మంచి మాట

సాధు లక్షణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహాదేవునిచే సృజింపబడిన ఈ జగత్తునందు మంచి చెడు రెండూ ఇమిడి వుంటాయి. అన్ని అంశములయందు మంచి-చెడు ఉన్నట్లే గుణముల యందు కూడా మంచి చెడు రెండూ వుంటాయి. హంస పాలను గ్రహించి నీటిని ఎలా వదలివేస్తుందో అదేవిధంగా సాధు పుంగవులు సద్గుణ సంపన్నులు అన్నింటా మంచి గ్రహించి చెడు వదలివేస్తాడు. సాధువుయొక్క లక్షణము ఏమంటే ఎదుటివారిలోని చెడు తొలగించుటకు ప్రయత్నిస్తాడు. వారు మారినా మారకపోయినా సదా మేలు చేయవలెనని తహతహలాడుతాడు. ఒక గొప్ప సాధువు మంచి మామిడి చెట్టు లాంటివాడు.
మామిడిచెట్టును మనం రాళ్ళతో హింసించినప్పటికీ అది అద్భుత ఫలములే ప్రసాదిస్తుంది. ఏ వ్యక్తి అయినా సాధువులతో మెలిగినంత మాత్రమున సాధువు కానేరడు. పరిమళభరితమైన శ్రీగంథం చెట్టుక్రింద బొరియలో వుండే పాము తన సహజ గుణమును ఎలా విడువదో, నీచబుద్ధిగలవాడు ఎప్పటికీ ఎదుటివానికి హానితలపెట్టుతాడేగాని మేలు పొరబాటున కూడా చేయడు. అది నీచ స్వభావం గలవారి సహజ నైజము. నిజమైన సాధువు సందర్భోచితంగా తన మంచి చెడులు ప్రక్కన పెట్టి ఎదుటివారి బాగే తన శ్రేయస్సుగా భావించి జీవితం గడుపుతాడు. మనకు ఒక మంచి సాధువు ఎదురుపడితే దయచేసి అతని మతం, కులం, గోత్రం వంటి వాటి గురించి ప్రశ్నించి అతనిని బాధపెట్టక, అతడి గుణగణాలపై ప్రశ్నలు సంధించండి, పరీక్షించండి. ఆయనలో నిక్షిప్తమై ఉన్న జ్ఞానామృతం ఆస్వాదించి తన్మయులుకండి, తప్పులేదు, తప్పుకాదు. నిజమైన సాధువు భగవంతుని ఏమని ప్రార్థిస్తాడంటే ఓ భగవంతుడా, నాకు నన్ను నమ్ముకున్నవారికి నాకోసం వచ్చేవారికి ఆకలితో బాధపడకుండా ఉండేందుకు ఎంత సంపద అవసరమో అంతే ప్రసాదించు. చెడువైపు మనసు పోకుండా సదా నన్ను గమనించు.
నిజమైన సాధువు ఎలా ఉండో ఆయన ప్రవర్తన ఎలా వుంటుందో ఈ ఉదాహరణ పరిశీలిస్తే అర్థమవుతుంది. పూర్వం రామాపురం నందు సిద్ధయోగి అనే గొప్ప సాధువు వుండేవాడు. రామాపురం ప్రజలందరికీ సిద్ధయోగి అంటే విపరీతమైన గౌరవ అభిమానాలు. ఆయన గ్రామమునకు కూతవేటు దూరంలో ఒక చిన్న ఆశ్రమము ఏర్పరచుకొని ఒకరిద్దరు శిష్యులతో ఉండేవాడు. యావార వృత్తితో జీవిస్తూ ఆశ్రమమునకు వచ్చినవారికి మంచి బోధనలు చేస్తూ ఉండేవాడు. ఒకరోజు ప్రాతఃకాలమున శిష్యుని తోడ్కొని నదీ స్నానమునకు బయలుదేరెను.
ఇద్దరూ నది ఒడ్డున నడుచుకుంటూ పోతూ ఉన్నప్పుడు నదివైపుగా నీటిలో పోతూ వున్న తేలు వారి కంట పడింది. దానిని రక్షించుటకు చుట్టుప్రక్కల ఏదైనా కర్రాలంటి వస్తువు కనపడుతుందేమో అని ఆశగా చూశాడు. ఏమీ కంటికి కానరాలేదు. ఇక జాగుచేస్తే ఆ తేలు నీటిలో మునిగి ప్రాణం పోగొట్టుకుంటుందని గ్రహించి సిద్ధయోగి తన ఎడమ చేతితో తేలును ఒడ్డుకులాగే ప్రయత్నం చేశాడు. తేలు కుట్టింది. సిద్ధయోగి నొప్పికి చేయి విదిలించుకున్నారు. అయినా తేలు దిశ మార్చుకోకపోగా నీటిలోకే పోసాగింది. అపుడు సిద్ధయోగి మరలా రక్షించుటకు పూనుకున్నారు. తేలు మరలా కుట్టింది. అయినా నది వైపే పోతోంది. ఇక లాభం లేదని సిద్ధయోగి పిడికిట తేలుని పట్టుకొని సుదూరంగా విసిరివేసాడు. ఈ ప్రయత్నంలో అనేకమార్లు తేలు సిద్ధయోగిని కుట్టడం సంభవించింది.
ప్రక్కనే వుండి జరిగేదంతా గమనిస్తూన్న భక్తుడు, స్వామి ఈ పనికిమాలిన తెలును రక్షించుటకు ప్రయత్నించినపుడల్లా అది మిమ్ములను కసిగా కుట్టడం గమనించాను. మీరు ప్రయత్నించిన ప్రతిసారి అది విషం చిమ్మింది. మీరు పట్టువదలక దానిని రక్షించారు. అటువంటి వాటిని రక్షించవలసిన ఆవశ్యకత ఉందా అని గురువును శిష్యుడు ప్రశ్నించగా, గురువు ఇలా చెప్పెను. సాధువు అనేవాడికి ఇది అల్పజీవి, అధిక జీవి, దీనికి సహాయం చేయవచ్చు, దీనికి చేయకూడదు అనే నియమం ఏమీ ఉండదు. కాటువేయడం తేలు లక్షణం. ఆపదలో వున్నవారిని రక్షించుట సాధు లక్షణం. ఇక్కడ ఎవరిపని వాళ్ళు చేశారు అంటూ ముగించెను.

-వేదగిరి రామకృష్ణ