. సర్వజీవులకు జ్ఞానబోధ గావించుట, జ్ఞానమయము, ప్రేమ సత్యానందమయము, ధర్మమయమూ తరింపజేయుటకె దత్తమూర్తి అవతరించారని చారిత్రక కథనం. దత్తాత్రేయుడు వేదజ్ఞానము నధిగమించిన జ్ఞానసాగరుడు.
ఆయన రూపం కూడా దివ్యసందేశాన్నిస్తుందని అంటారు. దత్తుడు గోమతీ నదీ తీరమున సత్యజ్ఞాన సముపార్జనకై తపస్సు చేసి సకల విద్యలలో ఆరితేరి జ్ఞానమును సంపాదించి సత్యజ్ఞాని అయ్యాడు. దత్తాత్రేయుడికి ఆరు చేతులు మూడు తలలు నడిమి శిరస్సు విష్ణువుది. కుడిది శివుడిది ఎడమది బ్రహ్మ శిరం. కుడి భాగము సద్గురు స్వరూపము, ఎడమభాగము పరబ్రహ్మస్వరూపము మధ్యభాగాన గురుమూర్తిగా అజ్ఞానమును తొలగించి శ్రీదత్తుడు లోకముల రక్షణ చేయును. మూడు ముఖములతో, ఆరు భుజములతో నాల్గు కుక్కలతో, ఆవుతో కనిపిస్తాడు. నాల్గు కుక్కలు నాల్గు వేదములు, ఆవు మనస్సే మాయాశక్తి, మూడు ముఖములు త్రిమూర్తులు. సృష్టి, స్థితి, లయములు. త్రిశూలము ఆచారము, చక్రము అవిద్యా నాశకము, శంఖము నాదము సమస్త నిధి, డమరు సర్వవేదములు దీని నుంచి పాదుర్భవించినవి. కమండలము సకల బాధలను దూరం చేసి శుభాలను చేకూర్చుటకు ప్రతీక.
దత్తాత్రేయుడు షోడశరూపాలతో అవతరించాడంటారు. సాక్షాత్తు సుబ్రహ్మహ్మణ్య స్వామికి 289 గీతాలతో ఆత్మతత్వాన్ని ప్రబోధించినట్లు చెప్తారు. ఈ గీతనే అవధూత గీతగా ప్రసిద్ధిచెంది ఉంది.
దత్తాత్రేయుని నామాలను ప్రతిరోజు పఠించినావారికి దత్తసాయుజ్యం తప్పక లభిస్తంది. గురువారం నాడు దత్తుని చరిత్రను, పారాయణ కావించినవారికి ఇహలోకంతోపాటుగా పరలోక సంపదలూ సంప్రాప్తిస్తాయని ప్రతీతి. మేడి చెట్టు మొదట్లో ఉండడానికి దత్తుడు ఇష్టపడుతాడు. ఆ మేడి చెట్టును మనము పూజ్యభావంతో చూస్తాం. అట్టి చెట్టు కింద కూర్చుని శ్రీ దత్తాత్రేయుని మంత్రం పఠిస్తే, దత్తుని అను గ్రహం తప్పక లభ్యవౌతుంది.
ఆత్మను గూర్చి నిత్యసత్యాన్ని తెలిపే తత్త్వమే దత్తాత్రేయ తత్వం. పరశురాముడు, కార్తవీర్యార్జునుడు ఈయన శిష్యకోటిలోనివారే. ఓం నమో భగవతే దత్తాత్రేయాయ అన్న స్మరణమాత్రముననే దత్తాత్రేయుడు సంతోషించి భక్తుల అభీష్టాలను తీరుస్తాడని భక్తుల విశ్వాసం.
పృధివి, వాయువు, ఆకాశము, జలము, అగ్ని, సూర్యుడు, చంద్రుడు, పావురము, కొండచిలువ, సముద్రము, మిడత, తేనెటీగ, తేనె సేకరించువాడు, ఏనుగు, జింక, చేప, వేశ్య, లకుముకిపట్ట, బాలుడు, కుమారి, బాణాకారుడు, సర్పము, సాలెపురుగు, కందిరీగ అను ఈ 24 మంది గురువుల వద్ద ఉపదేశాలు స్వీకరించేను.ఈ లోకంలో భగవంతుడు కానిదేమీ లేదని చెప్పడానికి, ఏ వస్తువు ఐనా అవస్తువైనా ఆ వస్తువు దాని విభూతిని కల్గి ఉందని, ఈ వస్తువునుకాని, ప్రాణిని కాని చులకనగా చూడకూడదని చెప్పడానికి దత్తాత్రేయుడు స్వయంగా 24 మంది గురువు ల దగ్గర నుంచి జ్ఞానాన్ని పొందానని చెప్పినట్లు గురుచరిత్ర చెబుతుంది.
ఈ 24మంది గురువులే కాక ఈ శరీరము కూడా నాకు గురువే. వివేక వైరాగ్య బోధ చేస్తుంది. జన్మమృత్యుజరాదులన్నీ దీని వెంటే ఉంటాయి. ఆత్మతత్త్వ విచారానికి అనువైనది ఈ శరీరం. అయినా దీనిని నమ్మకూడదు. ఏనాటికైనా ఇది నశించవలసినదే అన్నమాట గుర్తుంచుకుంటాను. ఈ జీవుడి బుద్ధిని కర్మేంద్రియ, జ్ఞానేంద్రియాలు విచలితం చేస్తూ ఉంటాయి. అందువల్ల బహు జాగరూకుడవై మెలగాలి. నాకు మానావమానాలు, కుటుంబ చింత లేవు. ఆత్మలోనే ఆత్మతోనే నా క్రీడ. ఇట్టి ఉపదేశం నాకు బాలుని వద్ద దొరికింది. ఈ జగత్తులో ఇద్దరు మాత్రం పరమానందభరితులై ఉంటారు. ఒకరు చీకుచింతా లేని చిన్నారి బాలుడు. రెండవవాడు గుణాతీత స్థితిని పొందిన పురుషుడు, అంటాడీ అవధూత దత్తాత్రేయులు. సత్యానే్న పలుకుతూ ధర్మాన్ని ఆచరించే వారితో దత్తుడు తోడునీడగా ఉంటాడు. సద్గురువు లభించడానికి గురు అనుగ్రహానికి కూడా దత్తాత్రేయస్మరణమే మార్గం.

- డేగల అనితాసూరి