ఆంధ్రప్రదేశ్‌

మంగళగిరి బరిలో జనసేన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి: ఏపీలోని మంగళగిరి నియోజకవర్గంలో పోటీ రసవత్తరంగా మారింది. ఈ నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున మంత్రి నారా లోకేష్, వైకాపా నుంచి ఆళ్ల రామకృష్ణారెడ్డి పోటీ చేస్తున్నారు. ఈ సీటును జనసేన సీపీఐకి కేటాయించింది. అనూహ్యంగా జనసేన అధినేత ఈ రోజు జనసేన అభ్యర్థిగా చల్లపల్లి శ్రీనివాస్ నామినేషన్ వేయనున్నారని ప్రకటించటంతో సీపీఐ నేతలు అసంతృప్తికి గురయ్యారు. ఈ నేపథ్యంలో కృష్ణాజిల్లాలోని కొన్ని స్థానాలు మార్చటంపై కూడా సీపీఐ అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. సీపీఐ తరపున ముప్పాళ్ల నాగేశ్వరరావు నామినేషన్ వేయాలని సంసిద్ధులయ్యారు. అనూహ్యంగా జనసేన అధినేత తీసుకున్న నిర్ణయంతో సీపీఐ నేతలు అసంతృప్తికి గురయ్యారు. ఇదిలావుండగా స్థానిక నేతలు నుంచి వచ్చిన ఒత్తిడి మేరకు పవన్ కల్యాణ్ ఈ స్థానాన్ని మార్చినట్లు భావిస్తున్నారు.