మంచి మాట

వినయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వినయం అనేది చదువుతో అబ్బుతుంది అంటారు పెద్దలు. వినయం అంటే ఒదిగి ఉండడమే కాదు అన్ని తెలుసుకొని ఉండడం దానితోపాటు ఏ వ్యవహారాన్ని ఎలా చక్కదిద్దాలో గ్రహించి ఉండడమూ వినయమే నంటారు పెద్దలు.
ఆటంకాలు ఎవరినైనా పలుకరిస్తూనే ఉంటాయి. ఆటంకాలను తట్టుకొని నిలబడితే అపుడు వారిని అందరూ మెచ్చుకుంటారు. భర్తృహరి తన శతకంలో ఏదైనా ఒక పనిని చేయాలనుకొన్నపుడు ఆటంకాలను ముందుగానే ఆలోచించి వాటిని ఏవిధంగా ఎదుర్కోవాలో కూడా ఆలోచించి అడుగు వేయాలని అని చెప్తారు. ఒకవేళ అనుకోని ఆపదలు ఎదురైనా బీరుపోకుండా అంటే అయ్యో ఎలా అనే కుంగిపోకుండా వాటిని ఎదిరించి ఆ పరిస్థితులను తనకు అనుకూలంగా మార్చుకుని ముందుకు పోవాలని కూడా అంటారు.
అట్లా ముందుకు పోయేవారే ఉత్తములని అసలు ఆటంకాలు వస్తే ఎదుర్కోలేమేమో అని పనే మొదలుపెట్టనివారు అధములని పని మొదలు పెట్టినా మధ్యలో అనుకోని ఆటంకం ఎదురైతే దాన్ని చూసి భయపడి ఆగిపోయే వాళ్లు మధ్యములనీ అన్నారాయన. విద్యావినయాలున్న వారైతే ఎలాంటి ఆటంకాలైనా తట్టుకొని నిలబడవచ్చు వారినే ఉత్తములుగా అందరూ కీర్తిస్తారు.మనమేపని చేసినా అది తమకొక్కరికే కాక అందరికీ కూడా మేలు చేసే విధంగా ఉన్నట్టు అయతే అది మేలు చేసినట్టే అవుతుంది. మంచి చేయకపోయనా ఫర్వాలేదు కాని చెడు మాత్రం ఎవరికీ చేయకూడదు.
ఒకసారి మహావీరుడు తపస్సు చేయాలనుకొన్నాడు. వెంటనే తపస్సుకు పూనుకొని కళ్లుమూసుకొని కూర్చుని ఉన్నాడు.
ఆ విషయం కనుక్కొని కొందరు ఆకతాయి పిల్లలు ఆయన మీద రాళ్లు రువ్వడం కొందరు పెద్దలు సైతం ఆయన తపస్సు చేసుకొంటుంటే వెక్కిరించడం పనికిమాలిన తపస్సు అంటూ ఎద్దేవా చేయడం అంటే మహావీరుని తపస్సుకు ఏదోఒక విధంగా భంగం చేయడం చేయడం ప్రారంభించారట. కొంతమంది దాన్ని చూసి మహావీరుని దగ్గరకు వచ్చారు. ఆయన తపస్సు చేయని వేళ పలుకరించి ‘అయ్యా మీకు తపోభంగం కలిగేట్లుగా కొందరు యత్నిస్తున్నారు. కనుక మీరు అనుమతిస్తే మీకోసం ఒక పెద్ద భవంతిని నిర్మించి ఇస్తాం. అక్కడ మీకు ఎటువంటి ఆటంకం కలుగదు మీరు అక్కడకు రండిఅని పిలిచారట.
మహావీరుడు అది విని చిరునవ్వు నవ్వి నాకేమీ ఇబ్బంది లేదు. మీరు కట్టించబోయే భవనం ఎవరైనా గూడు లేనివారికోసం ఇస్తే వారు సంతోషపడుతారు కదా. నేనెలాగు కఠిన నియమాలతో తపస్సు ఆరంభించాను. కనుక నాకు ఆపదలు వచ్చినా నేను వాటిని ఎదుర్కోగలను అని చెప్పాడట. దాంతో ఆయన శిష్యులతో వెళ్లిపోయారు. ఈ సంగతి అతనికి ఆటంకం కలిగించే వారు విని తాము ఎంత తప్పు చేస్తున్నామో తెలుసుకొ ఆయన పాదాలు పైపడి తమను క్షమించమని అడిగారట. ఆరోజుటినుంచి వారు ఆటకం కలిగించడం మానేసారు.
అట్లానే శిరిడీ సాయిబాబా మసీదు బయట కూర్చుని వుంటే కొంతమంది పిల్లలు ఆయన మీదకు రాళ్లు విసిరేవారట. కొందరు గట్టిగా ఆయన చెవిలో ఊది వెళ్లేవారట. ఎప్పుడూ ఏమీ అనకపోయినా అప్పుడప్పుడూ వారిని కోప్పడేవారట సాయి. చాలాసార్లు వారిని దగ్గర కూర్చోబెట్టుకొని తన దగ్గర ఉన్న తినుబండారాలు వారికి పెట్టి మంచి మంచి కథలు చెప్పేవారట. దాంతో వారిలో మార్పు వచ్చి శిరిడీ బాబను క్షమించమని అడిగి వారు మరలా అటువంటి తప్పుఎవరిదగ్గరా చేయకుండా ఉండేవారట.
పూర్వకాలంలో తాతయ్య అమ్మమ్మ, నానమ్మ లాంటివారంతా కూడా పిల్లలు అల్లరి చేస్తుంటేవారిని దగ్గర కూర్చోబెట్టుకొని వారికి మంచి నీతి కథలను బోధించేవారట. అపుడు వారు చేస్తున్న అల్లరి మానేవారు. నేటితరంలో కూడా పిల్లలందరికీ నీతికథలు చెప్పాల్సిన అవసరం ఉంది.
పెద్దలైనా చిన్నలైనా తెలియక తప్పు చేయవచ్చు. కాని తప్పు అని తెలిసిన తరువాత మళ్లీ మళ్లీ ఆ తప్పును పునరావృత్తం చేయకూడదు. అపుడే మంచిమార్గంలో నడుచుకున్నట్టు అవుతుంది. ఒకసారి తెలియక చేసిన దానికి శిక్ష పడినా ఆ తరువాత ఆ తప్పు చేయకపోవడంతో మంచివారిగా గుర్తింపు , ఆ మంచికి ఫలమూ అందుతాయి.

- హనుమాయమ్మ