మంచి మాట

సరస్వతీ పూజ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాగ్దేవి, వసుధా తీవ్రా - మహాభద్రా మహాబలా
భోగదా భారతీ భామా గోవిందా గోమతీ శివా.... అందరూ సరస్వతీదేవిని స్మరిద్దాం. సకల విద్యలను అమ్మఅనుగ్రహంతో కరతలామలకం చేసుకొందాం.
వీణాపాణియై చతుర్ముఖుని ఇల్లాలై ఆనందంగా ఉంటారని అభయాన్నిచ్చే తల్లే శ్రీ మహాసరస్వతి. ‘శ్రోతస్విని’ అని లేదా ‘గమన రూపిణి’ అనేవి సరస్వతి శబ్దానికి అర్థాలే కాని ప్రచోదనాశక్తి స్వరూపిణిగా శరన్నవరాత్రుల్లో భావిస్తాం.
ఈ ఆదిపరాశక్తి రూపానే్న సకలవిద్యారూపిణిగా భావించి వాగ్దేవిగా పూజిస్తారు. వాజ్ఞ్మయరూపంలోని అన్ని ప్రక్రియలన్నింటి రూపంగా ఏ దేవిని భావిస్తారో ఆమెయే సరస్వతీదేవిఅన్నారుఆదిశంకరాచార్యులు.
శరన్నవరాత్రిలో సప్తమితిథి, మూలనక్షత్రం రోజును శారదా దేవిగా ఆదిపరాశక్తిని అలంక రిస్తారు. -ఈ శారదాదేవి బుద్ధిని విద్యను, జ్ఞానమును, వివేచనాశక్తిని, కల్పనా నైపుణ్యాన్ని ధారణా శక్తిని ప్రసాదిస్తుంది. ఎంతటి వానికైననూ సరస్వతీ అనుగ్రహం తప్పనిసరిగా ఉండితీరాలి. లక్ష్మీదేవి ఎంత ముఖ్యమో సరస్వతీ దేవి అంతేముఖ్యం. కనుక అసలు విఘ్నాలు తొలగించే నాయకుణ్ణి పూజించాలి. పరాశక్తే అన్ని రూపాలకు కారణ మయనా విఘ్నహారిగా వినాయకుణ్ణి, విద్యలకోసం సరస్వతిని, సంపద కోసం లక్ష్మిని ఈ మూడు రూపాలను సప్తమి తిథినాడు పూజిస్తే సర్వసుఖాలు లభ్యమవుతాయ. ఈమూడు రూపాల ఆరాధన వల్ల సంస్కారము, సత్వగుణము, మాటతీరు సద్బుద్ధి, విచక్షణాజ్ఞానము అబ్బుతాయ. అపుడే నరుడు నారాయణుడుగా కీర్తించబడుతాడు.
ఓసారి శుంభుడు రాజుగా, నిశుంభుడు మంత్రిగా చండముండ రక్తబీజ ధూమ్రలోచనులు సేనాపతులుగా రాజ్యం ఏలారు. ప్రజలందరి ని హింసించారు. ఇంద్రాది దేవతలను అష్టకష్టాలు పెట్టారు. హింస పెచ్చుమీరింది. అధర్మం పెట్రేగింది. పైగా కేవలం నారి చేతిలోనే తమకు మృత్యువు ఆసన్నమవ్వాలని వారు వరాన్ని పొందారు.
అందువల్ల వారి బాధలను ఓర్చుకోలేక, ఎవ్వరూ ఏమీ చేయలేక అందరూ కలసి ఆదిపరాశక్తి అయన అమ్మనే వేడుకున్నారు. అప్పుడు అమ్మ ఇంద్రాది దేవతలకు అభయమిచ్చింది- వాగ్దేవి తన శరీరము నుండి ‘కౌశికి’ అనే శక్తిని సృజించింది. ఆ కౌశికియే- ‘కాళీమాత’. కాళీ శక్తితో శుంభనిశుంభరాక్షసులను సంహరించింది.
రాక్షససంహారానంతరం ఆ తల్లిని నోరారా స్తుతిస్తూతమను కాపాడమని వేడుకొంటూ ఆశ్వయుజమాసంలో సప్తమీ తిథినాడు శక్తిస్వరూపిణిని సరస్వతి రూపంలో అలంకరించి పూజిస్తారు.
...........................................................
మంచిమాట శీర్షికకు ఆధ్యాత్మిక సంబంధమైన వ్యాసాలను
సులభశైలిలో ఎవరైనా సొంతంగా రాసి పంపించవచ్చు. రచనలు పాఠకులకు ఆసక్తికరంగా వుండాలి. మూడు అరఠావులకు తగ్గకుండా వుండాలి. ప్రచురించిన రచనలకు పారితోషికం ఉంటుంది.

- నాగలక్ష్మి