మంచి మాట

శరణాగతరక్షకుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుప్పావై 16వ పాశురం నాయక నాయ్‌నిన్ఱ
*
నాయకనాయ్‌నిన్ఱ నందగోపనుడైయ
కోయిల్ కాప్పానే కోడి త్తోన్ఱుమ్ తోరణ
వాయిల్ కాప్పానే మణిక్కదవమ్ తాళ్ తిఱవాయ్
ఆయర్ శిఱుమియరో ముక్కు అఱై పఱై
మాయన్ వణివణ్ణన్ నెన్నలే వాయ్ నేర్‌న్దాన్
తూయోమాయ్ వన్దోమ్ తుయిలెళ ప్పాడువాన్
వాయాల్ మున్నంమున్నం మాత్తాదే అమ్మా నీ
నేయ నిలైక్కదవం నీక్కు ఏలో రెమ్బావాయ్
*
భావం:ఈనాటి 16వ పాశురం నుండి 30వ పాశురం వరకు గల పదిహేను రోజులు తిరుప్పావైలో మూడవ దశగా చెప్పబడుతున్నది. ఇదే అనుభవ దశగా ఉన్నది. ఈనాటి పాశురంలో, ఆశ్రయ దశను పూరితచేసుకున్న గోపికలు నందగోపుని భవనానికి చేరి, భవన ద్వార పాలకుని మేల్కొలిపి తలుపు తెరవమని ప్రార్థిస్తారు.
నందగోప కులానికే నాయకుడిగా ఉన్న నందగోపుడి భవనాన్ని రక్షించే ద్వార పాలకుడా శ్రీకృష్ణుడు అష్టాక్షరి మంత్రం. ఆ మంత్రమే నందగోపుడి భవనము. దాన్ని రక్షిచేంచేవాడా అని, అతనికి గల గొప్పదనాన్ని గుర్తుచేస్తున్నారు గోపికలు. ఆ భవనానికి శ్రీకృష్ణపరమాత్మ నిలయమైన ఆలయానికి జెండాతో ప్రకాశిస్తూ, తోరణములతో ఒప్పుచున్న ద్వారాన్ని నిరంతరం రక్షించే పుణ్యాత్ముడివి అని ప్రశంసిస్తున్నారు గోపికలు. ప్రణవ మంత్రం ‘ఓంకారం’ అదే జెండా! ఓం నమో నారాయణాయ నమః అనే శరణాగతిలోని ‘నమః’ నేను కాదు. నాకు నేను రక్షకుడిని కాదు ఆ పరమాత్మనే అని శరణాగతి చేయండి అని సంకేతించే పచ్చ తోరణాలు ఉన్నాయి. ఆ జెండాతోబాటు ఆ తోరణాన్ని జాగ్రత్తగా రక్షించి కర్తవ్యాన్ని నిర్వహించే నీవెంత ధన్యుడివి! భవనములోని మణికవాటము యొక్క గడియతీయాలి. మేము కూడా శరణాగతి చేసిన వాళ్ళమే. గోప బాలికలైన మాకు, మాయావియైనవాడు, నీలమేఘము వంటి ప్రకాశవంతమన మణి వర్ణము గలవాడైన కృష్ణుడే స్వయంగా ధ్వని చేసే పర అనే వాద్యాన్ని మాకిస్తానని నిన్ననే వాగ్దానం చేశాడు నీవేం సందేహించక తలుపు తీయి అంటున్నారు గోపికలు.
మేము పరిశుద్ధులమై (అంతఃకరణం, శరీరం రెండూ) ఆ పరమాత్ముడి గుణగానం చేయడానికై వచ్చామయ్యా! (నిన్ను ఇంతగా అర్థిస్తున్నాం, అనుగ్రహించాలి) నీవే ముందుగా నోటితో కాదని చెప్పక, దగ్గరగా లాగి ఉన్న ఆ దృఢమైన తలుపులు దయతో తీయాలి సుమా అని అర్థిస్తున్నారు గోపికలు భవన ద్వార పాలకుడిని.
ఆండాళ్ తిరువడిగళే శరణమ్

- డాక్టర్‌ పరవస్తు కమల