మంచి మాట

అక్షరాలా కవిసమ్రాట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సనాతనాచార నిష్ఠ, ప్రసంగ కుశలతకు మారుపేరైన బ్రహ్మశ్రీ నోరి నరసింహశాస్ర్తీగారితో 1951 నుంచి నాకు ప్రగాఢమైన పరిచయం. నవ్వుతూ పలకరించి, సూటిగా వెక్కిరించే ఆయనలో- ఎటువంటి క్లిష్టమైన విషయాన్ని అయినా సులభంగా బోధించే లక్షణం పుష్కలంగా ఉంది. ఎలాంటి శ్రమ పడే అవకాశం లేని చోట కూడా ‘శ్రమపడినా కుదరకుండా ఉండే’ ప్రశ్నలను ఆయన సంధిస్తారు. మొహమాటం ఉండదు, మృదుత్వానికి లోటు లేదు. సహనంలో గొప్ప సహనం. చిరాకులో గొప్ప చిరాకు. ఇదీ ‘నోరి’ వారి విలక్షణ వ్యక్తిత్వం. వకీలు వృత్తిలో ఉన్నా కవిగా, రచయితగా ఆయన ప్రసిద్ధి చెందారు. ఆంధ్రలోకం అంతా ఆయనను ‘ఐతిహాసిక నవలా రచయిత’ అంటుంది.
‘నోరి’ వారి గురించి మాట్లాడేవారంతా శాంత గంభీరంగా, ప్రసన్న మధురంగా మాట్లాడతారు. వాల్మీకి, వ్యాసులంటే ఆయనకు చాలా ఇష్టం. ఆ ఇద్దరి గురించి ఎవరైనా సరే తేలిగ్గా మాట్లాడితే ఆయన సహించరు. కవిత్రయం అన్నా ఆయనకు ఎనలేని గౌరవం. కవిత్రయంలో ఎర్రన అంటే శాస్ర్తీగారికి ఎంతో గౌరవం, మహాభక్తి. నేను తిక్కన్న గురించి మాట్లాడితే చాలాసేపు వాదించి ‘ఆచార్ల గారూ.. మీకు ఏభై ఏళ్లు నిండితే గానీ ఆ తేడా తెలియదు’ అన్నారు. సుమారు పదేళ్లుగా ఎర్రన శాంతపావన గంభీర శైలీ రామణీయకత నన్ను ముగ్ధుణ్ణి చేసింది. మరో విశేషమేమంటే- ‘నోరి’ వారి దీక్షానామం ‘విజ్ఞాన యోగి’. అది కల్యాణానంద భారతీ మహాస్వాముల వారిచే అనుగ్రహింపబడింది. ఎర్రన కూడా విజ్ఞాన యోగి దీక్షానామం కలవాడని వారి నిశ్చయం. ‘ఈ విజ్ఞానాత్మక వాజ్మయమున’ అన్నారు కదా నృసింహ పురాణంలో అంటూ ఆ పద్యాన్ని చాలా చిత్రంగా దీక్షా సంప్రదాయానికి సాహిత్యంలో ఉన్న సన్నిహిత సంబంధం గురించి, అందులో ఉండే విశేషాల గురించి ఆయన ప్రసంగించేవారు. ‘నోరి’ వారి మిత్రుడైన శివశంకర శాస్ర్తీగారికి ఇవి అంతగా నచ్చేవికావు. ఆయన ముందు ‘అవునవును..’ అన్నా, వారి చాటున ‘ఏమిటో.. మా నరసింహశాస్ర్తీకి ఇదో పిచ్చి.. ఏం చేస్తాం’ అనేవారు శివశంకర శాస్ర్తీ. ఓ రోజు ‘నోరి’వారి ఇంటికి నేను వెళితే ఆయన జ్వరంతో ఉన్నారు. డాక్టర్ శంకరరావు పక్కనే ఉన్నారు. ఆయన నాచేతిని అందుకున్నారు. బాధ కాదు గానీ ఆయన కళ్లు తడిగా ఉన్నాయి. ఆ సమయంలో శాస్ర్తీగారు ఓ మాట అన్నారు. కవిత్రయ కాలాన్ని, వారి జీవితాలను, వారి ఆచార వ్యవహారాలను ఇప్పటి జనరేషన్‌కు అందించాలన్నారు. నన్నయ, తిక్కన జీవితాలను చిత్రించారు. ఎర్రన జీవితం గురించి వ్రాయాలి. నన్నయ, తిక్కనల కంటే ఎర్రన కాలానికి వచ్చిన బాధలు చాలా ఎక్కువ. అందువల్ల ఎర్రన బంటుగా యుద్ధాలు చేశాడు.. సేనాపతిగా సైన్యాన్ని నడిపించాడు. రుషిగా తపస్సు చేసి మహాగ్రంథాలు రాశాడు. ఆంధ్ర బ్రాహ్మణ శాఖ ఎంత ఉదారంగా ఉంటుందో ఆచరణలో పెట్టుకొని ఉదాహరణగా నిలిచి ఆనాటి చరిత్రతో జీవితాన్ని కలిపేశాడు. దాన్ని చిత్రించాలని శాస్ర్తీగారి కోరిక. ఆంధ్ర దేశానికి శాస్ర్తీగారు అందించిన నవలలు- ఆయన భాషా పాండిత్యాన్ని తెలిపేవి మాత్రమే కాదు. ఏ వ్యక్తి ఎలా మాటాడుతాడో, ధర్మసందేహాల్లో ఎలా నడుస్తాడో ఆ విషయాలన్నీ ‘నోరి’ వారు రాసిన నవలల్లో మనం చూడొచ్చు. ఆ వాతావరణంలోకి మనలను తీసికెళ్లి దర్శింపచేసే శక్తి వారి నవలలకు ఉంది. ఆయన వచనం ఎంత ప్రసన్న మధురంగా వ్రాస్తారో పద్యం కూడా అంత బాగా వ్రాస్తారు. ఆయన ఎన్నో నాటికలు, ఖండకావ్యాలు, వ్యాసాలు రాశారు. ఎన్నో సభల్లో అద్భుత ప్రసంగాలు చేశారు. సాహిత్య అకాడమీ సభ్యుడి హోదాలో నిష్ఠగా పనిచేశారు. ఆయనకు చిన్నప్పటి నుంచి పితృభక్తి ఎక్కువ. వీరి పద్ధతి అందరికీ ఆదర్శప్రాయం.
- కోగంటి సీతారామాచార్యులు
*
నోరి నరసింహశాస్ర్తి జయంతి మహోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ త్యాగరాయ గానసభలో నేడు
ఆచార్య అనుమాండ్ల భూమయ్య, డా. బోచ్కర్ ఓంప్రకాష్‌లకు నోరి పురస్కారాల ప్రదానం సందర్భంగా...