మంచి మాట

నాగపంచమి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగారాధనవేదకాలం నుంచి వస్తున్నదే. శివుని ఆభరణాలు నాగులు, మహా విష్ణువు పాన్పు నాగులే. వినాయకుడు కూడా నాగులనే యజ్ఞోపవీతంగా ధరిస్తాడు. అసలు ఆదిదంపతులైన పార్వతీ పరమేశ్వరుల కుమారుడు సుబ్రహ్మణేశ్వరుడు. ఈ సుబ్రహ్మణ్యేశ్వరస్వామినీ పూజ కూడా నాగపూజగా సంభావించబడుతుంది.
కశ్యప ప్రజాపతి కద్రువ సంతానం నాగులు. కద్రువ సంతానవతి అయనా తాను ఇంకా సంతానాన్ని పొందలేదన్న బాధతో కశ్యపప్రజాపతి భార్య వినత తన అండాన్ని పగులగొట్టగా అందులో నుంచి ఇంకా తొడలు నిర్మితం కాని అనూరుడు పుట్టాడు. ఆ అనూరుడు అసూయతో ఇంత పని చేశావు కనుక నీ సవతికి నీవు దాసివవుతావు అని తల్లిని శపించాడు. ఆ మాటకు విచారిస్తూ తాను కూడా సంతానవంతురాలు కావాలన్న ఆశతో అండవిచ్ఛేదనానికి పాల్పడ్డానని చెప్పగా అనూరుడు నా తర్వాత పుట్టబోయే నా తమ్ముడే నీ దాస్యవిముక్తి కలిగిస్తాడని వరం ఇచ్చి వెళ్లిపోయాడు. ఆ శాపకారణంగానే కశ్యపుని భార్యలైన కద్రువ వినతల మధ్య మాట పట్టింపు వచ్చి వినత కద్రువ దాసిగా మారింది.
కొంతకాలం గడిచాక గరుత్మంతుడు తన తల్లికి దాస్యవిముక్తిని కలుగచేయాలని అనుకొన్నాడు. కద్రువ సంతానం అయన నాగులను మా అమ్మకు దాస్యవిముక్తి కలిగిం చమని వేడుకున్నాడు. ఆ సందర్భంలోనే నాగులు గరుత్మంతుని ఇంద్రుని దగ్గర నుంచి అమృతం తెచ్చి ఇవ్వమని అడిగారు. ఆ నాగుల కోరిక తీర్చడానికి గరుత్మంతుడు అమరావతికి వెళ్లి అక్కడి అమృత భాండ రక్షకులతో పోరాడి వారి దగ్గరనుంచి అమృతాన్ని తీసుకొచ్చి నాగులకిచ్చే సమయంలో గరుత్మంతుని చూచిన మహావిష్ణువు ఎంతో మెచ్చుకున్నాడు. ఏదైనా వరం కోరుకోమని అన్నాడు. గరుత్మంతుడు ప్రభూ నీకు సేవ చేసే భాగ్యం కన్నా మించింది ఏముంది. దాన్ని నాకు కలుగచేయమని వేడుకున్నాడు. ఆ గరుత్మంతుని కోరికను మన్నించి మహావిష్ణువు గరుత్మంతుణ్ణి తన వాహనంగా చేసుకొన్నాడు. అలా నాగులకు అమృతం ఇచ్చినరోజు అని, గరు త్మంతునికి మహావిష్ణువు వరం ఇచ్చిన రోజు అని ఈ శ్రావణ పంచమిని నాగ పంచమిగా భావించి నాగపూజ చేస్తారు. మన రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లోను, ఉత్తర భారతంలోని పలు ప్రాంతాలలో కూడా నాగపంచమినాడు పుట్టలో పాలు పోసే సంప్రదాయం ఉంది. ఇంటి ద్వారానికి రెండువైపులా సర్పాల ఆకృతులను వేసి విధి విధానంగా లేత గరిక, దర్భ, గంధపుష్పాదులు, పెరుగు మొదలైన వాటిలో అర్చించి బ్రాహ్మణులకు సంతర్పణ చేస్తారు. భక్తితో నాగేంద్రుని పూజచేస్తే సర్పభయం ఉండదు. స్కాంధపురాణంలో నాగపంచమి ప్రాశస్త్యాన్ని పరమ శివుడే చెప్పినట్లుంది. తెలుస్తోంది.
ఒకనాడు తనకు శేషవాహనంగా ఉన్న ఆదిశేషుని సేవకు సంతసిల్లిన విష్ణ్భుగవానుడు ఆదిశేషుని ఏదైనా వరం కోరుకోమని అన్నాడు. అందుకు ఆ ఆదిశేషుడు ‘‘శ్రావణ పంచమినాడు మానవాళి తమను అర్చించే విధిని కలుగ చేయమని కోరు కున్నాడట. దానివల్లే ఈ శ్రావణ పంచమి ఈ నాగుల పంచమిగా సంభావిస్తారనేది కూడా పురాణ వాక్కు. ఈ రోజు సర్పపూజ చేసినవారికి విషబాధలు కలుగవు. నాగపూజారాధకుల వంశాభివృద్ధికి ఎలాంటి ఆటంకాలుఉండవు అని మహావిష్ణువు కూడా వరమిచ్చాడు. నాగులకు గోధుమతో చేసిన పాయసాన్ని నైవేద్యంగా పెట్తారు. సర్పస్తోత్రాన్ని చదివినవారికి ఇంద్రియాల వల్ల ఎలాంటి చిక్కులు ఏర్పడవు. తమను పూజించిన వారికి సకల కార్యసిద్ధి చేకూరగలదు నాగులు మానవాళికి వరమిచ్చినట్లు ఐతిహ్యం. కొందరు పుట్టలో పాలుపోసి ఇంట్లో పూజచేస్తారు. మరికొందరు నాగప్రతిష్టలకు పూజచేస్తారు. నాగప్రతిమను సద్భాహ్మణునికి దానం ఇచ్చినా నాగ పూజారాధన వల్ల వచ్చే ఫలితం లభిస్తుందంటారు. రాహుమంత్రం, సుబ్రహ్మణ్య మంత్రం సంపుటి చేసి జపించి సర్పమంత్రాలు చదువుతూ, పగడాన్ని నాగపంచమని నాడు ధరిస్తే అనుకొన్న ఫలితాలను పొందవచ్చు.

- నాగలక్ష్మి