మంచి మాట

నాలుగు వేదాల సారం ఓంకారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సృష్ట్యాదిలో నాదం నుండి అక్షరాలు ఆవిర్భవించి వేదాలు ఏర్పడ్డాయి. ఈ వేదాలనుండే ఓంకారం ఉద్భవించింది. ఋగ్వేదం మొదటి ఋక్కులోని ‘అ’ను యజుర్వేదం మధ్యమంత్రం మధ్య అక్షరంలోని ‘ఉ’ను, సామవేదం చివరి మంత్రపు చివరి వర్ణం ‘మ్’ అనే మూడు అక్షరాలు అధర్వవేదం స్వరాన్ని అనుసరించి ‘ఓమ్’ ఏర్పడింది. అందుకే ఓమ్‌కారం ఆది స్వరంగ, నాలుగు వేదాల సారంగా వినాయకుని రూపంగా వేదమూర్తులు అభివర్ణించారు. పండితులు వేదమంత్రాలు వల్లిస్తూ ముందుగా ‘శ్రీ మహాగణాధిపతయే నమః హరిః ఓమ్’ అని ఉచ్చరిస్తూ ధ్యానం చేస్తారు. సంస్కృతంలో ఓమ్ అక్షరాన్ని గమనిస్తే అది గణపతి రూపాన్ని పోలి వుంటుంది. పైభాగం చంద్రవంక ధరించిన వినాయకుని తలలాగ, క్రింది భాగం బొజ్జలా, కుడిప్రక్క వక్రతొండంలా కనిపిస్తుంది. కనుక చతుర్వేదాలకు అధినేతయైన వినాయకుని పూజా ప్రారంభంలో ఓమ్ అని ఉచ్చరించి ఆయన రూపాన్ని మనసులో తలచుకొని ప్రార్ధిస్తారు.