మంచి మాట

అభిమానధనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ సకల చరాచర సృష్టికి కర్త కర్మ క్రియ అంతా భగవంతుడే. ఆ భగవంతుడు ఏమి చేసినా మన మంచికే. చేప రూపంలో వేదాలను కాపాడాడు. వరాహరూపంలో భూమిని కాపాడాడు. కూర్మ రూపాన లోక కళ్యాణంకై మేరు పర్వతాన్ని తన వీపుపై మోసి అమృత భాండాన్ని కల్పవృక్షాన్ని, కామధేనువు దేవతల పరం చేశాడు. రాక్షసరాజైన బలి చక్రవర్తిని వామన రూపంలో అధఃపాతాళానికి తొక్కివేశాడు. శ్రీరాముడిగా తన ఖ్యాతిని దిగంతాల అంచులు దాటించాడు. అన్నగా, భర్తగా, రాజుగా పదిమందికి ఆదర్శంగా నిలిచి ఆదర్శ పురుషుడయ్యాడు. అందరి ఆదరాభిమానాలను పొందాడు.
శ్రీకృష్ణుడిలా వచ్చిన అవతారం అత్యంత మహిమాన్వితం. శ్రీకృష్ణుని చేసిన లీలలు అద్భుతం. జననం నుండి నిర్యాణం వరకు శ్రీకృష్ణుడి గాథ అమరం. తన పుట్టుక ఓ విశేషం. కంసుడి వధతో నాంది పలికి మహాపర్వానికి ఆద్యుడిగా నిలిచాడు. అతడు చూపిన మార్గం ధర్మమార్గం. బాలుడిగా గోవులు కాస్తూ కాళీయ మర్దనం చేశాడు. వెన్నలు దొంగిలించాడు. మన్ను తిన్నాడు. గోకులం మనసులు దోచాడు. యశోదమ్మకు భూభోనంతరాళాలు చూపాడు.
అష్ట భార్యలను అలరించాడు. అందులో రుక్మిణీ కళ్యాణం, పారిజాతాపహరణం, శమంతకమణి విజయం లాంటి మధురమైన ఘట్టాలు, కథలు కమనీయాలు.. రమణీయాలు. ఇక పాండవుల కౌరవుల సంకుల సమరం మహాభారతం.. అది ప్రతి భారతీయుడి గుండె చప్పుడు. ధర్మం పక్షాన నిల్చి అధర్మం పీచమణిచాడు. మహాభారత యుద్ధాన శ్రీకృష్ణుడు బోధించిన ‘్భగవద్గీత’ ఈ ప్రపంచానికే మణిమకుటహారం. ప్రతి హిందువు ఇంట తప్పక వుంచుకొని పూజించాల్సిన అద్భుత కావ్యం.. భగవద్గీత.
ప్రతి హిందువు తప్పక చదవాల్సిన గ్రంథం భగవద్గీత. అందులో ప్రతి మాట, ప్రతి వాక్యం మానవుడ్ని పునీతుడ్ని గావిస్తుంది. ప్రతి క్షణం మన ఇంట ఆనందంగా వినవచ్చు. జీవితాన్ని ఆనందమయం చేసుకోవచ్చు అన్నది అక్షరసత్యం.
పరశురామావతారంలో తండ్రిమాటకై తల్లినే తెగనరికాడు. అంతా భగవంతుని లీలా విశేషం, నారసింహ అవతారంలో హిరణ్యకశ్యపుడు పొందిన వరం కోసం.. అతన్ని హతమార్చటానికి.. మనిషి రూపం కొంత, మృగరూపం కొంత ధరించి.. పగలు రాత్రి కాని సంధ్యవేళ ఆ రాక్షసున్ని హతమార్చాడు ఆ శ్రీహరి. శాంతి స్థాపనకై బుద్ధుడిగా అవతారం దాల్చాడు. కలియుగంలో కల్కి భగవానుడిగా.. కచ్చితంగా అవతారమెత్తి ధర్మసంస్థాపనకై తిరిగి వస్తాడని మహాత్ముల మాట. దారుణ మారణాలు, అన్యాయాలు అక్రమాలు పెచ్చుమీరి అంతా కలియుగాంతం అవుతున్న వేళ భగవంతుడు మరో సృష్టికి నాంది పలుకుతాడు. తన బిడ్డలమైన మన కోసం మళ్లీ పుట్టి మనకు పునర్జన్మనిచ్చి మరో ప్రపంచ స్థాపనకై కల్కిగా తప్పక వస్తాడు. తన చల్లని ఒడిలో మనకు సేదతీర్చి సదా అక్కున చేర్చుకొంటాడు.
అట్లాంటి భగవంతుని అపారకృపా విశేషణుణ్ణి దయామయుడ్ని భక్తితో కొలవడమే కాదు భగవంతుని తత్వాన్ని అర్థం చేసుకోవాలి. భక్తి అంటే ప్రేమ అని చెప్పిన నారదుని మాట ప్రకారం మన మనసుల్లో ప్రేమను నింపుకుని దాన్ని ప్రతివారికి అందించాలి. ప్రేమతో విశ్వాన్ని గెలవచ్చు అన్న నానుడిని నిజం చేయడానికి ప్రేమనే ఆస్వాదించి ప్రేమనే పంచాలి. సమబుద్ధి ని అలవర్చు కొంటే అన్ని ప్రాణుల యెడ ప్రేమ భావం ఉత్పన్నవౌతుంది. అందరిలోను చైతన్య జ్యోతిగా ఉండే పరమాత్మ దర్శనం చేసుకొనే తత్వం సులభంగా లభ్యమవుతుంది.
**

మంచిమాట శీర్షికకు ఆధ్యాత్మిక సంబంధమైన వ్యాసాలను సులభశైలిలో ఎవరైనా సొంతంగా రాసి పంపించవచ్చు. రచనలు పాఠకులకు ఆసక్తికరంగా వుండాలి.
మూడు అరఠావులకు తగ్గకుండా వుండాలి. ప్రచురించిన రచనలకు పారితోషికం ఉంటుంది.

- కురువ శ్రీనివాసులు