మంచి మాట

గోమాలక్ష్మి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏకాలంలో నైనా మానవుని సంపద వృద్ధి పొందాలంటే గోవును పూజించాలి. గోసంపద ఉన్ననాళ్లు మానవుడు శ్రీమంతుడుగానే ఆయురా రోగ్యాలతోను, అష్టైశ్వర్యాలతోను ఉంటాడు. శాస్త్రాలన్నీ శ్రీమాత, భూమాత, మాతృదేవత, గోమాతలు పూజనీయములైనవని బోధించడం లో పరమార్థం ఇదే. మాతృమూర్తివల్ల లభ్యమైన మానవ జీవితాన్ని సవ్యంగా సాగించడానికిమానవుడు శ్రీమాతఅనుగ్రహాన్ని కోరుకుంటాడు. భూమాత కూడా మానవునికి సహాయకారిగా ఉన్నందువల్లే అతని జీవితం శోభాయమానంగా సాగిపోతుంది. అట్లే గోమాతకూడా మానవునిపై అనుగ్రహం చూపుతుంది. దానివల్ల సంపూర్ణ ఆయుస్సును, ఆరోగ్యాన్ని పొందుతాడు. అంతేకాదు మానవుని మనసును భగవంతుని వైపు మళ్లించడానికి కూడా గోక్షీరం ఎంతో మేలు చేస్తాయ. గోక్షీరం తల్లి పాలకు ప్రత్యామ్నాయం. పూజాకార్యక్రమాల్లో ఆవు పాలు అత్యంత శ్రేష్ఠమైనవి. ఆవుపేడ, ఆవు పంచితము, పాలు, పెరుగు, నెయ్యి మొదలైనవి పంచగవ్యాలు అత్యంత పవిత్రమైనవే.
గోదానం సర్వోత్కృష్టమైన దానం. గోవు శరీరంలో ఎన్నివేల రోమాలుంటాయో అన్నివేల సంవత్సరాలు దానం చేసిన వారు స్వర్గ లోకంలో నివాసం చేస్తారని పురాణాలు చెబుతున్నాయ. గృహప్రవేశ సమయంలో గోవును ముందుగా గృహంలోకి తీసుకెళ్లడం మన ఆచారం. ‘‘గోబ్రాహ్మణ్యేభ్యః శుభం భవతు’’ అని, ‘‘గోబ్రాహ్మణ్యేభ్యః శుభమస్తు నిత్యం’’ అని గోవుల మేలును సర్వదా కాంక్షించడం మన సంప్రదాయం. గోవుల కంట కన్నీరు కారనీయకుండా యజమాని రక్షించాల్సి వుంటుందని వేదం చెబుతుంది.ఒకసారి గోపాలుడైన శ్రీకృష్ణుడు యమునానదీ తీరంలో గోవులను కాస్తూ వుండగా రాక్షసుడొకడు లేగరూపాన్ని ధరించి దూడలను చంపసాగాడు. దూడ రూపంలో వచ్చిన రాక్షసుణ్ణి ధేనుకాసురునిగా గుర్తుపట్టి శ్రీకృష్ణుడు సంహరించాడు. ఆవులను ఇంటికి మరలించి తెస్తుండగా అవి కాళిందిలోని నీటిని త్రాగినాయి. ఆ నీరు విషతుల్యమై వుండడంతో గోవులు మరణించాయి. కృష్ణుడు వానిని బ్రతికించి కాళీయ మర్దనం జరిపాడు.
బ్రహ్మదేవుడు ఒకసారి కృష్ణుడు వనంలో గోవులను మేపుతుండగా గోపకులను, గోవులను కూడా ఒక మాయాగుహలో దాచిపెట్టాడు. దీన్ని గమనించి పరమాత్మ అటు బ్రహ్మకు ఇటు తన్ను నమ్ముకున్న తల్లి దండ్రులకు హితాన్ని కూర్చాలని కృష్ణుడు తన్ను తాను ఆవులుగా, దూడలుగా, గోపాలురుగా సృజియంచుకున్నాడు. తానే అన్ని రూపాలతోను ఉండి ఎవరి ఇండ్లకు వారి పిల్లలవలె చనుదెంచాడు. ఆ కృష్ణయ్యను చూచి ఎవరికి వారు వారి పిల్లలు, వారి పశువులు వచ్చాయని సంతోషించారు. కాని అన్నింటా తాను మాత్రమే ఉన్నానని చెప్పే ఈ సంఘటన అంతరార్థాన్ని కృష్ణబోధగా మానవులు గ్రహించాలని పెద్దలు చెబుతారు. అలా ఒక ఏడు గడిచిన పిమ్మట తిరిగి బ్రహ్మదేవుడు తాను దాచిన వారేమయ్యారో, అక్కడ శ్రీకృష్ణుల దగ్గర ఎంత అల్లకల్లోలం జరుగుతుందో చూద్దామని చూసేసరికి ఆశ్చర్యం ఇక్కడ అంటే తాను దాచిన స్థలంలోను, అక్కడ అంటే శ్రీకృష్ణుడు, ఇతర గోపాలురు ఉన్నచోట ఎక్కడి వారక్కడ ఉన్నారు. ఎవరు నిజమో ఎవరు అబద్ధమో తెలుసుకోలేక నానాఅవస్థలు పడి చివరకు పరమాత్మనే దిక్కు. ఈ స్వామిని పరిక్షించడం ఎవరికైనా తరమా అనుకొని శ్రీకృష్ణుని చెంతకు వెళ్లి తన్ను క్షమించమని కోరుకున్నాడు.
అటువంటి పరమాత్మ రూపమైన గోవును సంరక్షించడం మానవులు గా పుట్టిన అందరి బాధ్యత. గోవులో సకల దేవతలు నివసించి వుంటారని ప్రతీతి. లక్ష్మీదేవికూడా గోశరీరంలో నివసించాలనుకొని ఓసారి లక్ష్మీదేవి గోవుల దగ్గరకు వచ్చి నన్ను మీలో నివసించనీయమని ప్రార్థించింది. నీవు చంచలవు. మాయందు నీవు వుండరాదు అని గోవులు తిరస్కరించాయట. అప్పుడు లక్ష్మీదేవి తాను శాశ్వతంగా నీశరీరంలో ఉంటానని కోరగా గోవులు వాటి మూత్రపురీషాలలో వుండేలా చేశాయట. గోమూత్రం, గోవు పేడ పవిత్రాలు అయ్యాయ. అందుకే గోవు మాలక్ష్మి అని గోవులను భక్త్భివంతో లక్ష్మీ స్వరూపంగా పూజిస్తారు.
గోవును రక్షించడం అంటే పరమాత్మను పూజించడమే. ప్రకృతి, మానవుడు పరస్పరపోషితాలు కనుక ప్రకృతిలో భాగమైన గోవును సంరక్షిచడమూ మానవుని బాధ్యతనే.

- ఎస్. నాగలక్ష్మి