మంచి మాట

నామ విలువ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాముడు దేవునిగా కొలువబడుతున్నాడు. ఆదర్శ పురుషుడుగా కీర్తించబడుతున్నాడు. చారిత్రిక పురుషుడుగా అభినందించబడు తున్నాడు. మంచి కొడుకుగా, మంచి అన్నగా, మంచి భర్తగా, మంచి స్నేహితుడుగా, మంచిరాజుగా, ఇన్ని ఎందుకు గాని మంచికి మారుపేరుగా రాముణ్ణే నూటికితొంబైతొమ్మిది మంది చెబుతారు. ఆ ఒక్కరు కూడా రామునిలో మంచిగుణాలు చెబుతారు కాని వారికి నచ్చని గుణాలను కూడా ఉన్నాయంటారు అది వేరు విషయం. అసలు ఇంతమందికి నచ్చిన రాముడు మాత్రం ఒక్కడే. ఈ ఒక్క రాముడే కాని ఇంతమందికి ఇన్నిరకాలుగా కనిపించడానికి కారణమేమిటా అని ఆలోచిస్తే రామునిలో ఉన్న సత్యసంధత, సత్యమునే పలుకే నేర్పరితనమూ, సర్వలనూ సమానంగా చూడడం పెద్దలను గౌరవించడమూ పిన్నలనూ ఆదరించడమూ ఎన్నో మంచి లక్షణాలు మనకు కనబడుతాయ.
వాల్మీకి మొట్టమొదట మంచి గుణాలు ఉన్న మానవుడు ఎక్కడన్నా ఉన్నాడా అని నారదుని అడిగాడు. వాల్మీకి ఆశించిన సద్గుణాలు ఒక్కరామునిలో ఉన్నాయని రాముని చరిత్ర నంతా వాల్మీకికి నారదుడు చెప్పాడు. ఆ తరువాత వాల్మీకినే రాముని అయనాన్ని చూశాడు. రాముని చరిత్రనంతా గ్రంథస్థం చేశాడు. ఇంత మంచి రాముని గురించి నేటి మానవులు కూడా తెలుసుకోవాలి. తనది కాని వస్తువును ఒక్కరాముడే కాదు ఆయన తమ్ముళ్లైన భరతుడు, లక్ష్మణుడు శత్రుఘు్నడు వీరిలో ఏ ఒక్కరూ ఆవించరు. ఈ అన్నదమ్ములేకాదు రామరాజ్యంలో నివసింఛిన వారెవరైనా సరే పరుల సొమ్మును ఆశించేవారుకారట. వారికి ఉన్నదానితో సంతృప్తితో జీవించేవారట. అందుకే వారికి అనారోగ్య సమస్యలు లేవు.. వారిలో జారులు కాని, చోరులు కాని లేరు. అవిద్య అనేది వారి రాజ్యంలో లేదట. విద్య నేర్చుకుంటే మంచి చెడులు తెలుస్తాయ. దానితో వివేకం ఏర్పడుతుంది. రాముడు తన రాజ్యంలో ఉన్న వారంతా విద్య నేర్చుకుని ఉండితీరాలని శాసనం చేయంచాడట.
రాముని నామాన్ని జపించినవారికి లేనిది అంటూ ఏదీ ఉండదని పెద్దలు అంటారు. రామ అన్నశబ్దమే పాపాన్ని మన దరికి చేరనివ్వదట. రాముని ఆదర్శంగా తీసుకొని మన జీవిత ప్రణాళిక వేసుకొంటే మనమూ రామునిలాగా పేరుతెచ్చుకుంటాము. మనజీవితంలోనే కాక ఇతరులకు కూడా కాంతిని పంచగలుగుతాం. రామనామంతో మైత్రి చేసినట్లు అయతే ఈ లోకంలో ఉన్న స్వర్గసుఖాలే కాదు పరలోకసంపదలు కూడా మన దరికి చేరుతాయ. సత్యానే్న పలుకడం వల్ల ధర్మానే్న ఆచరించడం వల్ల మన దగ్గరకు ఆపదలు రావు. వివేకవివేచనాలతో పనులు చేసి అందరికీ మంచిని కలుగ చేయడం వల్ల పూర్వజన్మలో పాపమున్నా దాని ఫలితం కాస్త తగ్గుముఖం పడుతుంది.
ఇవన్నీ తెలిసిన పెద్దలు రామనామమనే మోదకాన్ని పట్టుకుంటే అన్నీ ప్రమోదాలు కలుగుతాయని చెప్తారు. రామనామమను కల్పవృక్షాన్ని ఆశ్రయిస్తే ఇహపర సౌకర్యాలను పొందగలవు. రామనామమును నిదివరకు ప్రేమించినవారు, ఇప్పుడు ప్రేమించుచున్నవారు, ముందు ప్రేమించబోవువారు, వీరినే ప్రపంచము మహాభాగ్యవంతులుగా కీర్తించబడుతారు అని పెద్దలు చెబుతారు.
రాముని దైవంగా భావించేవారు రాముని నామాన్ని ఎల్లవేళలా జపిస్తూ రాముని లాంటి నడవడిని అలవాటు చేసుకొంటే అందరి మన్ననలను పొందుతారు. రాముడు కష్టకాలంలో తన నామాన్ని జపించిన వారికి తోడునీడగా నిలుస్తాడని రామభక్తులు విశ్వసిస్తారు.
అన్నింటినీ విడిచినా ఒక్కరామనామాన్ని విడువకుండా పట్టుకుంటే ఆ నామమే జీవితానికి మంచి మార్గం చూపుతుందని రామభక్తులు విశ్వసిస్తారు. రామనామానికి మించిన పతిత పావన శక్తి ఇంకొకటిలేదు. రామనామాన్ని జపిస్తే సమస్త సుఖములు చేకూరును. రామనామము చలికి అగ్నివంటిది. దాని స్పర్శనుండియే కలిపురుషుడు దూరమై పోతున్నాడని రామనామ జప త్తత్వవిధులు చెబుతారు. ఓ రఘువీరా! ఆనాడు రావణాది వీరులను మట్టుపెట్టినట్టే నీవు నాలో తిష్టవేసుకొని కూర్చున్న ఒక్కొక్క శత్రువును నీ కరవాలంతో మట్టు పెట్టుము. నేను నిమిత్త మాత్రుడినై నా నోటితో రామనామమమే బాణాన్ని అనుసంధానిస్తూ ఉంటాను. ఓ రామచంద్ర ప్రభూ! నా ఈ జన్మదుఃఖాలను ఉపశమింపచేసి నన్ను నీ దరికి చేర్చుము అని భక్తుల కోరుకుంటారు.

- ఎస్. నాగలక్ష్మి