మంచి మాట

పురుషోత్తముడు శ్రీరాముడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీరాముడు హిందువుల ఆరాధ్య దైవం. అతడి పుట్టినరోజే శ్రీరామనవమి. అవతార పురుషుల జన్మదినాల్లో కృష్ణాష్టమి, శ్రీరామనవమి ఎంతో ముఖ్యమైనవి. ఏటా చైత్రశుక్ల నవమినాడు మనమంతా శ్రీరామనవమి పండుగను ఎంతో భక్తిశ్రద్ధలతో జరుపుకుంటాం. వసంత నవరాత్రుల పేరిట రామదినోత్సవ వేడుకలు జరుపుతారు. ఈ పండుగను గురించి వ్రత చూడామణియందు అగస్త్య సంహితలో ఇలా వ్రాయబడింది.
చైత్రమాసే, నవమ్యాంతు జాతో రామస్స్వయంహరిః
పునర్వ సృష్ట సంయుక్తాసా తిధిస్సర్వకామదా
చైత్రశుక్ల నవమినాడు పునర్వసు నక్షత్రమందు శ్రీమహావిష్ణువు స్వయంగా శ్రీరామావతారమెత్తాడు.రాముడిని దైవంగా భావించి భక్తిశ్రద్ధలతో కొలిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయన్నది మనందరి నమ్మకం. కొన్నిచోట్ల దుర్గా, వినాయక నవరాత్రుల్లాగా ఆ రోజు సీతారాముల విగ్రహాల్ని ప్రతిష్ఠించి హరికథా నృత్యగానాలతో భక్తుల్ని అలరింపజేస్తారు.
రాముడి చరిత్రను అక్షరబద్ధంచేసినవారు వాల్మీకి మహర్షి. ఈయన రాసిన రామాయణమే ఆదికావ్యంగా ప్రసిద్ధి చెందింది. హిందువులలో సీతారాముల కథ తెలియనివారుండరు. ఏకపత్నీవ్రతుడు శ్రీరామచంద్రుడు. పరమ పతివ్రతా శిరోమణి సీతాదేవి. వీరిరువురూ మనకు ఆదర్శమూర్తులు.
దక్షిణ అమెరికా దేశం మధ్యభాగంలో నివసించే రెడ్ ఇండియన్ మున్నగు ఆదిమ నివాసులు నేటికి ప్రతి సంవత్సరం సీతారాముల ఉత్సవాన్ని ఎంతో వైభవోపేతంగా జరుపుతుంటారు. వారిని స్తుతిస్తూ పాటలు పాడుతుంటారు. అంతేకాదు ఈ ఉత్సవాలలో సీతారాముల వేషధారణలో నాటకాలు కూడా ప్రదర్శిస్తుంటారని పరిశోధకులు చెబుతున్నారు. పూర్వం హిందువులు అమెరికా దేశంతో వ్యాపారం చేసేవారన్నా ఆశ్చర్యపోనవసరం లేదు. ప్రాచీన కాలంలో నేటి సంకుచిత పద్ధతివలెగాక మనవాళ్ళు తమ మతాచారాన్ని అన్ని ఖండాలకు విస్తరింపజేసారన్న భావన కూడా వుంది. ఒకానొక కాలంలో హిందువులకు మించిన సముద్ర వ్యాపారులు ఎక్కడా ఉండేవారు కాదుట. కాబట్టి రామాయణ గాథ హిందువులచే కొలంబసుకన్నా రెండు మూడు వేల ఏండ్లకు పూర్వమే ఖండ ఖండాంతరాలకు వ్యాపింపజేయబడిందన్న నానుడి కూడా ఉంది.
వాల్మీకి రామాయణం మనందరికి ఆదర్శగ్రంథం. పితృవాక్య పరిపాలనకు, ఏకపత్నీవ్రతా త్యాగానికి శ్రీరాముడే నిదర్శనం. అలాగే పతిభక్తికి సీతమ్మ తల్లి, స్వామిభక్తి సేవాపరాయణతకు హనుమంతుడు ఇలా ఎన్నో ఎనె్నన్నో. ఉత్కృష్ట పాత్రలతో రామాయణాన్ని రాసిన వాల్మీకి మహర్షి ధన్యుడు. ఆ మహనీయుడు రాసిన రామయణాన్ని చదివితే మనమంతా ధన్యులం కాగలం. దసరా, దీపావళి, సంక్రాంతి పండగలులాగా శ్రీరామ, శ్రీకృష్ణ జయంతుల్ని కూడా పండుగ లాగా చేసుకోవాలి. రామాయణంలోని ప్రతిపాత్రను అందరూ ఆదర్శవంతంగా పెట్టుకుని ఎవరి జీవితాన్ని వారు బాగుచేసుకోవాలి. మనం ఒక్కమంచి చేయడం మొదలు పెడితే అన్నీ మంచి పనులే చేయగలిగే స్థితికి చేరుతాం.
రాముని ఆదర్శంగా తీసుకొంటే చాలు మనమూ రాముని బాటలో నడిచి రాముని ప్రతిరూపాలుగా మారుదాం.

-దూరి వెంకటరావు