మంచి మాట

మనో నిగ్రహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనస్సుచాలాచంచల స్వభావమైనది. ధర్మజుడు యక్షప్రశ్నల సమయంలో గాలి కన్నా వేగం కలిగినది ఏది అంటే మనసు అని చెప్పాడు. మనసు ఒక్క క్షణలో వెయ్యోవంతు కూడా పనిలేకుండా కూర్చోలేదు. నిరంతరం ఏదో ఒకదానిని గురించి ఆలోచిస్తూ ఉంటుంది.ఇలాంటి మనస్సును స్వేచ్ఛగా వదిలేస్తే ఇంద్రియములకు ఆధీనమైపోతుంది. కామక్రోధాదులను బలపరుస్తుంది. అహంకార మమకారములను వృద్ధి చేస్తుంది. ఇక ఏముంది ఇంద్రియాలకు లాలసుడైన మనిషి ఏది చేయకూడదో ఏది చేయవలెనో అన్న విచక్షణను కోల్పోతాడు.క్షణిక సుఖాలకు దగ్గర అవుతాడు వెంటనే అతని పురోగమనం కాస్తా తిరోగమనం వైపు మళ్లుతుంది. అతి తక్కువకాలంలోనే అథః పాతాళంలోకి పడిపోయే ప్రమాదం ఉంటుంది. అందుకే మనస్సును ఎప్పటికప్పుడు విమర్శ చేసుకొంటూ ఇంద్రియ వశం కాకుండా మంచి పనులు మాత్రమే చేయాలనే నిబద్ధతో సత్సాంగత్యంతో మనసును అదుపులో పెట్టుకోవాలి. అట్లా పెట్టుకోవడమే మనో నిగ్రహం అని చెప్పవచ్చు.
దీనిని సాధించడానికి సులభమైన మార్గం భక్తిమార్గంలోన డవడమే. మనో నిగ్రహం అలవడితే దివ్యశక్తిస్వరూపులు అవుతారు. సద్గుణ సంపన్నులు అవుతారు. భక్తి, జ్ఞాన, వైరాగ్య భావనలను కలుగుతాయ. సమదృష్టి అలవడుతుంది. ఆత్మజ్ఞానాన్ని తెలుసుకొనేలా చేస్తుంది. భగవంతునికి దగ్గరైతే ముక్తికాంత కూడా చేరువలోనే ఉంటుంది.
మనోనిగ్రహం ఆధ్యాత్మిక సాధనకు అత్యవసరం. లౌకిక విషయాల సాధనకు కూడా మనో నిగ్రహం ఉండితీరాలి. అపుడే సజ్జనుడుగా నలుగురిలో కీర్తింపబడుతాడు. చంచల చిత్త అయిన మనస్సును, విషయలోలత్వము నుంచి మరల్చి ఆత్మయందే స్థాపితము చేసి ఆత్మకు సర్వదా అధీనమై ఉండునట్లు చేయవలెను- అని భగవద్గీత వివరించింది.
మనస్సును జయిస్తే చాలు. ముల్లోకములను జయించగలుగుదురు. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములు అనేవి అదుపు లో ఉంటాయ. కీడు చేసే ఆ గుణాలు సద్గుణాలుమారి మానవుని శాంతికి మార్గాలు అవుతాయ.
మామూలుగా మనస్సు ఎల్లపుడూతన చుట్టూ ఉండే వస్తువులమీద, వ్యక్తులమీద లగ్నమవుతుంది. ఆ వస్తువులలో ఉండే ఆకర్షణలు మనసును ప్రలోభపెట్తాయ.ఒక్కోక్కపుడు ఆ వస్తువులకే బానిసలుగా కూడా మారుతారు. ఉదాహరణకు మద్యానికో, మగువకో, అబద్దాలాడడానికో ఇలా ఎందుకూ కొరగాని వాటికి కూడా మనం మనస్సుఅనే వస్తువు అధీనంలో లేనందువల్ల బానిసలుగా మారే అవకాశం ఉంటుంది.
ఇటువంటి అపభ్రంశమైన పనులు చేయకుండా ఉండాలంటే మనసుని నిగ్రహించుకోవాలి. ఈ నిగ్రహం అనేది మన సంకల్ప శక్తి మీద ఆధారపడి ఉంటుంది. సంకల్ప శక్తి కలిగినవారు అనుకున్న కార్యంలో తప్పక విజయాన్ని సాధిస్తారు.
ఓ అర్జునా! మనస్సు బహు చంచమైనది. దానిని నిరోధించటము కూడా కష్టసాధ్యమే. కాని, అసాధ్యం మాత్రం కాదు. సరిఅయిన అభ్యాసమువలనను, వైరాగ్య భావనవలనను తప్పనిసరిగా నిగ్రహించవచ్చును- అని భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు వివరించి యున్నారు.
మితంగా మాట్లాడటం, మితాహారము, బ్రహ్మచర్యము, గృహస్థాశ్రమ ధర్మములను సక్రమంగా నిర్వర్తించుట వలననూ, ఉపవాస, వౌనవ్రతదీక్షలు జరుపుటవలనను, సాత్వికాహారమును భుజించుట, విరామం లేకుండా భగవంతుని నామాన్ని జపించడం, ప్రాణామయము చేయుట లాంటి పనుల వల్ల మనోనిగ్రహాన్ని సాధించవచ్చు.
లౌకిక విషయాలపట్ల కూడా మనస్సు ఆధీనంలో ఉంటే జరగకూడని పనులకు దూరంగా ఉండవచ్చు. సచ్ఛీలతతో బతుకవచ్చు. మనిషి ఎపుడూ చెడుఆలోచన్లలను రానివ్వకుండా భగవంతుని చింతన చేస్తూ ఉంటే చాలు మనోనిగ్రహం అలవడుతుంది. అపుడు నేను , నాది అనే మమకారాదులను వదిలిపెట్టడానికి సులువుగా ఉంటుంది. సర్వం ఈశ్వరమయంగా చూడడానికి నేర్చుకొంటాడు. స్వార్థబుద్ధి దూరమవుతుంది. భగవంతుని తత్వాన్ని ఎరుకపర్చుకోవడానికి ఈ మనో నిగ్రహం ఎంతో తోడ్పడుతుంది.

- హనుమాయమ్మ